STOCKS

News


చల్లబడిన డిమాండ్‌... దిగొస్తున్న ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌

Monday 13th May 2019
Markets_main1557686525.png-25691

ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఎన్నో ఏళ్లుగా ఉత్తమ స్టాక్‌ బెట్స్‌గా కొనసాగుతూ వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్‌లో వినియోగం నిదానించడంతో ఈ షేర్లు దిగొస్తున్నాయి. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 2006 నుంచి చూస్తే ఒక్కసారే డౌన్‌ అయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ఇప్పటి వరకు ఈ షేర్లు డబుల్‌ డిజిట్‌ నష్టాల్లో ఉన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ కొరత వినియోగాన్ని దెబ్బతీసిందన్నది ఓ విశ్లేషణ. కార్లు, గృహాలకు డిమాండ్‌ తగ్గడం వినియోగంపై ప్రభావం చూపిందంటున్నారు విశ్లేషకులు. 

 

హిందుస్తాన్‌ యూనిలీవర్‌ కంపెనీ సబ్బులను ప్రతీ 10 భారతీయ ఇళ్లలో తొమ్మిదింటిలో వాడుతుంటారు. గ్రామీణ డిమాండ్‌ తగ్గుతున్నట్టు ఈ కంపెనీ ఇటీవల అనలిస్టుల కాల్‌ సందర్భంగా తెలిపింది. తిరిగి డిమాండ్‌ ఎప్పుడు పుంజుకుంటుదన్నదీ చెప్పడం కష్టమేనన్నది కంపెనీ అభిప్రాయం. ‘‘హిందుస్తాన్‌ యూనిలీవర్‌ వంటి సాధారణంగా ఉండే మేనేజ్‌మెంట్‌ మాంద్యం అనే పదాన్ని ప్రయోగించింది. కనుక ఇది ఓ త్రైమాసికంలో తగ్గుదలగా ఉండకపోవచ్చు’’ అని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రోహిత్‌ చోర్డియా అన్నారు. హెచ్‌యూఎల్‌ అమ్మకాల వృద్ధి మార్చి త్రైమాసికంలో 7 శాతంగా ఉంది. ఐదు వరుస త్రైమాసికాల్లో డబుల్‌ డిజిట్‌ అమ్మకాల తర్వాత సింగిల్‌ డిజిట్‌కు పడిపోయింది. డాబర్‌ ఇండియా లిమిటెడ్‌ అమ్మకాల వృద్ది కేవలం 4.3 శాతానికి పరిమితం అయింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి 8 శాతంగా ఉంది. బ్రిటానియా ఇండస్ట్రీస్‌ అమ్మకాల ఆదాయం సైతం 7 శాతంగానే ఉంది. అంతకుముందు 11 శాతం వృద్ది నమోదైంది. ఇక గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ అమ్మకాల ఆదాయం అయితే కేవలం ఒక శాతమే పెరగడం వినియోగం తగ్గుదలను సూచిస్తోంది.

 

పరిస్థితులకు తగ్గట్టే ఈ కంపెనీ షేర్లూ దిగొస్తున్నాయి. హెచ్‌యూఎల్‌ ఇప్పటికే ఈ ఏడాది 6 శాతం తగ్గింది. గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ షేరు 21 శాతం, బ్రిటానియా 15 శాతం, డాబర్‌ 11 శాతం చొప్పున తగ్గాయి. అయితే, బీఎస్‌ఈ ఎఫ్‌ఎంసీజీ ఫార్వార్డ్‌ సూచీ ఇప్పటికీ 32 పీఈ వద్ద ట్రేడవుతోంది. ఐదేళ్ల సగటు పీఈ కంటే ఎక్కువ. కనుక మరింత దిద్దుబాటు ఉంటుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఎఫ్‌ఎంసీజీ రంగం మెరుగైన స్థితిలోనే ఉన్నా, అధిక ధరలన్నవి సవాలేనని అద్వానీ గ్రూపు ప్రెసిడెంట్‌ పశుపతి అద్వానీ అన్నారు. గతంలో చూసిన అద్భుత వృద్ధి కనిపించకుండా పోయిందని, మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తుందన్నది చెప్పలేమన్నారు. అయితే, ఈ తగ్గుదల అన్నది సైక్లికల్‌ అని కోటక్‌ తెలిపింది. కనుక దీర్ఘకాల కోసం ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఇంకొంత దిద్దుబాటు అయితే పెట్టుబడి అవకాశాలను పరిశీలించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 55 పాయింట్లు డౌన్‌

Monday 13th May 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ పరిష్కారం డోలాయమానంలో  కొనసాగడంతో ఆసియా మార్కెట్లు క్షీణించిన నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ సోమవారం  సైతం గ్యాప్‌డౌన్‌తో  ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.40  గంటలకు  55 పాయింట్లకుపైగా నష్టపోయి11,248 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,307 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా-అమెరికాల మధ్య వాషింగ్‌టన్‌లో ఆదివారం జరిగిన చర్చల్లో ఎటువంటి ఒప్పందం కుదరకపోగా, చైనా

సంపద సృష్టికి ముఖ్యమైనవి ఏవి?

Monday 13th May 2019

గత ఏడాదిన్నరగా మార్కెట్లలో అస్థిరతలు పెరిగిపోయాయి. ముఖ్యంగా గత ఆరు నెలల్లో ఇవి మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లకు దూరంగా ఉండాలా లేక కొనసాగాలా అనే సందేహం చాలా మందిలో నెలకొందనడంలో సందేహం లేదు. స్వల్ప కాలంలో మంచి రాబడులు వచ్చినప్పటికీ దీర్ఘకాలం కోసం వేచి చూడాలా? లాభాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి బ్యాంకు ఎఫ్‌డీలకు ఎందుకు మార్చుకోకూడదు? అన్న ప్రశ్నలకు... తక్కువ లాభాలు గడించినప్పుడు లేదా మార్కెట్లు

Most from this category