STOCKS

News


2019లో ఎన్‌డీఏదే అధికారం-సీఎల్‌ఎస్‌ఏ, యూబీఎస్‌ల అంచనా

Wednesday 12th December 2018
Markets_main1544601278.png-22862

మంగళవారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేటతెల్లమైన తర్వాత దేశీ ఈక్విటీ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పైచెయ్యి సాధించింది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌లలో ఓడిపోవడంతో బీజేపీకిఎదురురెబ్బ తగిలినట్లయ్యింది. 
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ నియామకం సానుకూల ప్రభావం చూపడంతో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లైన నిఫ్టీ, సెన్సెక్స్‌ లాభాల్లో ట్రేడవుతున్నాయి. 
గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థలు తాజా ఎన్నికల ఫలితాన్ని సీరియస్‌గానే తీసుకున్నాయి. అయితే ఇవి ఇంకా ప్రధాని మోదీపై విశ్వాసాన్ని కోల్పోలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధారణ మెజారిటీతో గెలవొచ్చని అభిప్రాయపడుతున్నాయి. 

సీఎల్‌ఎస్‌ఏ
2019 ఎన్నికల్లో మోదీనే ఫేవరేట్‌ అని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కమలదళం 245-280 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. మోదీ అధికారంలోకి రావడానికి ఈ సంఖ్యా బలం సరిపోతుందని పేర్కొంది. అయితే ఎస్‌పీ-బీఎస్‌పీ కలవడం అనేది ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి పెద్ద సవాల్‌ అని తెలిపింది. దేశీ ఇన్వెస్టర్లు కొత్త ఇన్వెస్ట్‌మెంట్లను తగ్గించుకుంటే.. అది మార్కెట్లను రిస్క్‌ అవుతుందని పేర్కొంది. 

క్రెడిట్‌ సూసీ
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ కేంద్రంలో చక్రం తిప్పుతుందో స్పష్టమైన సంకేతాలు లేవని క్రెడిట్‌ సూసీ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓడిపోవడం అది పెద్ద నెగటివ్‌ అంశమని తెలిపింది. ఎన్నికల ఫలితాలు మార్కెట్‌ దిశను మార్చలేవని పేర్కొంది. 

యూబీఎస్‌
మార్కెట్ల దృష్టి ఇప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికల వైపు మళ్లిందని యూబీఎస్‌ పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావొచ్చని అంచనా వేసింది. ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో రిస్క్‌-రివార్డ్‌ రేషియో ఆకర్షణీయంగా లేదని, అధిక వ్యాల్యుయేషన్స్‌తో ట్రేడవుతోందని పేర్కొంది. 

హెచ్‌ఎస్‌బీసీ
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిందని, బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది. 2019 ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్ది మార్కెట్‌లో ఒడిదుడుకులు పెరుగుతాయని పేర్కొంది.  

సిటీ
2013-14లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ సరళిని గమనిస్తే పూర్తి భిన్నంగా ఉందని సిటీ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌లలో బీజేపీ ఓడిపోవడానికి ప్రభుత్వ వ్యతిరేకతనే కారణమని పేర్కొంది. జీఎస్‌టీ నిబంధనల సరళీకరణ, ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు కొంత ఊరటనివ్వడం వంటి అంశాలు చోటుచేసుకోవచ్చని అంచనా వేసింది. You may be interested

టాప్‌గేర్‌లో అటో షేర్లు

Wednesday 12th December 2018

ప్రపంచమార్కెట్లో పెరిగిన అటో షేర్లకు అనుగుణంగా బుధవారం దేశీయ మార్కెట్లోనూ అటోరంగ షేర్లు లాభాల ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 3.50శాతం ర్యాలీ చేసింది. అమెరికా నుంచి దిగుమతయ్యే కార్లపై టారీఫ్‌లను తగ్గించడానికి సిద్ధమైనట్లు చైనా ప్రకటించింది. అర్జెంటీనాలో జరిగిన జీ-20 సదస్సులో ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి దిగుమతయ్యే కార్లపై చైనా ప్రస్తుతం

ఏడాది కోసం టాప్‌టెన్‌ సిఫార్సులు

Wednesday 12th December 2018

వచ్చే సంవత్సర కాలంలో దాదాపు 50 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు సిఫార్సు చేస్తున్నాయి. 1. హెచ్‌సీఎల్‌టెక్నాలజీ: టార్గెట్‌ రూ. 1330. ఎలారా క్యాపిటల్‌ రికమండేషన్‌. ఐబీఎం నుంచి ఏడు ఉత్పత్తులను సొంతం చేసుకోవడం అత్యంత పాజిటివ్‌ అంశం. అవుట్‌సోర్సింగ్‌ డీల్స్‌లో వీటి ప్రాధాన్యం ఎంతో ఉంది. కొందరు అనుమానించినట్లు డీల్‌ కారణంగా కంపెనీ మార్కెట్‌ క్యాప్‌లో కోత పడవచ్చు. కానీ దీర్ఘకాలంలో చాలా మేలు చేసే

Most from this category