STOCKS

News


తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు..!

Saturday 25th August 2018
Markets_main1535184887.png-19642

ముంబై: దేశీయ విదేశీ మారక నిల్వలు ఆగస్టు 17తో ముగిసిన వారాంతానికి 33.2 మిలియన్ డాలర్ల మేరతగ్గి 400.847 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. విదేశీ కరెన్సీ ఆస్తుల్లో తగ్గుదల వల్లే  నిల్వలు కూడా తగ్గుముఖం పట్టాయని రిజర్వ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. పతనమవుతున్న రూపాయిని ఆదుకునేందుకు ఆర్‌బీఐ తన వద్ద ఉన్న డాలర్‌ నిల్వలను అమ్మివేస్తుండడంతో దేశంలో విదేశీ మారక నిల్వలు  తగ్గుముఖం పట్టాయని మార్కెట్లు విశ్లేషకులు అంటున్నారు. గత వారం కూడా ఫారెక్స్ నిల్వలు భారీగా 1.822 బిలియన్ డాలర్లు తగ్గి 400.881 బిలయన్‌ డాల్లరకు చేరుకున్నాయి. మొత్తం నిల్వలలో ప్రధాన కరెన్సీ ఆస్తులు 60.2 మిలియన్ డాలర్లు తగ్గి 376.205 బిలియన్ డాలర్లకు తగ్గాయి. బంగారం నిల్వలు 36.1 మిలియన్ డాలర్లు పెరిగి 20.727 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కాగా ఐఎంఎఫ్ వద్ద నిల్వలు కూడా 5.7 మిలియన్ డాలర్లు తగ్గి 2.452 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.



You may be interested

ఎస్‌అండ్‌పీ 500.. రికార్డ్‌ కొట్టింది..

Saturday 25th August 2018

అమెరికా మార్కెట్లు జోరు మీదున్నాయి. మూడు ప్రధాన ఇండెక్స్‌లలో రెండు శుక్రవారం కొత్త గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. ఎస్‌అండ్‌పీ 500 ఎట్టకేలకు జీవిత కాల గరిష్ట స్థాయికి చేరింది. జనవరి 26 నాటి తన రికార్డ్‌ స్థాయిని అధిగమించడానికి ఇండెక్స్‌కు ఏడు నెలలు పట్టింది. మరోవైపు నాస్‌డాక్‌ ఇండెక్స్‌, స్మాల్‌ స్టాక్స్‌ రస్సెల్‌ 2000 ఇండెక్స్‌లు కూడా శుక్రవారం రికార్డ్‌ స్థాయిల వద్ద ముగిశాయి. డౌజోన్స్‌ మాత్రం తన జనవరి

పావెల్‌ ప్రసంగంతో పసిడి పరుగులు

Saturday 25th August 2018

న్యూయార్‌:- వడ్డీరేట్ల పెంపు వైఖరిపై ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్ పావెల్ మనోగతం బయటపడంతో పసిడి ధర పరుగులు పెట్టింది. వడ్డీరేట్లను క్రమంగా పెంచుకుంటూ పోతామని పావెల్‌ తెలపడంతో గత రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 18.30డాలర్లు లాభపడింది. జాక్సన్ హోల్ ఎకనామిక్ సింపోజియమ్‌లో శుక్రవారం పావెల్ ప్రసంగిస్తూ వడ్డీరేట్ల పెంపు జాప్యం చేస్తే వ్యవస్థలో స్థిరీకరణ దెబ్బతింటుంది. కాబట్టి వడ్డీ రేట్లను క్రమంగా పెంచుకుంటూ పోతామని ఆయన

Most from this category