STOCKS

News


పీఎస్‌యూలపై పెరిగిన ఆసక్తి

Friday 19th April 2019
Markets_main1555670067.png-25231

మార్నింగ్‌స్టార్‌ ప్రతినిధి కౌస్తుభ్‌ బెలాపుర్కర్‌
గతనెల ఈక్విటీల్లో రిటైలర్ల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగిందని, ఫండ్‌ మేనేజర్లు ఎక్కువగా పీఎస్‌యూలు, కన్జూమర్‌ స్టాకులపై మక్కువ చూపారని మార్నింగ్‌స్టార్‌ ఫండ్‌ రిసెర్చ్‌ హెడ్‌ కౌస్తుభ్‌ బెలాపుర్కర్‌ చెప్పారు. రెండు నెలలుగా ఎఫ్‌ఐఐల హవా పెరిగిందని, ఈ సమయంలో డీఐఐలు కాస్త నెమ్మదించాయని చెప్పారు. మార్చిలో ఫండ్‌మేనేజర్లు ఎక్కువగా ఈటీఎఫ్‌ల రూపంలో పీఎస్‌యూల్లో పెట్టుబడులకు ప్రాధాన్యమిచ్చారన్నారు. ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, కోల్‌ఇండియా, ఐఓసీ వంటి ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఎఫ్‌ఐఐలు ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయన్నారు. దీంతో ఈ షేర్లన్నీ కొద్ది కాలంగా మంచి ర్యాలీ చూపాయి. వీటిలో ఎన్‌టీపీసీలోకి కేవలం సీపీఎస్‌ఈ నిధులే కాకుండా కంపెనీపై వచ్చిన పాజిటివ్‌ వార్తల కారణంగా ఇతర మదుపరులు కూడా ఆసక్తి కనబరిచడం జరిగిందన్నారు. మార్చిలో సీపీఎస్‌ఈ ఆఫరింగ్‌లో పదివేల కోట్ల రూపాయల నిధుల ప్రవాహం వివిధ పీఎస్‌యూల్లోకి ప్రవహించిందని చెప్పారు. ఈ స్టాకుపై తాను కూడా పాజిటివ్‌గా ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు ఇప్పటివరకు ఎక్కువమంది ఫండ్‌ మేనేజర్లు ఇబ్బడిముబ్బడిగా నిధులు కుమ్మరించిన ఫైనాన్షియల్‌ కంపెనీల్లోకి నిధుల ప్రవాహానికి విరామం వచ్చిందని చెప్పారు. బ్యాంకుల్లో వచ్చిన భారీ ర్యాలీ కారణంగా ఫండ్స్‌ వీటిలో పొజిషన్లను కాస్త తగ్గించుకుంటున్నట్లు కనిపిస్తోందన్నారు. బ్యాంకుల్లో వాల్యూషన్లు పెరగడం మినహా పెద్దగా ఎలాంటి మార్పులు రాలేదన్నారు. ప్రస్తుతం బీమా కంపెనీలపై ఫండ్స్‌కు క్రమంగా మక్కువ పెరుగుతోందన్నారు. అందువల్ల బడా బీమా కంపెనీల షేర్లలోకి నిధుల ప్రవాహం పెరిగిందని చెప్పారు. మరోవైపు హెల్త్‌కేర్‌, ఐటీ రంగాలపై ఫండ్స్‌కు ఆసక్తి సన్నగిల్లినట్లు కనిపిస్తోందన్నారు. కన్జూమర్‌ మిడ్‌క్యాప్స్‌లో మంచి కొనుగోళ్లు కనిపించాయని, షీలాఫోమ్‌, రిలాక్సో, జుబిలాంట్‌ పుడ్‌వర్క్స్‌లాంటి మిడ్‌క్యాప్స్‌ ఇందుకు ఉదాహరణన్నారు. దీంతో పాటు ట్రావెల్‌, టూరిజం రంగాలపై కూడా ఆసక్తి పెరిగిందన్నారు. ఈ రంగంలో ఇండియన్‌ హోటల్స్‌, లెమన్‌ట్రీపై ఫండ్స్‌ ఎక్కువ మక్కువ చూపాయన్నారు. ఇతర రంగాల్లోకి వచినట్లు హోటల్స్‌లో భారీగా నిధులు రాకున్నా క్రమానుగతంగా వచ్చే నిధుల మొత్తం పెరుగుతోందని వివరించారు. ఈ రంగంలో లాంగ్‌టర్మ్‌ పెట్టుబడులను పరిశీలించవచ్చన్నారు. You may be interested

క్రూడ్‌ మరింత ప్రియం?!

Friday 19th April 2019

ఆనంద్‌ రాఠీ అంచనా ఒపెక్‌ ఉత్పత్తికోతల ప్రభావం ముడిచమురు ధరపై బాగానే కనిపిస్తోంది. ఫిబ్రవరితో పోలిస్తే ఒపెక్‌ రోజువారీ చమురు ఉత్పత్తిలో దాదాపు 5లక్షల బ్యారెళ్ల క్షీణత నమోదయింది. సౌదీ అరేబియా, వెనెజులా, ఇరాక్‌లో ఉత్పత్తి భారీగా పతనం కావడం చమురు ధరపై పడింది. తిరిగి ముడిచమురు ధరలో సమతుల్యం వచ్చేవరకు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటామని సౌదీ ప్రకటిస్తోంది. ఇందుకోసం ఉత్పత్తిలో మరింత కోతలు విధించేందుకు కూడా రెడీ అంటోంది. ఈ

స్థిరంగా ముగిసిన పసిడి

Friday 19th April 2019

శుక్రవారం ఆసియాలో 1.10డాలరు స్వల్ప లాభంతో 1,277.90 డాలర్ల వద్ద క్లోజయ్యింది . గత రాత్రి న్యూయార్క్‌ ట్రేడింగ్‌లో పసిడి ధర స్థిరంగా ముగిసింది.నేడు గుడ్‌ఫ్రైడ్‌ సందర్భంగా యూరప్‌, అమెరికా మార్కెట్లు సెలవు కావున అక్కడ పసిడి ట్రేడింగ్‌ జరగదు.  యూరప్‌ తయారీరంగ గణాంకాలు బలహీనంగా నమోదు కావడం పసిడి స్ధిరమైన ముగింపునకు కారణమైంది. అయితే గురువారం రాత్రి అమెరికా డాలరు ఇండెక్స్‌ ర్యాలీ జరిపినా, పసిడి ధర 4నెలల కనిష్టం స్థాయి వద్ద స్థిరంగా ట్రేడయ్యింది. ఇక

Most from this category