STOCKS

News


ఫినోలెక్స్‌ కేబుల్స్‌ కొనొచ్చు: జియోజిత్‌ ఫైనాన్స్‌

Saturday 8th September 2018
Markets_main1536389223.png-20092

కేబుల్స్‌ తయారీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ‘‘ఫినోలెక్స్‌ కేబుల్స్‌’’ షేరు కొనొచ్చని జియోజిత్‌ ఫైనాన్స్‌ సిఫార్సు చేస్తోంది.  దేశీయ కేబుల్స్‌ మార్కెట్లో ఎక్కువ వాటా కలిగి ఉండి కేబుల్స్‌ పరిశ్రమను శాసిస్తోన్న ఫినోలెక్స్‌ సంస్థపై జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంచనాలు ఇప్పుడు చూద్దాం..!
రేటింగ్‌:- కొనొచ్చు
ప్రస్తుత ధర:- రూ.561
టార్గెట్‌ ధర:- రూ.649
ఆదాయపు అంచనా:- 17 శాతం
విశ్లేషణ:- ఫినోలెక్స్‌ సంస్థ దేశంలో ప్రతి ఏటా విద్యుత్‌ కేబుల్స్‌ తయారీ మార్కెట్‌లో 80 శాతం, టెలికమ్యూనికేషన్స్‌ మార్కెట్‌లో 16 శాతం ఆదాయాన్ని దక్కించుకుంటోంది. ఈ తొలి త్రైమాసికంలో ఆదాయంలో 17 శాతం, ఈబిటాలో 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. వ్యయ నియం‍త్రణ కారణంగా ఈబిటా మార్జిన్‌ 10 శాతం పెరిగింది. అయితే అధిక పన్ను చెల్లింపుల కారణంగా నికర లాభం మాత్రం 11 శాతం క్షీణించింది. కమ్యూనికేషన్‌ కేబుల్స్‌ డిమాండ్‌ అంచనాలు, క్రమంగా విస్తరిస్తున్ననిర్మాణ రంగం దృష్ట్యా రానున్న రోజుల్లో కంపెనీ ఆదాయం మరింత పెరగుతుంది. కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూషన్, బ్రాండ్ వేల్యూ నేపథ్యంలో రానున్న రెండేళ్లలో కంపెనీ ఆదాయం 13 శాతం చక్రీయ వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని జియోజిత్‌ అంచనా వేస్తుంది.



You may be interested

అక్సో నోబెల్‌పై కోటక్‌ బుల్లిష్‌

Saturday 8th September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా అక్సో నోబెల్‌ ఇండియా స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. స్టాక్‌: అక్సో నోబెల్‌ ఇండియా రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,730 టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,200 కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా అక్సో నోబెల్‌ ఇండియాపై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.2,200గా నిర్ణయించింది. కంపెనీ కీలకమైన డెకరేటివ్‌, ఇండస్ట్రీయల్‌ పెయింట్స్‌ విభాగాల్లో చాలా త్రైమాసికాల నుంచి స్థిరమైన

స్వల్పంగా తగ్గిన పసిడి

Saturday 8th September 2018

న్యూయార్క్‌/ముంబై:- అంచనాలకు మించి నమోదైన అమెరికా ఉద్యోగ గణాంకాలు పసిడి ధరకి షాక్‌నిచ్చాయి. పసిడి ధర వారంతపు రోజైన శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌కు 2.50 డాలర్లు నష్టపోయి 1,201.80 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికాలో ఆగస్ట్‌లో అంచనాలకు మించి ఉద్యోగ కల్పన జరిగినట్లు శుక్రవారం విడుదలైన గణాంకాలు తెలియజేశాయి. ఈ ఆగస్ట్‌లో అత్యధికంగా 2.01లక్షల నూతన ఉద్యోగ నియామకాలు జరిగినట్లు అమెరికా లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. ఉద్యోగ అవకాశాలు

Most from this category