STOCKS

News


ప్రభుత్వ సంస్థల్లో షేర్ల బైబ్యాక్‌

Saturday 8th September 2018
Markets_main1536381434.png-20084

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షేర్లు బైబ్యాక్ చేసేందుకు దాదాపు పదకొండు ప్రభుత్వ రంగ సంస్థలను (సీపీఎస్‌ఈ) కేంద్ర ఆర్థిక శాఖ షార్ట్‌లిస్ట్ చేసింది. కోల్ ఇండియా, ఎన్టీపీసీ, నాల్కో, ఎన్‌ఎ౾ండీసీ, ఎన్ఎల్‌సీ, భెల్‌, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌బీసీసీ, ఎస్‌జేవీఎన్‌, కేఐవోసీఎల్‌, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఈ జాబితాలో ఉన్నాయి. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఇటీవలే ఆయా సంస్థలతో చర్చించిన అనంతరం ఈ లిస్టును రూపొందించింది. అయితే, ఆయా సంస్థల వ్యాపార ప్రణాళికలను బట్టి చూస్తే.. అన్ని సంస్థలు 2018-19లోనే షేర్ల బైబ్యాక్ చేయలేకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2016 మే 27 నాటి పెట్టుబడుల పునర్‌వ్యవస్థీకరణ మార్గదర్శకాలకి ప్రకారం కనీసం రూ. 2,000 కోట్ల నికర విలువ, రూ. 1,000 కోట్ల పైగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న సీపీఎస్‌ఈలు తప్పనిసరిగా షేర్ల బైబ్యాక్ చేపట్టాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా షేర్లు బైబ్యాక్ చేయాలంటూ ఈ సీపీఎస్‌ఈలకు కేంద్రం సూచించింది. కంపెనీ సంపదలో కొంత భాగాన్ని షేర్‌హోల్డర్లకు బదలాయించేందుకు, షేరు ధరలకూ ఊతం ఇచ్చేందుకు సంస్థలు.. షేర్ల బైబ్యాక్ చేపడుతుంటాయి. ఇలా కొన్న షేర్లను రద్దు చేయడం లేదా ట్రెజరీ స్టాక్ కింద వర్గీకరించడం చేస్తాయి. చెలామణీలో ఉన్న షేర్లు తగ్గడం వల్ల షేరువారీ ఆర్జన మరింత పెరిగి ఆయా సంస్థల వ్యాపారం ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది.



You may be interested

రూ. 500 కోట్ల సమీకరణలో ఎయిరిండియా

Saturday 8th September 2018

ముంబై: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా దాదాపు రూ. 500 కోట్ల మేర నిధులను స్వల్పకాలిక రుణాల రూపంలో సమీకరించాలని యోచిస్తోంది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ నిధులను వినియోగించనుంది. సెప్టెంబర్‌లోనే ఒకే దఫాలో లేదా విడతలవారీగా ఈ నిధులను సమీకరించే అవకాశం ఉంది. బ్యాంకుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ఎయిరిండియా ఈ మేరకు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 10లోగా బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నిర్వహణ

జోరుగా డిజిన్వెస్ట్‌మెంట్‌

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ (డిజిన్వెస్ట్‌మెంట్‌) ప్రక్రియపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో (సీఈఎల్‌) పూర్తిగా 100 శాతం వాటాలను విక్రయించేందుకు శుక్రవారం బిడ్లను ఆహ్వానించింది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ మేరకు బిడ్డర్లు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) పంపాలంటూ ప్రకటించింది. ఈవోఐలు దాఖలు చేసేందుకు అక్టోబర్ 21 ఆఖరు తేదీ. 2018 మార్చి 31 నాటికి

Most from this category