STOCKS

News


కోలుకున్న ఎఫ్‌ఎంసీజీ షేర్లు

Wednesday 12th September 2018
Markets_main1536735245.png-20198

రెండు వరుస ట్రేడింగ్‌ల్లో తీవ్ర నష్టాలపాలైన ఎఫ్‌ఎంసీజీ షేర్లు బుధవారం కోలుకుంటున్నాయి. ఉదయం సెషన్లో ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో సూచీలకు అండగా నిలుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగషేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2.23 శాతం వరకూ ర్యాలీ చేసింది. ఉదయం గం.11:30ని.లకు సూచి గత ముగింపు(30,067.55)తో పోలిస్తే 562 పాయింట్ల లాభపడి 30,629.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచిలో అత్యధికంగా డాబర్‌ ఇండియా, ఐటీసీ షేర్లు 3శాతం లాభపడగా, మారికో, హిందూస్థాన్‌ యూనిలివర్‌, పీజీహెచ్‌హెచ్‌, గ్లాక్సోస్మిత్‌లైన్‌, యూబీఎల్‌, బ్రిటానియా షేర్లు 2శాతం వరకూ పెరిగాయి. కోల్‌ ఇండియా, మెక్‌డొనాల్డ్‌ షేర్లు    అరశాతం లాభపడ్డాయి. మరోవైపు గోద్రేజ్‌జేసీపీ, జుబిలెంట్‌ ఫుడ్స్‌, ఇమామి షేర్లు 3నుంచి 2శాతం నష్టపోగా, గోద్రేజ్‌ ఇండియా, టాటాగ్లోబల్‌ బేవరేజెస్‌ షేర్లు 1శాతం వరకూ నష్టపోయాయి. ఇదే సమయానికి ఐటీసీ, హిందూస్థాన్‌ లివర్‌ షేర్లు 3-2శాతం ర్యాలీ చేసి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచిలో టాప్‌-5 గెయినర్లలో చోటు దక్కించుకున్నాయి.



You may be interested

నిఫ్టీ 11,264 పైన నిలిస్తే 11,600కే

Wednesday 12th September 2018

నిఫ్టీకి 11,264 స్థాయి వద్ద కీలక మద్దతు ఉందని యస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ ఆదిత్య అగర్వాల్‌ తెలిపారు. దీనికి పైన స్థిరపడితే అప్పుడు ఇండెక్స్‌ 11,600-11,750 స్థాయికి చేరొచ్చని అంచనా వేశారు. 11,265-11,260 దిగువకు పడిపోతే అప్పుడు ఇండెక్స్‌ 11,200-11,175 స్థాయికి పడిపోయే అవకాశముందని తెలిపారు. అలాగే ఆర్‌ఎస్‌ఐ ఓవర్‌ సోల్డ్‌ జోన్‌కు వెళ్లిందని పేర్కొన్నారు. అందువల్ల ఇండెక్స్‌లో పుల్‌బ్యాక్‌ ర్యాలీ ఉండొచ్చని తెలిపారు. వచ్చే 3-4 వారాలో

భారీ ఆస్తిపరులు 70 శాతం అప్‌!

Wednesday 12th September 2018

ముంబై: దేశంలో భారీ నికర ఆస్తులున్న వ్యక్తుల (డెమీ-బిలియనీర్లు) సంఖ్య గణనీయంగా పెరగనుందని ప్రముఖ అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌... తన తాజా నివేదికలో పేర్కొంది. నైట్‌ఫ్రాంక్‌ ఇండియా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం 500 మిలియన్‌ డాలర్లు, ఆపైన నికర ఆస్తులున్న వారి సంఖ్య 2017లో 200. 2022 నాటికి ఈ సంఖ్య 340కి పెరుగుతుంది. నివేదికలో మరిన్ని వివరాలను చూస్తే...  ముంబై, ఢిల్లీ వంటి భారత్‌ ప్రధాన

Most from this category