STOCKS

News


యాక్సిస్‌, ఐటీసీలో షేర్ల విక్రయం

Monday 14th January 2019
Markets_main1547451885.png-23574

- 'సూటీ' వాటాలపై కేంద్రం యోచన
న్యూఢిల్లీ: స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (సూటీ) ద్వారా యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీల్లో తనకున్న వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించడంపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి పెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బల్క్ లేదా బ్లాక్ డీల్స్‌ రూపంలో ఇది ఉండొచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 30 నాటికి సూటీకి యాక్సిస్ బ్యాంక్‌లో 9.63 శాతం, ఐటీసీలో 7.97 శాతం, ఎల్‌అండ్‌టీ లో 1.80 శాతం వాటాలు ఉన్నాయి. ఎల్‌అ౾ండ్‌టీ షేర్ల బైబ్యాక్‌ ప్రకటిస్తే పాల్గొనవచ్చని భావిస్తున్న కేంద్రం.. మిగతా రెండింటిలో మాత్రం ఆఫ్‌-మార్కెట్ డీల్స్ రూపంలో వాటాలు పాక్షికంగా విక్రయించే అవకాశం పరిశీలించవచ్చని అధికారి వివరించారు. ఇన్‌ఫ్రా దిగ్గజం ఎల్‌అండ్‌టీ ఇప్పటికే షేర్ల బైబ్యాక్‌ ప్రకటించేందుకు అనుమతుల కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని కోరుతోంది. ఈ బైబ్యాక్‌లో పాల్గొంటే దాదాపు రూ. 700 కోట్లు సమకూర్చుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 80,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రభుత్వం ఇప్పటిదాకా రూ. 34,000 కోట్లు సమీకరించగలిగింది.



You may be interested

8నెలల కనిష్టానికి డబ్ల్యూపీఐ గణాంకాలు

Monday 14th January 2019

ఆహార పదార్థాలు, చమురు ధరలు శాంతించడంతో డిసెంబర్‌ టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) 8నెలల కనిష్టానికి దిగివచ్చింది. నవంబర్‌లో 4.64 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్‌లో భారీ తగ్గి 3.80 శాతానికి పరిమితమైంది. గతేడాది డిసెంబర్‌లో 3.58 శాతంగా నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన  గణాంకాల వివరాలు ఇలా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రొడెక్టుల ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.21 శాతంగా నమోదు కాగా, డిసెంబర్‌ నాటికి 3.59 శాతానికి

ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ మంచివేనా

Monday 14th January 2019

ప్ర: ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ (ఎఫ్‌ఎమ్‌పీ)ల్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదే కదా ? ఈ విషయమై తగిన సూచనలివ్వండి. -మృణాళిని, సికింద్రాబాద్‌ జ: ఎఫ్‌ఎమ్‌పీలు ఎప్పుడైనా  మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలే.  ప్రస్తుతం ఇవి మంచి రాబడులనిస్తున్న మాట వాస్తవమే. కానీ వీటికి ఉన్న ఏకైక సమస్య లిక్విడిటీ. వీటికి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. ఇవి స్టాక్‌ మార్కెట్లో లిస్టైనప్పటికీ, వీటి వాల్యూమ్స్‌ చాలా తక్కువగా ఉంటాయి. ​ట్రేడింగ్‌ చాలా

Most from this category