STOCKS

News


కీలక అవరోధం 38,500

Monday 27th August 2018
Markets_main1535347125.png-19668

ఇతర వర్థమాన సూచీలు దిగువస్థాయిలో ట్రేడవుతున్నా, ఇండియా మార్కెట్‌ వరుసగా మరోవారం రికార్డుల్ని సృష్టించింది. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌తో చాలావరకూ ప్రయోజనం పొం‍దనున్నందున అమెరికా సూచీలు రికార్డు గరిష్టం వద్ద కదులుతుండగా, వర్థమాన దేశాల్లో ప్రస్తుతానికి సురక్షితమైన స్థానంగా ఇండియాను ఇన్వెస్టర్లు పరిగణిస్తున్న నేపథ‍్యంలో మన మార్కెట్‌ పెరుగుతున్నది. గత వారాంతంలో భారత్‌ సూచీలు గరిష్టస్థాయి నుంచి స్వల్పంగా తగ్గినప్పటికీ, సూచీల్ని నడిపిస్తున్న ఐదారు హెవీవెయిట్‌ షేర్లలో రెండు...రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌లు సరికొత్త గరిష్టాలకు పెరిగిన కారణంగా, సమీప భవిష్యత్తులో పెద్ద కరెక‌్షన్‌ను అంచనావేయలేము. ప్రధాన సూచీల్లో కరెక‌్షన్‌ రావాలంటే...ముందుగా హెవీవెయిట్‌ షేర్ల ర్యాలీ నిలిచిపోవాలి. అటుతర్వాత అవి ఒక్కొటొక్కటే తగ్గుతూ వుంటేనే మార్కెట్‌ క్షీణించే ప్రమాదం వుంటుంది.  ఇక మన ప్రధాన సూచీల సాంకేతికాంశాలు ఇలా వున్నాయి.... 

సెన్సెక్స్ సాంకేతికాలు..
ఆగస్టు 24తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించినట్లు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,075 పాయింట్లస్థాయిని దాటినంతనే 38,500 పాయింట్ల సమీపానికి ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 304 పాయింట్ల లాభంతో38,252 పాయింట్ల వద్ద ముగిసింది. కొద్ది వారాల నుంచి అప్రతిహతంగా సాగుతున్న ప్రస్తుత అప్‌ట్రెండ్‌ మరింతగా కొనసాగాలంటే 38,500 పాయింట్లస్థాయిని బలంగా ఛేదించడం కీలకం. అలా జరిగితే తొలుత 38,650 పాయింట్ల స్థాయిని, అటుతర్వాత 38,800 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. సమీప భవిష్యత్తులో ఈ సూచీ 38,500 దిగువనే స్థిరపడితే స్వల్పశ్రేణిలో కన్సాలిడేషన్‌ లేదా చిన్నపాటి కరెక‌్షన్‌ జరగవచ్చు. ఆ సందర్భంగా  తొలుత 38,070 పాయింట్ల సమీపంలో ఒక మద్దతు లభ్యమవుతున్నది. ఈ స్థాయి దిగువన ముగిస్తే  37,840-37,700 శ్రేణి వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున 37,590 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. 


నిఫ్టీకి 11,600-640 శ్రేణి కీలక నిరోధం
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ గత కాలమ్‌లో ప్రస్తావించినట్లు 11,495 పాయింట్ల స్థాయిని దాటిన తర్వాత 11,621 పాయింట్ల గరిష్ట లక్ష్యాన్ని చేరుకోగలిగింది. చివరకు  అంత‌క్రితం వారంతో పోలిస్తే 86  పాయింట్లు లాభపడి 11,557 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం అప్‌ట్రెండ్‌ కొనసాగాలంటే నిఫ్టీ కీలకమైన 11,600-640 అవరోధ శ్రేణిని ఛేదించాల్సివుంటుంది. అది జరిగితే వేగంగా 11,710 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపై 11,760 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే 11,490 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయి దిగువన ముగిస్తే 11,430-11,370 పాయింట్ల శ్రేణి మధ్య ముఖ్యమైన మద్దతు లభ్యమవుతున్నది. ఈ శ్రేణిని కోల్పోతే 11, 340 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. You may be interested

రూ.కోటి కవరేజీ చాలా...? 

Monday 27th August 2018

ఈ రోజు చాలనుకున్నది కొన్నేళ్ల తర్వాత అవసరాలకు సరిపోకపోవచ్చు. రూ.కోటి రూపాయిలకు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్న ఓ బ్రహ్మచారి ఆ తర్వాత కాలంలో వివాహం చేసుకున్నాడనుకోండి. ఆ మొత్తం అతడి కుటుంబ అవసరాలు, జీవిత లక్ష్యాల కోసం సరిపోకపోవచ్చు. చాలామంది తమకు ప్రాణ ప్రమాదం వాటిల్లితే రూ.కోటి మొత్తం సరిపోతుందని అనుకుంటుంటారు. రూ.కోటి ఈ రోజు పెద్ద మొత్తంగానే కనిపించొచ్చు. ‘‘చాలా మంది తమకు సౌకర్యవంతమైన మొత్తానికి కవరేజీ తీసుకుంటుంటారు.

70 విదేశీ శాఖల మూసివేతకు పీఎస్‌బీల ప్రణాళిక

Monday 27th August 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) నిధుల సంరక్షణ చర్యల్లో భాగంగా 70 విదేశీ శాఖల మూసివేత లేదా క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం చేశాయి. లాభదాయకం కాని విదేశీ కార్యకలాపాలను మూసివేయడం, అలాగే ఒకే పట్టణం లేదా సమీప ప్రాంతాల్లో ఒకటికి మించి ఉన్న శాఖలను క్రమబద్ధీకరించడం పీఎస్‌బీల ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 70 విదేశీ శాఖల్ని మూసేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. పీఎస్‌బీలు

Most from this category