STOCKS

News


ఫ్లాట్‌ ఓపెనింగ్‌

Tuesday 30th October 2018
Markets_main1540871186.png-21571

క్రితం రోజు రాత్రి అమెరికా మార్కెట్‌ క్షీణించినప్పటికీ, మంగళవారం భారత్‌ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2 పాయింట్ల పెరుగుదలతో 34,069 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల తగ్గుదలతో 10,239 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. క్రితం రోజు భారత్‌ మార్కెట్‌ 2 శాతంపైగా ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా వేదాంత, హిందాల్కో, గెయిల్‌, టాటా మోటార్స్‌ షేర్లు పాజిటివ్‌గా ట్రేడవుతుండగా, పెట్రో మార్కెటింగ్‌ కంపెనీలు బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీలతో పాటు ఆదాని పోర్ట్స్‌ 1-2 శాతం మధ్య క్షీణతతో ప్రారంభమయ్యాయి.

అమెరికా మార్కెట్‌ డౌన్‌

 అమెరికా మార్కెట్‌ 1 శాతం వరకూ పతనంకావడంతో పాటు ఇండియన్‌ ఏడీఆర్‌లు గరిష్టస్థాయి నుంచి తగ్గాయి. అలాగే మంగళవారం ఆసియా మార్కెట్లన్నీ క్షీణతతో మొదలయ్యాయి. అయితే ఉదయం 9.15గంటల సమయానికి ఒక్క హాంకాంగ్‌ సూచీ తప్ప, మిగిలిన ప్రధాన సూచీలన్నీ స్వల్పలాభాల్లోకి మళ్లాయి. జపాన్‌ నికాయ్‌ సూచి 0.8 శాతం వరకూ పెరిగింది. చైనా, సింగపూర్, కొరియా సూచీలు 1 శాతం వరకూ ఎగిసాయి. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ మాత్రం 0.3 శాతం నష్టంతో కదులుతోంది. 
 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 30th October 2018

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే కొన్ని షేర్ల వివరాలు టాటా పవర్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో కంపెనీ రూ.5,500 కోట్ల ఎన్‌సీడీల జారీకి ఆమోదం తెలిపింది. కెడిల్లా హెల్త్‌కేర్:- ఈక్విటీ షేర్ల రూపంలో విండ్లస్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 51శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ప్రక్రియతో విండ్లస్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ... కెడిల్లా హెల్త్‌కేర్‌ అనుబంధ సంస్థగా మారనుంది. సన్‌టెక్‌ రియల్టీ:- రూ.25 కోట్ల వాణిజ్య పేపర్ల ఇష్యూను

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు డౌన్‌

Tuesday 30th October 2018

క్రితం రోజు రాత్రి అమెరికా మార్కెట్‌ క్షీణత కారణంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మంగళవారం ఉదయం 8.40 గంటలకు 40 పాయింట్ల క్షీణతతో 10,244 పాయింట్ల వద్ద కదులుతోంది. ఇక్కడి నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుగుణంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ కదులుతుంది. సోమవారం స్పాట్‌ నిఫ్టీ 10,250 పాయింట్ల వద్ద ముగియగా, ఫ్యూచర్‌ 10,284 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సోమవారం రాత్రి అమెరికా మార్కెట్‌ 1 శాతం వరకూ పతనమైనప్పటికీ, మంగళవారం

Most from this category