News


ఆనంద్‌రాఠీ లాంగ్‌టర్మ్‌ రికమండేషన్లు

Tuesday 22nd January 2019
Markets_main1548135756.png-23724

దేశీయ, అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేకుండా మంచి పనితీరు కనబరుస్తున్న కంపెనీల షేర్లను నమ్ముకోవాలని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం ఆనంద్‌ రాఠీ సూచించింది. దీర్ఘకాలానికి దాదాపు 40 శాతం రాబడినిచ్చే మూడు షేర్లను రికమండ్‌ చేస్తోంది.
1. హావెల్స్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 788. ఎఫ్‌ఎంసీజీ టాప్‌ కంపెనీల్లో ఒకటి. విద్యుదుపకరణాల ఉత్పత్తిలో పేరెన్నికగన్నది. 50కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వైవిధ్యభరితమైన ఉత్పత్తి పోర్టుఫోలియో ఉంది. గత కొన్ని త్రైమాసికాలుగా మంచి ఫలితాలు ప్రకటిస్తోంది. తాజా ఫలితాల్లో రెవెన్యూ 23 శాతం, నికరలాభం 4 శాతం మేర పెరిగాయి. 
2. జేబీ కెమికల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 416. దేశీయ ఫార్మా పరిశ్రమలో 35వ స్థానంలో ఉంది. కంపెనీకి చెందిన కీలకమైన నాలుగు ఉత్పత్తులు మొత్తం రెవెన్యూలో సింహభాగం సంపాదిస్తున్నాయి. ఇటీవలే దేశీయ విభాగాన్ని పునర్‌వ్యవస్థీకరించింది. వచ్చే రెండేళ్లు ఆదాయంలో 12 శాతం చక్రీయవార్షిక వృద్ది ఉంటుందని అంచనా. దక్షిణాఫ్రికా వ్యాపార విస్తరణతో ఎగుమతుల్లో పురోగతి కనిపించనుంది. యూఎస్‌లో 11 ఏఎన్‌డీఏలకు అనుమతి పొందింది.
3. ఎన్‌ఓసీఐఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 210. దేశంలో అతిపెద్ద రబ్బరు కెమికల్స్‌ ఉత్పత్తిదారు. కంపెనీ ఉత్పత్తి ప్లాంట్లన్నీ పూర్తి ఆటోమేటెడ్‌గా మార్చారు. రబ్బరు కెమికల్స్‌ ప్రపంచ మార్కెట్లో కంపెనీకి దాదాపు 10 శాతం వాటా ఉంది. కొత్తగా రూ.4500 కోట్ల మూలధన వ్యయం చేయాలని నిర్ణయించుకుంది. 40 దేశాల్లో కంపెనీకి కస్టమర్లున్నారు. కొన్ని రంగాలపై ఆధారపడడం, ప్రభుత్వ పన్ను విధానాలు స్వల్పకాలిక రిస్కులు. కానీ వీటి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా. You may be interested

3వారాల కనిష్టం వద్ద పసిడి

Tuesday 22nd January 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 3వారాల కనిష్టానికి పతనమైంది. డాలర్‌ ఇండెక్స్‌ రెండువారాల గరిష్టానికి ఎగబాకడం ఇందుకు కారణమైంది. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర ఉదయం ట్రేడింగ్‌లో 5.65 డాలర్ల నష్టపోయి 1,277 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్రిటన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం యూరో ఆర్థిక వృద్ధిపై ప్రభావాన్ని చూపవచ్చనే ఆందోళనలకు, యూరో బలహీనత డాలర్‌కు డిమాండ్‌ బలాన్నిచ్చింది. ఫలితంగా డాలర్‌కు వ్యతిరేక దిశలో ట్రేడయ్యే పసిడి ధర

కొన్ని కంపెనీలు త్రైమాసిక ఫలితాల వివరాలు

Tuesday 22nd January 2019

జస్ట్ డయల్ లాభం రెట్టింపు న్యూఢిల్లీ: లోకల్ సెర్చి ఇంజిన్ సంస్థ జస్ట్ డయల్ నికర లాభం అక్టోబర్‌-డిసెంబర్ త్రైమాసికంలో రెట్టింపై రూ. 57 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ3లో ఇది రూ. 28.6 కోట్లు. మరోవైపు కంపెనీ ఆదాయం రూ. 199 కోట్ల నుంచి రూ. 261 కోట్లకు పెరిగింది. సమీక్షాకాలంలో షేరు ఒక్కింటికి రూ. 800 ధరతో 27.5 లక్షల షేర్ల బైబ్యాక్ పూర్తిచేసినట్లు, ఇందుకోసం దాదాపు రూ.

Most from this category