STOCKS

News


విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకం సడల్లేదు: విలియం ఓ నీల్‌

Thursday 3rd January 2019
Markets_main1546454014.png-23374

గతేడాది నిరాశ తర్వాత... మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని, 2019లో మార్కెట్‌ ర్యాలీ చేస్తే అన్ని సూచీలు పాల్గొంటాయని విలియం ఓ నీల్‌ ఇండియా రీసెర్చ్‌ డైరెక్టర్‌ విపిన్‌ ఖరే తెలిపారు. మే నెలలో జరిగే ఎన్నికలు కీలకమైన వ్యవహారమని, ఫలితాలు స్టాక్‌ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపవన్నారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలప్పుడు మార్కెట్లు ఏ విధంగా స్పందించాయో గుర్తు చేశారు. భారత్‌ ఇప్పటికీ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, అంతర్జాతీయంగా పరిస్థితులే సానుకూలంగా లేవన్నారు. అయినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ బలం స్టాక్‌ మార్కెట్లకు సానుకూలం కాగలదన్నారు. ‘‘విదేశీ ఇన్వెస్టర్లు భారత వృద్ధి పట్ల బుల్లిష్‌గా ఉన్నారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి నిర్ణయాల కోసం ఎన్నికల విషయాలను కాకుండా ఆర్థిక మూలాలను చూస్తారు’’ అని ఖరే చెప్పారు. త్రైమాసిక ఫలితాలను సునిశితంగా పరిశీలించి, బలమైన కంపెనీలను కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. అయితే, అంతా ఒకేసారి కాకుండా, క్రమంగా కొనుగోలు చేయడం సరైన విధానంగా సూచించారు. 2019లో పెట్టుబడుల కోసం నాలుగు స్టాక్స్‌ను సూచించారు.  

 

హిందుస్తాన్‌ యూనిలీవర్‌
పామాయిల్‌, పామ్‌ ఫ్యాటీ యాసిడ్‌ వంటి ముడి సరుకుల ధరలు తగ్గడం వల్ల కంపెనీకి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. దీంతో కంపెనీ మార్జిన్లు పెరుగుతాయి. 50 శాతం ఆదాయం వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగం నుంచే వస్తోంది. గోద్రేజ్‌, ఐటీసీల కంటే ఇది ఎంతో ఎక్కువ.
ఆర్‌బీఎల్‌ బ్యాంకు
అధిక రాబడులు వచ్చే రిటైల్‌ (45 శాతం వృద్ధి), మైక్రో బ్యాంకింగ్‌ (55శాతం వృద్ధి ) ఎంఎస్‌ఎంఈ (62శాతం వృద్ధి) విభాగాల రుణ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడంపై యాజమాన్యం దృష్టి సారించింది. దీంతో బ్యాంకు నికర వడ్డీ మార్జిన్‌ మెరుగుపడనుంది. 
నెస్లే ఇండియా
2016లో మ్యాగి ఉత్పత్తిపై నిషేధం విధించడానికి ముందు నాటితో పోలిస్తే కంపెనీ షేరు ప్రస్తుత ధర తక్కువ. ఈ కాలంలో కంపెనీ తన మార్కెట్‌ వాటాను వేగంగా పెంచుకుంది. 2018 మొదటి ఆరు నెలల్లో కంపెనీ ఆదాయాల్లో మ్యాగి వాటా 30 శాతంగా ఉంది. కంపెనీ మార్జిన్లు 59 శాతం పెరిగాయి. కీలకమైన ముడి సరుకుల ధరలు తక్కువ స్థాయిల్లోనే ఉండడంతో మార్జిన్ల విస్తరణకు అవకాశం.
పీవీఆర్‌
ఎస్‌పీఐ సినిమాస్‌ కొనుగోలు డిసెంబర్‌ త్రైమాసికంలో పూర్తవుతుందన్నది కంపెనీ అంచనా. దీంతో కంపెనీ ఆదాయాలు ప్రాంతీయ సినిమాల విభాగంలో మూడు శాతం పెరిగి 22 శాతానికి చేరతాయి. బుక్‌మైషో, పేటీఎంతో మూడేళ్ల కాలానికి ఒప్పందం కూడా చేసుకుంది. You may be interested

ఓపిక పడితే లాభాలు ఎందుకు రావు... ఇదే నిదర్శనం

Thursday 3rd January 2019

స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసి, చేతులు కాల్చుకోవడం చాలా మంది రిటైల్‌ ఇన్వెస్టర్లకు అనుభవమే. ఎందుకంటే అటువంటి వారి దృష్టంతా రాబడులపైనే కానీ, సరైన కంపెనీలను గుర్తించడంపై శ్రద్ధ ఉండదు. మంచి యాజమాన్యం, వ్యాపార ఫండమెంటల్స్‌, నగదు ప్రవాహాలు, ఏటేటా వ్యాపారంలో వృద్ధి ఇలా ఎన్నో అంశాల ఆధారంగా మంచి స్టాక్స్‌లో ఇన్వె‍స్ట్‌ చేస్తే దీర్ఘకాలంలో భారీ రాబడులు వస్తాయని ఎన్నో కంపెనీలు నిరూపించాయి. ఆ జాబితాలోనిదే కోటక్‌ మహీంద్రా

పతనం బాటలో ప్రపంచ మార్కెట్లు

Wednesday 2nd January 2019

చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీలో మందగమనం నష్టాల్లో యూఎస్‌ ఫ్యూచర్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో అటు ఆసియా, ఇటు యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీ మందగించడం, యూరోజోన్‌ పీఎంఐ సూచీ రెండేళ్ల కనిష్ఠానికి చేరడంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభంపై మరోమారు భయాలు మొదలయ్యాయి. దీంతో బుధవారం ఎంఎస్‌సీఐ వరల్డ్‌ ఇండెక్స్‌ 0.4 శాతం క్షీణించింది. చైనా మార్కెట్‌ 1.3 శాతం, హ్యాంగ్‌సంగ్‌ 2.77 శాతం, నికాయ్‌ 0.4 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌

Most from this category