STOCKS

News


రూపాయి బలం వెనుక కారణాలు

Tuesday 19th March 2019
Markets_main1552934373.png-24673

రూపాయి ఈ స్థాయి నుంచి ఇంకొంత లాభపడే అవకాశాలు ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భాస్కర్‌పాండా తెలిపారు. సాంకేతికంగా 68.80 సాంకేతిక స్థాయి అని తాను ఎప్పటి నుంచో చెబుతున్నట్టు గుర్తు చేశారు. రూపాయి ఈ స్థాయిని బ్రేక్‌ చేయడంతో 68.46 వరకు వెళ్లొచ్చన్నారు. 

రూపాయి బలం ఇందు వల్లే... 
మార్చిలో రూపాయి టర్న్‌ అరౌండ్‌ కావడం వెనుక ఐదు ప్రాథమిక కారణాలు ఉన్నాయి. 

  • మార్చి నెలలో దాదాపు సాధారణంగా రూపాయి డాలర్‌తో బలపడుతుంది. దీనికి కారణం భారీ స్థాయిలో నిధుల రాకవల్లే. 
  • భారత్‌-పాకిస్థాన్‌ ఘర్షణల తర్వాత నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు తొలగిపోయాయి. ఫండమెంటల్స్‌ రూపాయికి అనుకూలంగా ఉన్నాయి. 
  • ఎన్‌సీఎల్‌టీ, ఎన్‌సీఎల్‌ఏటీ స్థాయిలో ఎంతో కృషి జరిగింది. దీంతో వీటి నుంచి మరిన్ని పరిష్కారాల పట్ల మార్కెట్‌ ఆశాభావంతో ఉంది. ఇది మరో సానుకూల అంశం.
  • విదేశీ నిధులు మంచిగా వస్తున్నాయి. రూపాయికి ఇదొక సానకూలాంశం.
  • అన్ని వర్ధమాన కరెన్సీలతో రూపాయి అండర్‌పెర్‌ఫార్మ్‌ చేసింది. కనుక ఇది దిద్దుబాటు సమయం. 
  •  

ఈ అంశాలన్నీ కలసి రూపాయి బలపడేందుకు కారణమవుతున్నాయని భాస్కర్‌ పాండా తెలిపారు. అయితే, సమీప కాలంలో రూపాయి 68.46 స్థాయిని దాటిపోకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రూపాయి మరీ బలపడకపోవచ్చని, మరీ అస్థిరతలు ఉంటే తప్ప ఆర్‌బీఐ జోక్యం చేసుకోకపోవచ్చన్నారు.



You may be interested

మార్కెట్లలో అనిశ్చితే ఒక అవకాశం: యూనియన్‌ ఏఎంసీ

Tuesday 19th March 2019

స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని స్నేహితునిగా మలుచుకోవాలని, దీర్ఘకాలం దృష్టితో ముందడుగు వేయాలని యూనియన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ వినయ్‌ పహారియా సూచించారు. పెట్టుబడుల కేటాయింపులను గుర్తించి అందుకు కట్టబడి ఉండాలని చెప్పారు. వినియోగదారుల విచక్షణారహిత వినియోగంపై ఆధారపడిన కంపెనీలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అదే సమయంలో కన్జ్యూమర్‌ స్టాపుల్‌ అంత ఆకర్షణీయంగా లేదన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన

రాణించిన రియల్టీ షేర్లు

Monday 18th March 2019

రియల్టీరంగ షేర్లు సోమవారం రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 2.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ 16శాతం లాభపడింది. బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 7శాతం పెరిగింది. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఐబీరియల్‌ఎస్టేట్‌ షేర్లు 4శాతం ర్యాలీ చేశాయి. శోభ, ఓబేరాయ్‌ రియల్టీ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. మహీంద్రా లైఫ్‌, సన్‌టెక్‌ షేర్లు స్వల్పంగా అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఫోనెక్స్‌ లిమిటెడ్‌, డీఎల్‌ఎఫ్‌

Most from this category