STOCKS

News


స్వల్ప లాభంతో ప్రారంభమైన మార్కెట్‌

Tuesday 18th September 2018
Markets_main1537243730.png-20340

దేశీయ మార్కెట్‌ మంగళవారం స్వల్ప లాభంతో ప్రారంభమైంది. నిఫ్టీ గతముగింపు(11,378)తో పోలిస్తే 3 పాయింట్ల స్వల్పలాభంతో 11,381 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ గతముగింపు(37585)తో పోలిస్తే 75 లాభంతో 37660 వద్ద ముగిసింది. చైనాతో వాణిజ్య యుద్ధ నేపథ్యంలో గతరాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగియడం, నేటి ఉదయం ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌ మన మార్కెట్‌పై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉదయం 9:30 సమయంలో నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 11,383  పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 42 పాయింట్ల లాభంతో 37,831 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే సమయానికి మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన పథకాన్ని కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ సూచి నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, రూపాయి రికవరీ కారణంగా ఐటీ సూచీ కూడా నష్టాల బాట పట్టింది. మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలు స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో గత రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియాలో జపాన్‌, కోప్సీ, ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, మిగిలిన అన్ని మార్కెట్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.5 శాతం డౌన్‌

Tuesday 18th September 2018

మూడు ప్రభుత్వ రంగ విలీన పథకాన్ని కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ 1.5 శాతం పతనమయ్యింది. 12 షేర్లు కలిగిన ఈ ఇండెక్స్‌లో భాగమైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 10 శాతం పతమయ్యింది. ఈ షేరు ఇంట్రాడేలో 52 వారాల కనిష్టస్థాయి రూ. 166 స్థాయిని తాకింది. ఇండియన్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌ షేర్లు 3.5 శాతం మేర క్షీణించాయి. పంజాబ్‌

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 9 శాతం క్రాష్‌

Tuesday 18th September 2018

దేనా బ్యాంక్‌ 20 శాతం అప్‌...స్థిరంగా విజయా బ్యాంక్‌ మూడు ప్రభుత్వ రంగ విలీన పథకాన్ని కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో మంగళవారం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 9 శాతం పతనమై రూ. 121 వద్దకు పడిపోయింది. ట్రేడింగ్‌ ప్రారంభమైన 15 నిముషాల్లోనే ఎన్‌ఎస్‌ఈలో ఈ కౌంటర్లో 2 కోట్లకుపైగా షేర్లు చేతులు మారాయి. అత్యధిక ఎన్‌పీఏలతో సతమతమవుతూ...రిజర్వుబ్యాంక్‌ నియంత్రణల్ని ఎదుర్కొంటున్న దేనా బ్యాంక్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 20 శాతం

Most from this category