STOCKS

News


187 కంపెనీల్లో పెరిగిన ఎఫ్‌ఐఐల వాటా

Thursday 18th April 2019
Markets_main1555610273.png-25212

ఫిబ్రవరి నుంచి మార్చి చివరికి రూ.40,000 కోట్లను మన మార్కెట్లలోకి పంప్‌ చేసిన విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు... మొత్తం మీద మార్చి త్రైమాసికంలో 187 కంపెనీల్లో వాటాలను పెంచుకున్నారు. అదే సమయంలో 200 కంపెనీల్లో లాభాలు తీసుకుని వాటాలు తగ్గించుకున్నట్టు గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.

 

ఏప్రిల్‌ 12 నాటికి వెలుగు చూసిన కంపెనీల వాటాదారుల వివరాలను పరిశీలించగా... యాక్సిస్‌ బ్యాంకు, యూపీఎల్‌, పీఎన్‌బీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏసీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, అరబిందో ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, డీఎల్‌ఎఫ్‌, టోరెంట్‌ ఫార్మా, ఏబీబీ, పీఅండ్‌జీ హైజీన్‌ అండ్‌ హెల్త్‌కేర్‌, బ్యాంకు ఆఫ్‌ బరోడా, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఐవోసీ, దివిస్‌ ల్యాబ్స్‌ కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్న వాటిల్లో ఎక్కువ స్టాక్స్‌ అధిక బీటావేనని, వీటిల్లో వృద్ధి సంకేతాలున్న కంపెనీలను ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవచ్చని నిపుణుల అభిప్రాయం. బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఆటోమొబైల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఫార్మా కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా కొనుగోళ్లు చేశారు. ‘‘వీటిల్లో ఎక్కువ స్టాక్స్‌ హైబీటా కేటగిరీలోనివి. అయితే వీటిల్లో వ్యాల్యూ కూడా ఉంది. యాక్సిస్‌ బ్యాంకు ఆస్తుల నాణ్యత మెరుగుపరుచుకుంది. నికర వడ్డీ మార్జిన్‌ క్వార్టర్‌ వారీగా 18 శాతం పెరిగింది. స్థూల ఎన్‌పీఏలు తగ్గాయి. కనుక ఈ స్టాక్‌ను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవచ్చు. ఎన్‌సీసీ సైతం అధిక వృద్ధి అవకాశాలను ఆఫర్‌ చేస్తోంది’’ అని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌ పేర్కొన్నారు. హైబీటా స్టాక్స్‌ చాలా రిస్క్‌తో కూడినవని భావిస్తుంటారు కానీ, వాస్తవంగా ఇవి సంపదను సృష్టిస్తాయన్నారు. 

 

విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున మన ఈక్విటీ మార్కెట్లలోకి నిధులు కుమ్మరించిన సమయంలోనే 206 కంపెనీల్లో వాటాలు తగ్గించుకోవడం గమనార్హం. బజాజ్‌ హోల్డింగ్స్‌, ఎన్‌టీపీసీ, యూనియన్‌ బ్యాంకు, ఐటీసీ, ఎన్‌ఎండీసీ, ఐడీబీఐ బ్యాంకు, హిందుస్తాన్‌ జింక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, క్యాడిలా హెల్త్‌కేర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌యూఎల్‌, గ్లాక్సో స్మిత్‌క్లెయిన్‌ కన్జ్యూమర్‌, ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌, న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ, ఎన్‌ఎండీసీ కంపెనీల్లో మార్చి క్వార్టర్లో ఎఫ్‌ఐఐల వాటా డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే తగ్గింది. అయితే, ఇది సాధారణ లాభాల స్వీకరణలో భాగమేనని అనలిస్టులు అంటున్నారు. రంగాల వారీగా, పోర్ట్‌ఫోలియోను రీబ్యాలన్స్‌ చేసుకోవడంలో భాగంగా దీన్ని పేర్కొంటున్నారు. ‘‘వీటిల్లో చాలా వరకు గత నాలుగేళ్లలో బాగా ర్యాలీ చేసినవి. ప్రస్తుతం అధిక వ్యాల్యూషన్లకు చేరాయి. కనుక దీన్ని లాభాల స్వీకరణగా భావిస్తున్నాం. తిరిగి ఇవి ఆకర్షనీయమైన వ్యాల్యూషన్లకు వచ్చినప్పుడు కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నాం’’ అని ఎస్‌ఎస్‌జే ఫైనాన్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ అతీష్‌ మత్లవాలా తెలిపారు.You may be interested

నెల రోజుల్లో భారీగా పెరిగిన షేర్లివి!

Thursday 18th April 2019

ఫిబ్రవరి మధ్య నుంచి విదేశీ ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్లతో మన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నూతన గరిష్టాలకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్‌ 11 వరకు కేవలం 36 సెషన్లలో సెన్సెక్స్‌ 3,200 పాయింట్లు పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోనే తిరిగి ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు ఈ ర్యాలీకి తోడ్పడ్డాయని అనలిస్టుల అంచనా. అయితే, ఈ 32 సెషన్లలో కొన్ని స్టాక్స్‌ మాత్రం విపరీతంగా పెరిగేశాయి.    స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌

అడాగ్‌ షేర్లు...నిలువునా పతనం

Thursday 18th April 2019

మార్కెట్‌ లాభాల స్వీకరణలో భాగంగా అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) గురువారం ట్రేడింగ్లో భారీగా పతనమయ్యాయి. గత రెండు రోజుల్లో 15 శాతం నష్టపోయిన రిలయన్స్‌ క్యాపిటల్‌ షేరు నేటి ట్రేడింగ్‌లో మరో 13శాతం కోల్పోయి రూ.149.65 వద్ద స్థిరపడింది. ఇదే గ్రూప్‌లోని రిలయన్స్‌ పవర్‌ 14శాతం నష్టపోయి 8.10 వద్ద, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 4శాతం నష్టపోయి 2.40శాతం వద్ద ముగిశాయి. అలాగే రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ 8.80శాతం, రిలయన్స్ హోమ్‌

Most from this category