STOCKS

News


ఎఫ్‌ఐఐలు వాటాలు పెంచుకున్న కౌంటర్లు...

Tuesday 5th February 2019
Markets_main1549390137.png-24030

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు స్టాక్‌ ధరల్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయనడంతో సందేహం లేదు. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక కాలంలో ఎఫ్‌ఐఐలు సుమారు 387 కంపెనీల్లో వాటాలను పెంచుకున్నారు. అదే సమయంలో సుమారు 568 కంపెనీల్లో వాటాలు కొంత మేర విక్రయించారు. 384 కంపెనీల్లో వీరి వాటాల్లో ఎటువంటి మార్పుల్లేవని గణాంకాలు తెలియజేస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్‌ నెలలో నికరంగా రూ.17,000 కోట్ల అమ్మకాలు చేయగా, జనవరిలోనూ రూ.5,000 కోట్లకుపైగా ఈక్విటీల్లో అమ్మకాలు చేశారు. 2018 మొత్తం మీద ఎఫ్‌ఐఐలు డెట్‌, ఈక్విటీల నుంచి నికరంగా రూ.75,000 కోట్లు వెనక్కి తీసుకున్న విషయం గమనార్హం.

 

వాటా పెరిగినవి...
ఎఫ్‌ఐఐల వాటా పెరిగిన ప్రధాన స్టాక్స్‌ను గమనిస్తే... హెచ్‌డీఎఫ్‌సీ, భారత్‌ ఫైనాన్షియల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, అపోలో హాస్పిటల్స్‌, టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జస్ట్‌ డయల్‌, పీవీఆర్‌, హీరో మోటోకార్ప్‌, మణప్పురం ఫైనాన్స్‌, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, పీటీసీ ఇండియా, ఫెడరల్‌ బ్యాంకు, కేఎస్‌ఎస్‌ లిమిటెడ్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, జైన్‌ ఇరిగేషన్‌ ఉన్నాయి. ఎఫ్‌ఐఐలు కొన్ని కౌంటర్లలో విక్రయాలు చేస్తున్నప్పటికీ, అదే సమయంలో వృద్ధి అవకాశాలున్న స్టాక్స్‌ను విడిచిపెట్టడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు అన్ని రేటింగ్‌ సంస్థలు, ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు భారత వృద్ధి విషయంలో ఆశాజనక అంచనాలతో ఉన్న విషయం తెలిసిందే.

 

విక్రయించినవి...
ఇక ఎఫ్‌ఐఐలు డిసెంబర్‌ త్రైమాసికంలో యాక్సిస్‌ బ్యాంకు, కేపీఐటీ టెక్నాలజీస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, యూపీఎల్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టెక్‌ మహీంద్రా, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌, యస్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, మైండ్‌ట్రీ, సైయంట్‌, ఆర్‌ఐఎల్‌, ఎంఅండ్‌ఎం, సిప్లా తదితర కంపెనీల్లో స్వల్పంగా వాటాలు తగ్గించుకున్నారు. ఇక, టాటా స్టీల్‌, విసా స్టీల్‌, గ్లోబస్‌ పవర్‌, డీఎఫ్‌ఎం ఫుడ్స్‌, కిర్లోస్కర్‌ ఇండస్ట్రీస్‌, వోల్టాంప్‌ ట్రాన్స్‌ఫారమ్స్‌, క్యామ్‌సన్‌ బయో టెక్నాలజీస్‌ తదితర కంపెనీల్లో వీరి వాటాల్లో మార్పుల్లేవు. You may be interested

స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌తో జాగ్రత్త!

Tuesday 5th February 2019

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రభావం మార్కెట్లపై ఎక్కువే ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో... స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌, ప్రభుత్వం వల్ల సులభంగా ప్రభావానికి లోనయ్యే వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మాథ్యూస్‌ ఇండియా ఫండ్‌ కో మేనేజర్‌ పీయూష్‌ మిట్టల్‌ సూచించారు. శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఈ ఫండ్‌ నడుస్తోంది.    ‘‘భారత మార్కెట్లో ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నవి లార్జ్‌క్యాప్‌ స్టాక్సే. వీటి వ్యాల్యూషన్లు చారిత్రక సగటు స్థాయిల్లోనే ఉన్నాయి. భవిష్యత్తు వృద్ధిని ఇవి చేరుకోగలన్న

రెండో రోజూ టైటాన్‌ ర్యాలీ

Tuesday 5th February 2019

బ్రాండెడ్‌ బంగారు ఆభరణాలను విక్రయించే టైటాన్‌ కంపెనీ షేర్ల ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. గత ట్రేడింగ్‌లో 3.50శాతం ర్యాలీ చేసిన షేరు మంగళవారం మరో 4శాతం లాభపడింది.  క్యూ3లో కంపెనీ ఫలితాలు మార్కెట్‌ అంచనాల్ని మించడం, ప్రముఖ బ్రేకరేజ్‌ సంస్థలు షేరు రేటింగ్‌ పెంచడటం తదితర కారణాలతో షేరు క్రితం ట్రేడింగ్‌ 3.50శాతం లాభంతో రూ.1,025.75ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. నిన్న లాభాల్ని కొనసాగిస్తూ  నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.1,026.95ల

Most from this category