STOCKS

News


ఎఫ్‌ఎమ్‌జీసీ షేర్లలో అమ్మకాలు

Monday 18th February 2019
Markets_main1550480108.png-24245

మార్కెట్‌ నష్టాల్లో భాగంగా ఎఫ్‌ఎంజీసీ(ఫాస్ట్‌-మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌) షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎఫ్‌ఎంజీసీ ఇండెక్స్‌ అత్యధికంగా 1.50శాతం పతనమైంది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఐటీసీ, హిందూస్థాన్‌ యూనిలివర్‌ 1.50శాతం పతనం ఇం‍డెక్స్‌ నష్టపోవడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(29,309.10)తో పోలిస్తే 1.00శాతం క్షీణించి 29,002 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో భాగమైన మొత్తం 15షేర్లకు గానూ 12షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా డాబర్‌ లిమిటెడ్‌ షేరు 3శాతం నష్టపోగా, టాటాగ్లోబల్‌బేవరీజెస్‌ 2.50శాతం, గోద్రేజ్‌ఫుడ్స్‌వర్క్స్‌, పీజీహెచ్‌హెచ్‌కేర్‌లిమిటెడ్‌ 2శాతం క్షీణించాయి. అలాగే ఐటీసీ, గోద్రేజ్‌ కార్పోరేషన్‌, జీఎస్‌కే, హిందూస్థాన్‌యూనిలివర్‌ షేర్లు 1.50శాతం పతనమవ్వగా, మారికో ఇమామి షేర్లు 1శాతం నష్టపోయాయి. అలాగే మెక్‌డొనాల్డ్‌, కోల్గేట్‌ షేర్లు అరశాతం క్షీణించాయి. మరోవైపు ఇదే సెక్టార్‌లోని జుబిలెండ్‌ఫుడ్స్‌ 3శాతం లాభపడింది. బ్రిటానియా 2శాతం, యూబీఎల్‌ షేర్లు 1శాతం పెరిగింది.  ఇదే సమయానికి ఐటీసీ షేరు 1.50శాతం నష్టపోయి నిఫ్టీ - 50 సూచీలో టాప్‌-5 లూజర్లలో మూడోస్థానంలో ట్రేడ్‌ అవుతోంది.You may be interested

పటిష్టంగా పసిడి..

Monday 18th February 2019

మాంద్యం, డాలర్‌ భయాలతో మరింత పెరిగే అవకాశాలు న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మరోసారి మాంద్యం ముప్పు భయాలు, డాలర్ ర్యాలీకి ఇక బ్రేక్ పడొచ్చన్న అంచనాలు పసిడికి ఊతమివ్వొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. డాలర్‌ బలంగా ఉన్న పరిస్థితుల్లో కూడా పసిడి రేట్లు పటిష్టంగానే కొనసాగుతుండటం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. బంగారం రేట్ల పెరుగుదల మరీ దూకుడుగా లేకపోయినప్పటికీ.. వారాంతంలో కీలకమైన 1300 డాలర్ల ధర (ఔన్సుకి - 31.1 గ్రాములు) పైన ముగియడం

దీర్ఘకాలంలో బంపర్‌ రాబడులు!

Monday 18th February 2019

ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడులతో ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ఈ విభాగంలోనే మేటి పథకంగా ఉంది. దీర్ఘకాలానికి తక్కువ రిస్క్‌, అధిక రాబడులు ఆశించే వారు ఈ పథకంలో పెట్టుబడులను పరిశీలించొచ్చు. దీర్ఘకాలంలో మంచి పనితీరును చూపడమే కాకుండా మార్కెట్‌ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేయడాన్ని ఈ పథకంలో గమనించొచ్చు. పోర్ట్‌ఫోలియో నిర్మాణంలో రిస్క్‌ను తగ్గించే చర్యలను ఈ పథకం అనుసరిస్తోంది.  రాబడులు ఈ పథకంలో దీర్ఘకాలిక రాబడులు చాలా మెరుగ్గా

Most from this category