STOCKS

News


జీఐసీ, న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ల్లో ఓఎఫ్‌ఎస్‌

Friday 16th November 2018
Markets_main1542347759.png-22079

న్యూఢిల్లీ: జీఐసీ, న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీల్లో మరింత వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)విధానంలో ఈ రెండు బీమా కంపెనీల్లో మరింత వాటాను విక్రయించడానికి కేంద్ర ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు కంపెనీల ఓఎఫ్‌ఎస్‌ కార్యక్రమాలను నిర్వహించడానికి ఆసక్తి గల మర్చంట్‌ బ్యాంకింగ్‌ సంస్థల నుంచి దీపమ్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) దరఖాస్తులను ఆహ్వానించింది. సదరు మర్చంట్‌ బ్యాంకింగ్‌ సంస్థలు వచ్చే నెల 7లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
గత ఏడాది అక్టోబర్‌లో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(జీఐసీ), నవంబర్‌లో న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీలు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాయి. ఐపీఓ ద్వారా జీఐసీ రూ.11,370 కోట్లు, న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీ రూ.9,600 కోట్లు చొప్పున నిధులు సమీకరించాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకూ రూ.15,200 కోట్ల వరకూ సమీకరించింది. 



You may be interested

లిక్విడిటీ సమస్య వ్యవస్థాపరం కాదు

Friday 16th November 2018

న్యూఢిల్లీ: లిక్విడిటీ కొరత వ్యవస్థాపరమైన సమస్య కాదని ప్రముఖ బ్యాంకర్లు స్పష్టంచేశారు. రోలోవర్‌కు సంబంధించి అన్ని ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలూ చెల్లింపులను చేయగలవని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌కుమార్‌ చెప్పారు. సేవింగ్స్‌ అండ్‌ రిటైల్‌ బ్యాంక్స్‌ ప్రపంచ 25వ కాంగ్రెస్‌ సదస్సుకు హాజరైన సందర్భంగా పలువురు బ్యాంకింగ్‌ రంగ నిపుణులు లిక్విడిటీపై స్పందించారు. నాబార్డ్‌ చైర్మన్‌ హెచ్‌కే భన్వాలా మాట్లాడుతూ... లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. ‘‘కొన్ని సంస్థలు బ్యాంకుల నుంచి స్వల్పకాల రుణాలను

రిలయన్స్‌ ఇన్‌ఫ్రా నికర లాభం 49 శాతం డౌన్‌

Friday 16th November 2018

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 49 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.544 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.277 కోట్లకు తగ్గిందని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా తెలిపింది. ఈ క్యూ2లో రూ.4,200 కోట్ల మేర వన్‌ టైమ్‌ కేటాయింపులు జరిపామని, ఈ కేటాయింపులు లేకుంటే నికర లాభం 723 శాతం

Most from this category