STOCKS

News


ఈ నెలాఖర్లో సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఎఫ్‌పీఓ

Tuesday 6th November 2018
Markets_main1541480428.png-21734

న్యూఢిల్లీ: సీపీఎస్‌ఈ ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్‌) ఫాలో ఆన్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ) ఈ నెలాఖరులో ఉండొచ్చని ఆర్థిక శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఈ ఎఫ్‌పీఓ ద్వారా రూ.8,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 10 షేర్లతో కూడిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ద్వారా కేంద్రం నిధులు సమీకరించడం ఇది నాలుగోసారి. మూడు సార్లు సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.11,500 కోట్లు సమీకరించింది. కాగా ఈ ఈటీఎఫ్‌ను కేంద్ర ప్రభుత్వం పునర్వ్యస్థీకరిస్తోంది. గెయిల్‌, ఇంజినీర్స్‌ ఇండియా, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలను తొలగించనున్నది. ఈ మూడు సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ వాటా 55 శాతం కంటే దిగువకు పడిపోవడంతో ఈ కంపెనీలను తొలగిస్తున్నారు. వీటిని తొలగించి కొత్తగా ఎమ్‌ఓఐఎల్‌, కేఐఓసీఎల్‌లతో పాటు మరో 2 కొత్త సీపీఎస్‌ఈలను దీంట్లో చేరుస్తున్నారు. 


 



You may be interested

ఆప్టిమస్‌లో యూనికెమ్‌కు వాటా

Tuesday 6th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ ఆప్టిమస్‌ గ్రూప్‌నకు చెందిన ఏపీఐ, ఇంటర్మీడియేట్‌ బిజినెస్‌లో 20 శాతం వాటాను యూనికెమ్‌ ల్యాబొరేటరీస్‌ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ రూ.120 కోట్లు. ఆప్టిమస్‌కు హైదరాబాద్‌, విశాఖపట్నంలో ఏపీఐ తయారీ కేంద్రాలున్నాయి. 

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 6th November 2018

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు విప్రో:- వ్యాపార కార్యకలాపాల కోసం చెక్‌ పాయింట్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌తో జట్టు కట్టనుంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- డచ్‌ బ్యాంక్‌కు సాంకేతిక పరిఙ్ఞానాన్ని అందించేందుకు ఒప్పందాన్ని కుదర్చుకుంది. హిందూస్థాన్‌ కన్‌స్ట్రక్చన్స్‌:- రూ.500 కోట్ల విలువైన రైట్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. నవంబర్‌ 12న రైట్స్‌ ఇష్యూ కమిటి సమావేశం జరగనుంది. ఆంధ్రా బ్యాంక్‌:- ఏఎస్‌ఆర్‌ఈసీ, ఇండియా ఇంటెల్‌ బ్యాంక్‌, ఇండియాఫస్ట్‌లైఫ్‌ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో వాటా ఉపసంహరణకు బోర్డు

Most from this category