STOCKS

News


విదేశీ ఇన్వెస్టర్ల నుంచి మరిన్ని అమ్మకాలు

Monday 22nd October 2018
Markets_main1540194479.png-21361

ఫెడరల్‌ రిజర్వు డిసెంబర్‌లోనూ వడ్డీ రేట్లను 2.5 శాతానికి పెంచవచ్చనే అంచనాలున్నాయి. ఫెడ్‌ రేటు 2019లో 3 శాతానికి, 2020 నాటికి 3.5 శాతానికి చేరే అవకాశముంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా నుంచి మరిన్ని నిధులను వెనక్కు తీసుకెళ్లొచ్చని ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజరీ సంస్థ విలియమ్‌ ఓనీల్‌ అండ్‌ కో ప్రెసిడెంట్‌, సీఈవో స్టీవెన్‌ బిర్చ్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌పై జాగ్రత్తతో ఉన్నారని స్టీవెన్‌ బిర్చ్‌ తెలిపారు. ఈ ఏడాది మొత్తంగా ఇండియన్‌ మార్కెట్ల నుంచి 13.7 బిలియన్‌ డాలర్లను (డెట్‌ మార్కెట్‌ నుంచి 7.7 బిలియన్‌ డాలర్లను, ఈక్విటీ నుంచి 6 బిలియన్‌ డాలర్లును) వెనక్కు తీసుకున్నారని పేర్కొన్నారు. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు వల్ల నిధుల ఉపసంహరణ మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. నవంబర్‌ 4 నుంచి ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అమలులోకి వస్తాయని, అప్పుడు సరఫరా ఆందోళనల వల్ల క్రూడ్‌ ధరలు పెరుగుతాయని, దీని వల్ల ఇండియా కరెండ్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) విస్తరిస్తుందని పేర్కొన్నారు. దీని వల్ల రూపాయి విలువ ప్రభావితమౌతుందని తెలిపారు. రూపాయి క్షీణత, డాలర్‌ బోలోపేతమవ్వడం, అమెరికా పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం, అలాగే అక్కడి  పటిష్టమైన ఆర్థిక వృద్ధి రేటు వంటి పలు అంశాల వల్ల ఇటీవల కాలంలో భారత్‌ నుంచి విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు తరలిపోయాయని వివరించారు. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు కూడా ఇందుకు కారణంగా పేర్కొనవచ్చని తెలిపారు. ఇక బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల వల్ల అమెరికా స్టాక్‌ మార్కెట్లు పడిపోయాయని పేర్కొన్నారు. ఆర్‌బీఐ వద్ద దాదాపు 400 బిలియన్‌ డాలర్ల ఫారెక్స్‌ నిల్వలు ఉండటం వల్ల రానున్న నెలల్లోనూ రూపాయి నిలకడగా ఉండొచ్చని అంచనా వేశారు. రూపాయి ఒడిదుడుకులు తగ్గితే, విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ మార్కెట్‌లోకి రావడానికి ఇష్టపడతారని పేర్కొన్నారు. భారత్‌ వృద్ధి అంచనాలు బాగున్నాయని తెలిపారు. ఇటీవలే ఐఎంఎఫ్‌.. భారత్‌ 2018లో 7.4 శాతం, 2019లో 7.8 శాతం వృద్ధి సాధిస్తుందని పేర్కొంది. 
ఫార్మా, ఇన్సూరెన్స్‌, వినియోగం రంగాలకు చెందిన స్టాక్స్‌ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని స్టీవెన్‌ బిర్చ్‌ తెలిపారు. సిప్లా, బయోకాన్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌, ఆదిత్య బిర్లా ప్యాషన్‌ అండ్‌ రిటైల్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌ షేర్లను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు 6-7 శాతం శ్రేణిలో ఉన్నాయని తెలిపారు. సెప్టెంబర్‌లో డబ్ల్యూపీఐ 5 శాతంగా నమోదయ్యిందని గుర్తుచేశారు. రూపాయి క్షీణత, క్రూడ్‌ ధరల పెరుగుదల వల్ల ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. అప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై రియల్‌ రిటర్న్‌ రేటు 1-2 శాతంగా ఉంటుందని తెలిపారు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీని కన్నా ఎక్కువ రిటర్న్‌ పొందొచ్చని పేర్కొన్నారు. అయితే స్టాక్స్‌ ఎంపికలో జాగ్రత్త వహించాలని సూచించారు. 3-5 ఏళ్ల లక్ష్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేయవచ్చని తెలిపారు. 


 



You may be interested

దీర్ఘ, మధ్యకాలిక దృష్టితోనే మార్కెట్‌ పెట్టుబడులు చేయాలి

Monday 22nd October 2018

మార్జిన్లపై ఒత్తిడి, వృద్ధి రేటు మందగమనం వంటి అంశాల ప్రభావం డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలపై కొట్టిచ్చినట్లు కనిపిస్తుందని సార్థీ గ్రూప్‌ ఎండీ, సీఐవో కుంజ్‌ బన్సాల్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వారంలో చాలా కంపెనీలు క్యూ2 ఎర్నింగ్స్‌ను ప్రకటించనున్నాయని, ఇందులో కొన్ని పాజిటివ్‌గా, మరికొన్ని నెగటివ్‌గా ఆశ్చర్యానికి గురిచేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత స్థూల ఆర్థికాంశాల నేపథ్యంలో పాజిటివ్‌ కన్నా

రెండంకెల రాబడి కోసం ఐదు షేర్లు

Monday 22nd October 2018

మార్కెట్లో బౌన్స్‌ బ్యాక్‌ మరో వారం కొనసాగకపోవచ్చని నార్నోలియా బ్రోకరేజ్‌ అభిప్రాయపడింది. అయితే దీర్ఘకాలంలో సూచీలు బుల్లిష్‌గా ఉంటాయని తెలిపింది. లాంగ్‌టర్మ్‌లో రెండంకెల రాబడినిచ్చే ఐదు షేర్లను సిఫార్సు చేసింది. 1. కోల్‌ ఇండియా: టార్గెట్‌ రూ. 322. స్టాప్‌లాస్‌ రూ. 254. స్వల్పకాలిక కన్సాలిడేషన్‌ అనంతరం పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. కొన్ని రోజులుగా హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ఫార్మేషన్‌ ఏర్పరుస్తోంది. దిగువన రూ. 276 స్థాయిల్లో డబుల్‌బాటమ్‌ ఏర్పరుచుకుంది. ఇండికేటర్లు

Most from this category