విదేశీ నిధులు రావడం కష్టమే..!
By Sakshi

ముంబై: ప్రస్తుతం దేశీ సూచీలను ఆదుకుంటోంది భారతీయుల నిధుల ప్రవాహమే అని వ్యాఖ్యానించిన సీఎల్ఎస్ఏ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, ఇండియా స్ట్రాటజిస్ట్ మహేష్ నందూర్కర్.. ఇక్కడివారి నిధులు మాత్రమే మార్కెట్లను ఇంకొంతకాలం నిలబెట్టగలవని విశ్లేషించారు. కేవలం వీరి నిధుల కారణంగానే అధిక విలువలో ఉన్నప్పటికీ.. అభివృద్ధి చెందుతున్న దేశాల సూచీలను అవుట్పెర్ఫార్మ్ చేయగలుగుతున్నాయని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశీ నిధులు భారత్‌కు రావడం కష్టతరంగా మారిపోయిందని, ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్‌కు చేరుతున్న ఇక్కడి వారి నిధులు మాత్రమే సూచీలకు మద్ధతు ఇవ్వగలవన్నారయన. ఇక్కడి సూచీల్లో 5-7 శాతం దిద్దుబాటు జరగడం అనేది సమంజసంగానే ఉందన్న ఆయన ఈ విధంగా జరగడం వల్ల వాల్యుయేషన్స్ హేతుబద్ధంగా ఉంటాయన్నారు. భారత మార్కెట్లో ఉన్నటువంటి సానుకూల అంశాలను ఆయన వివరించారు. వాటిలో ప్రధానంగా.. క్యూ2 ఫలితాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్)లో నిరర్థక ఆస్తుల ట్రెండ్‌లో మార్పువచ్చింది. గడిచిన రెండు త్రైమాసికాలుగా స్థూల ఎన్పీఏ రేషియో తగ్గుతూ వస్తోంది. ఇదే సమయంలో ప్రొవిజన్స్ రేషియో పెరుగుతోంది. ఐటీ సేవల సంస్థ నియామకాలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. సిమెంట్ రంగంలో ఎర్నింగ్స్ రివిజన్స్ జరగనున్నాయి. ఎన్నికల వేడి: గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం అధికంగా ఉండే రంగాలకు వచ్చే ఎన్నికల సమయంలో సానుకూలంగా ఉండనుందని విశ్లేషించారు. విద్యుత్, ఆయిల్, గ్యాస్, పొగాకు వంటి వినిమయ రంగాలకు సమీపిస్తున్న పోల్స్ వల్ల ప్రోత్సాహం లభించనుందన్నారు. ద్విచక్ర వాహనాలు: అధిక జనాభా వినియోగించే ద్విచక్ర వాహనాల పరిశ్రమ ఊపందుకోనుంది. అయితే, ప్రీమియం విభానికి మాత్రం ఇంకా సమయం ఉందన్నారు. ఎన్బీఎఫ్సీ: పెరుగుతున్న వడ్డీ రేట్లు ప్రైవేట్ బ్యాంకులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవ్య లభ్యత కొరత కారణంగా ఎన్‌బీఎఫ్‌సీల మార్కెట్ వాటా తగ్గి బ్యాంకింగ్ రంగానికి పెరగనుందన్నారు.
You may be interested
నెలన్నర గరిష్టానికి ఎయిర్టెల్
Friday 16th November 2018ప్రముఖ టెలికాం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్టెల్ షేరు శుక్రవారం నెలన్నర గరిష్టాన్ని తాకింది. నేడు భారతీ ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో రూ.303.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తెలియని కారణాలతో షేరు 8శాతం లాభపడి రూ.328.80ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరు నెలన్నర గరిష్టస్థాయి. అక్టోబర్ 01వ తేది తరువాత ఇంత స్థాయిలో ధరను తాకడం ఇదే తొలిసారి. మధ్యాహ్నం గం.12:25ని.లకు షేరు గత ముగింపు
రిలయన్స్ 3 శాతం అప్
Friday 16th November 2018గత కొద్దిరోజులుగా స్తబ్ధుగా సాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. నేడు బీఎస్ఈలో రిలయన్స్ షేరు రూ.1096.10ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్ ప్రారంభంమైన కొద్దిసేపటికే 3శాతం లాభపడి రూ.1128.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:20ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.1096.9)తో పోలిస్తే 1.80శాతం లాభంతో రూ.1117.50ల వద్ద ట్రేడ్ అవుతోంది. స్టాక్ మార్కెట్లో అత్యధిక వెయిటేజ్ కలిగిన రిలయన్స్ 3శాతం ర్యాలీ కారణంగా నేడు