STOCKS

News


అప్రమత్తంగా మారిన ఎఫ్‌ఐఐలు

Monday 13th May 2019
Markets_main1557727172.png-25697

వారం రోజులకు పైగా భారీ అమ్మకాలు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. వరుసగా 7 సెషన్లు సూచీలు నష్టపోయినందున కొంత రికవరీ కనిపించే ఛాన్సులున్నాయి. అయితే ఈ రికవరీ ఎంతవరకు ఉంటుందనేది చెప్పలేమని, ఎఫ్‌ఐఐలు క్రమంగా తమ పొజిషన్లు తగ్గించుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ట్రేడ్‌ టెన్షన్లు పెరగడం విదేశీ మదుపరులను అప్రమత్తం చేస్తోంది. దీంతో ఈక్విటీల్లో పొజిషన్లను ఎఫ్‌ఐఐలు తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికైతే వీరు దేశీయ ఈక్విటీల్లో నికర కొనుగోలుదారులుగానే ఉన్నారు. కానీ ఎఫ్‌ఐఐల లాంగ్‌- షార్ట్‌ నిష్పత్తి 20 బీపీఎస్‌ తగ్గింది. మే రెండున ఈ నిష్పత్తి 1.72 ఉండగా, మే 10న 1. 52కు చేరింది. అంటే ఎఫ్‌ఐఐలు నికర లాంగ్‌ ఓపెన్‌ పొజిషన్లను గణనీయంగా తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇండెక్స్‌ల్లో  ఎఫ్‌ఐఐల లాంగ్స్‌ దాదాపు నాలుగో వంతుకు తగ్గాయి. దీంతో ఈ పదిరోజుల్లో సూచీలు దాదాపు 4 శాతం క్షీణించాయని బీఎన్‌పీ పారిబా తెలిపింది. ఒకటి రెండు రోజులు చిన్నపాటి షార్ట్‌కవరింగ్‌ ఉండొచ్చని అంచనా వేసింది. మే 16 ఆప్షన్‌‍్సలో ఎక్కువగా పుట్స్‌ కనిపిస్తున్నాయి. అందువల్ల చిన్నపాటి రికవరీ ఉండొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లు సైతం చిన్న చిన్న రికవరీలు చూపుతున్నాయి. ఈ నెల 23న వచ్చే ఫలితాలు మార్కెట్‌ దిశను నిర్ధారిస్తాయి. మే నెల ఆప్షన్స్‌ పీసీఆర్‌(పుట్‌ కాల్‌ నిష్పత్తి) 1.12 వద్ద ఉంది. You may be interested

స్టాక్‌ సూచనలతో జర...జాగ్రత్త

Monday 13th May 2019

అడ్వైజర్ల ముసుగులో మోసాలు గత నెలలో ముగ్గురు మోసగాళ్లపై సెబీ చర్యలు వీటి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు అవసరం రిజిస్టర్డ్‌ సంస్థలేనా, లైసెన్స్‌ ఉందా అన్నది పరిశీలించాలి గత ట్రాక్‌ రికార్డుల్లో మోసపూరిత వివరాలు ఉండొచ్చు మీ రిస్క్‌, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా సూచనలు ఉండాలి నిజమైన అడ్వైజర్లు అన్ని రకాల ఉత్పత్తులను సూచిస్తారు పెట్టుబడుల విషయంలో సలహా సేవల పేరుతో ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున జరిగిన మోసం ఇటీవల వెలుగుచూసింది. ట్రోకా పేరుతో రూ.10 కోట్లకు పైగా

స్థిరంగా పసిడి

Monday 13th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం స్థిరంగా కదలుతుంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి 1డాలరు స్వల్పంగా లాభపడి 1,288.40డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య చర్చలు సందిగ్ధత నెలకొనడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనాలపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా సంక్షోభ సమాయాల్లో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ నెలకొంది. అమెరికా ప్రతిపాదించిన విధివిధానాలకు అనుగుణంగా చైనా తన వాణిజ్య చట్టాలను మార్పు చేయాల్సిందిగా

Most from this category