News


వచ్చే ఏడాది మార్కెట్లను నడిపించనున్న అంశాలివే

Sunday 23rd December 2018
Markets_main1545587428.png-23177

2018 స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు ఊహించని అనుభవాలను మిగిల్చింది. ఈ ఏడాది ఎక్కువగా ఆటుపోట్లతో సాగింది. ఈక్విటీ రిటైల్‌ ఇన్వెస్టర్లలో ఎక్కువ మందికి నష్టాలు ఎదురైన సంవత్సరం, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ విభాగాలు భారీ నష్టాలు మిగిల్చాయి. మరి 2019 సం‍వత్సరంలో మార్కెట్లు ఎలా ఉంటాయి? వీటిపై ప్రభావం చూపించే అంశాలు ఏవన్న ఆసక్తి ఉండడం సహజం. దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం...

 

రాజకీయ అంశాలు
‘‘కేంద్రంలోని బీజేపీ సర్కారుకు 2019లో అసలు పరీక్ష ఎదురుకానుంది. అవినీతి రహిత పాలనను అందిస్తున్న ప్రధాని మోదీ ప్రజాదరణకు ఇది పరీక్ష వంటిదని నిపుణులు భావిస్తున్నారు. అయితే, రాఫెల్‌ విమానాల స్కామ్‌ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఇతర అంశాలు మార్కెట్‌కు తలనొప్పి వంటివి. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని మార్కెట్లు ఆశిస్తాయి. ఎన్నికల తర్వాత రాజకీయంగా స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతే విధానపరమైన నిర్ణయాలు ఆటంకాల్లేకుండా సాగిపోతాయి. ఆ విధమైన స్థిరమైన ప్రభుత్వాన్ని మార్కెట్లు ఆహ్వానిస్తాయి’’ అని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ హెడ్‌ జగన్నాథం తూనుగుంట్ల తెలిపారు. 

ఫలితాలు
‘‘కార్పొరేట్‌ కంపెనీల ఎర్నింగ్స్‌ మార్కెట్ల గమ్యాన్ని నిర్దేశించే మరో కీలకమైన అంశం. ఆశావహ వర్షాల సీజన్‌, కంపెనీల ఫలితాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 18 శాతం వృద్ధి ఉండొచ్చు. తక్కువ ఉత్పత్తి వ్యయాలు, చమురు ధరల తగ్గుదల ఇందుకు కారణం. ప్రభుత్వం నుంచి నిధుల వ్యయాల నేపథ్యంలో... ప్రైవేటు రంగం నుంచి కూడా మూలధన వ్యయాలు ఉంటాయి’’ ఐఐఎఫ్‌ఎల్‌ సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. 

చమురు ధరలు
2018లో మార్కెట్‌ కరెక్షన్‌ కారణాల్లో చమురు ధరలు కూడా ఒకటి. 2019లోనూ మార్కెట్లపై ముడి చమురు ధరల ప్రభావం ఉంటుంది. ఇరాన్‌ నుంచి దిగుమతులకు కొన్ని దేశాలకు అమెరికా మినహాయింపునివ్వడం ధరల తగ్గుదలకు కారణం. రానున్న కాలంలో సరఫరా సమస్యలు ధరలను నిర్ణయించనున్నాయి. అంతర్జాతీయ వృద్ధి మందగిస్తే చమురు ధరలపైనా ప్రభావం పడుతుంది.

చైనా వృద్ధి
అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల వల్ల వృద్ధి మందగిస్తుందన్న ఆందోళనలు ఉన్నాయి. ‘‘ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాలో బలహీన వృద్ధి సంకేతాలు కనిపిస్తున్నాయి. రిటైల్‌ అమ్మకాల వృద్ధి 15 ఏళ్లలోనే తక్కువగా నమోదైంది. మూడేళ్లలోనే అతి తక్కువగా తయారీ వృద్ధి నమోదైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీలు, కమోడిటీలపై ప్రభావం చూపిస్తుంది’’ అని ఆనంద్‌రాఠి షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ ఈక్విటీ అడ్వైజరీ వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ్‌ సెదాని తెలిపారు. 

వినియోగం
వినియోగం కూడా మార్కెట్లపై ప్రభావం చూపించే అంశంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో గ్రామీణంగా వినియోగానికి ఊతమిచ్చే పథకాలను కేంద్రం ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యం సైతం వినియోగానికి ఊతమిచ్చేదేనని సెదానీ తెలిపారు.You may be interested

మంచి ఫండ్‌ కాదు... సరిపడే ఫండ్‌ ఎంపిక

Sunday 23rd December 2018

ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ పండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు... ఏ పథకంలో తాను ఇన్వెస్ట్‌ చేయాలని ప్రశ్నిస్తుంటారు. అంటే మంచి పథకం ఏదో తెలుసుకుని అందులో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటారు. కానీ, ఇది తప్పుడు ప్రశ్న అని వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ సీఈవో ధీరేంద్ర కుమార్‌ అంటున్నారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం లభించడం కష్టమంటున్నారు. దీనికి బదులు ఏ తరహా పథకంలో తాను ఇన్వెస్ట్‌ చేయాలన్నది సరైన ప్రశ్నగా ఆయన సూచించారు.     ‘‘మీ

ఆనంద్‌రాఠి వ్యాల్యు పిక్‌: పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ

Saturday 22nd December 2018

 ప్రముఖ బ్రోకరజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.223 టార్గెట్‌ ప్రైస్‌: రూ.269 ఆనంద్‌రాఠి.. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీపై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 12 నెలల కాలంలో స్టాక్‌ ధర రూ.269కే చేరొచ్చని అంచనా వేసింది. ‘ఇండియన్‌ ఎనర్జీ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న కంపెనీ పెట్రోనెట్‌

Most from this category