News


రికవరీ సూచించిన బ్యాంకు నిఫ్టీ ఆప్షన్లు

Tuesday 11th December 2018
Markets_main1544522974.png-22827

దేశీయ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌లో రోజువారీ కనిష్ఠస్థాయి నుంచి కోలుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌ షేర్ల మద్దతు సూచీలను ఆదుకొంది. ఉర్జిత్‌పటేల్‌ రాజీనామాను, ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా పీఎస్‌యూ బ్యాంకు షేర్లు మంచి ర్యాలీ జరిపాయి. దీంతో మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. సూచీల్లో ఇంత షార్‌‍్ప రికవరీ ఆశ్చర్యకరంగా కనిపించినా బ్యాంకు నిఫ్టీ ఆప్షన్లు పరిశీలిస్తే కారణం తెలిసిపోతుంది. మంగళవారం ట్రేడింగ్‌లో బ్యాంకు నిఫ్టీ 25598 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి రీబౌండ్‌ అయింది. ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ వ్యాఖ్యలు బ్యాంకు స్టాకుల్లో కొనుగోళ్లకు కారణమయ్యాయి. ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామాపై తానేమీ వ్యాఖ్యానించనని కుమార్‌ చెప్పారు. ఉర్జిత్‌ రాజీనామా అనంతరం ఫిబ్రవరి 12న విడుదలైన సర్క్యులర్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పలేమన్నారు. దీంతో కొత్తగా వచ్చే గవర్నర్‌ ఉర్జిత్‌లాగా కఠిన చర్యలు తీసుకోకపోవచ్చన్న అంచనాలు బ్యాంకింగ్‌ షేర్లలో జోష్‌ నింపాయి.

ఇందుకు తగ్గట్లే 26000, 26600 పాయింట్ల వద్ద పుట్‌ అన్‌వైండింగ్‌ జరిగింది.  27000 పాయింట్ల వద్ద ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ పెరిగింది. దీన్నిబట్టి షార్ట్‌ కవరింగ్‌ జరుగుతోందని తెలిసింది. బ్యాంకు నిఫ్టీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ఓఐ సైతం 20 శాతం పెరిగి లాంగ్‌ పొజిషన్లు పెరిగిన విషయాన్ని ధృవీకరించింది. ఎన్‌బీఎఫ్‌సీ స్టాకుల్లో సైతం దాదాపు 23 శాతం వరకు ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ పెరిగింది. ఎంఅండ్‌ఎం ఫిన్‌ సర్వ్‌, ఉజ్జీవన్‌ ఫిన్‌సర్వ్‌ తదితర సంస్థల్లో లాంగ్స్‌ పెరిగాయి. మొత్తం ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో 77 శాతం స్టాకులు పాజిటివ్‌గా మారాయి. దీన్ని బట్టి మార్కెట్‌ ధృక్పధం పూర్తిగా మారిందని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సూచీలు పాజిటివ్‌గా మారాయి. ప్రస్తుత స్థితి వద్ద మార్కెట్లు స్థిరీకరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 



You may be interested

రూపీ, బాండ్స్‌ అప్‌.. కారణం ఇదేనా?

Tuesday 11th December 2018

ప్రారంభంలో నిట్టనిలువునా పతనమైన ఇండియన్‌ రూపాయి తర్వాత మళ్లీ రీబౌండ్‌ అయ్యింది. బాండ్స్‌ కూడా అంతే. కొత్తగా వచ్చే ఆర్‌బీఐ గవర్నర్‌ అనుసరించే పాలసీ విధానాలపై సానుకూల అంచనాలు ఇందుకు కారణం. కాగా ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మార్కెట్‌ వర్గాల్లో వడ్డీ రేట్లు తగ్గించొచ్చని, లిక్విడిటీకి సంబంధించి సరళమైన విధానాలు ఉండొచ్చని, బ్యాంకింగ్‌ నిబంధనలను సరళీకరించొచ్చని అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈక్విటీలు, కరెన్సీ,

లాభాల్లో ఫార్మా షేర్లు

Tuesday 11th December 2018

డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత ఫార్మా షేర్లకు కలిసొస్తుంది. నేడు ట్రేడింగ్‌లో రూపాయి డాలర్‌ మారకంలో 72.05 స్థాయికి పతనమైంది. రూపాయి క్షీణత విదేశాలకు ఎగుమతులు చేసి డాలర్ల మారకంలో ఆదాయాలను ఆర్జించే కంపెనీలకు కలిసొస్తుందని అంచనాలతో ఫార్మా షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని ఇండెక్స్‌లో అత్యధికంగా ఫార్మా ఇండెక్స్‌ 3శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గతముగింపుతో పోలిస్తే 2.55శాతం లాభంతో 8,753.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Most from this category