STOCKS

News


ఎఫ్‌ఐఐలు ఇష్టపడ్డ స్టాక్స్‌ ఇవే..

Tuesday 13th November 2018
Markets_main1542092649.png-21946

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు సెప్టెంబర్‌ క్వార్టర్‌లో తీవ్ర ఒడిదుడుకులకు గరయ్యాయి. ఒకవైపు సెన్సెక్స్‌ ఆగస్ట్‌ 29న రికార్డ్‌ గరిష్ట స్థాయికి చేరితే.. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా దాదాపు రూ.10,000 కోట్లను వెనక్కు తీసుకున్నారు. ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌లో నికరంగా చూస్తే విక్రయదారులుగా ఉన్నా కూడా.. పలు కంపెనీలు షేర్లను కొనుగోలు చేశారు. ఏస్‌ ఈక్విటీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నాలుగు క్వార్టర్లలో ఎఫ్‌ఐఐలు దాదాపు 136 కంపెనీల్లో స్థిరంగా వాటాలను పెంచుకుంటూ వచ్చారు. ఈ 136 కంపెనీల్లో 96 కంపెనీల స్టాక్స్‌ 2018లో 84 శాతం వరకు పడిపోవడం గమనార్హం. ఎక్కువగా నష్టపోయిన స్టాక్స్‌ను గమనిస్తే.. ఇన్‌ట్రాసాఫ్ట్‌ టెక్నాలజీస్‌ షేరు 84 శాతంమేర పతనమైంది. తర్వాత ఆశాపుర ఇంటిమేట్స్‌ ఫ్యాషన్‌ 82 శాతం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ నెట్‌వర్క్‌ 76 శాతం, ఎస్‌చంద్‌ 63 శాతం, సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 60 శాతం, జువారి గ్లోబల్‌ 57 శాతం, ప్రభాత్‌ డెయిరీ 55 శాతం, సీఎంఐ 54 శాతం, జేఎం ఫైనాన్షియల్‌ 51 శాతం, ఓరియెంట్‌ సిమెంట్‌ 50 శాతం, సెంచరీ టెక్స్‌టైల్స్‌ 43 శాతం, జై కార్ప్‌ 41 శాతం, మ్యాక్స్‌ వెంచర్స్‌ 45 శాతం, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ 46 శాతం, మిందా కార్పొరేషన్‌ 44 శాతం పడిపోయాయి. 
ఇక మిగిలిన 40 స్టాక్స్‌ 2018లో ఇప్పటి దాకా 151 శాతంమేర లాభపడ్డాయి. బాగా పెరిగిన స్టాక్స్‌ను గమనిస్తే.. ఎక్సైల్‌ ఇండస్ట్రీస్‌ 151 శాతం, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ 89 శాతం, హెచ్‌ఈజీ 82 శాతం, లార్సెన్‌ అండ్‌ టుబ్రో ఇన్ఫోటెక్‌ 57 శాతం, ఇంటర్నేషనల్‌ పేపర్‌ ఏపీపీఎం 52 శాతం, ఇంటెలెక్ట్‌ డిజైన్‌ 51 శాతం, ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ 51 శాతం, హెచ్‌ఐఎల్‌ 49 శాతం, ఫస్ట్‌సోర్స్‌ సోల్యూషన్స్‌ 49 శాతం, అస్ట్రాజెనెకా ఫార్మా 47 శాతం, జెన్‌సర్‌ టెక్నాలజీస్‌ 43 శాతం, వీఐపీ ఇండస్ట్రీస్‌ 25 శాతం, జేకే పేపర్‌ 23 శాతం, జూబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ 22 శాతం, అతుల్‌ 21 శాతం, జేఎస్‌డబ్ల్యూ హోల్డింగ్స్‌ 21 శాతం, సువెన్‌ లైఫ్‌సైన్సెస్‌ 19 శాతం, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ 13 శాతం, సొనాట సాఫ్ట్‌వర్‌ 10 శాతం పెరిగాయి.  
ఎఫ్‌ఐఐలు అక్టోబర్‌ నెలలో నికరంగా చూస్తే విక్రయదారులుగా ఉన్నారు. ఈక్విటీ, డెట్‌ మార్కెట్ల నుంచి రూ.38,900 కోట్లను వెనక్కు తీసుకున్నారు. గత రెండేళ్లలో ఎఫ్‌ఐఐలు ఎక్కువగా డబ్బుల్ని వెనక్కు తీసుకోవడం ఇదే తొలిసారి. ఇక ఎఫ్‌ఐఐలు సెప్టెంబర్‌లో రూ.21,000 కోట్లకుపైగా నిధుల్ని క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. అయితే జూలై, ఆగస్ట్‌లలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,500 కోట్లను మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. 
క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత వంటి అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ పెరుగుదల కూడా విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ భారత్‌ మార్కెట్‌పై జాగ్రత్తతో ఉన్నారు. డాలర్‌ బలపడటం, రూపాయి పడిపోవడం వల్ల పెట్టుబడుల ఉపసంహరణలు కొనసాగవచ్చనే అంచనాలున్నాయి. ఫెడరల్‌ రిజర్వు భవిష్యత్‌ వడ్డీ రేట్ల పెంపు కూడా ఎఫ్‌ఐఐలను ఆకర్షించవచ్చు.  You may be interested

పసిడికి డాలర్‌ ఎఫెక్ట్‌

Tuesday 13th November 2018

డాలర్‌ ఇండెక్స్‌ ఏడాదిన్నర గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతుండడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం కనిష్ట ధర వద్ద ట్రేడ్‌ అవుతోంది. భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం గం.11.30లకు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 0.40 డాలర స్వల్ప నష్టంతో 1,203.10 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లో డాలర్‌ ఇండెక్స్‌ 17 నెలల గరిష్టానికి చేరుకోవడంతో పసిడి ధర వరుసగా 3రోజు నష్టాలతో ముగిసింది. ఐరోపా కూటమి

ఫార్మాకు షేర్లకు జ్వరం

Tuesday 13th November 2018

మంగళవారం ఉదయం సెషన్‌లో ఫార్మా షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈ అన్ని రంగాల్లోకెల్లా ఫార్మా ఇండెక్స్‌ అత్యధికంగా 2శాతం నష్టపోయింది. ఉదయం గం.11:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపుతో పోలిస్తే 1.75శాతం నష్టంతో 9,378 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 10 షేర్లలో 9 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఒక్క డాక్టర్‌ రెడ్డీస్‌ మాత్రం 1శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా

Most from this category