STOCKS

News


ఈ ఏడాది ఈక్విటీల్లోకి రూ. లక్ష కోట్ల ఎఫ్‌ఐఐ నిధులు!

Tuesday 12th March 2019
Markets_main1552378412.png-24550

ప్రముఖ ఇన్వెస్టర్‌ పొరింజు అంచనా
దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ ఈక్విటీ మార్కెట్‌పై ప్రముఖ ఇన్వెస్టర్‌ పొరింజు వెలియత్‌ పూర్తి ఆశావహ ధృక్పథంతో ఉన్నారు. దేశీయ మార్కెట్లో బుల్‌ రన్‌ ఇప్పుడే మొదలైందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ మరలా ఎన్నికవడం ఖాయమని అంచనా వేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఎకానమీలో రాజకీయాల ఆటకు చెక్‌ చెప్పిందని, జీఎస్‌టీ, దివాలా చట్టం లాంటివాటిని వెనక్కు తీసుకోలేమని వివరించారు. అందువల్ల ఈ సంస్కరణలు ఇష్టం ఉన్నా, లేకున్నా రాబోయే ప్రభుత్వాలు కొనసాగించక తప్పదన్నారు. ఇకపై ర్యాలీకి భారీ ఆశలు అవసరం లేదని, ప్రస్తుతం నెలకొన్న నిరాశాపూరిత మనస్థత్వం నుంచి బయటపడితే చాలని, అదే భారీ ర్యాలీకి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. దాదాపు ఏడాది పైచిలుకు కాలం తర్వాత మిడ్‌క్యాప్స్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి కనిపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం లార్జ్‌క్యాప్స్‌కు చిన్న స్టాకులకు మధ్యనున్న వాల్యూషన్‌ అంతరం ఎక్కువకాలం నిలవదన్నారు. ఇందుకు తగ్గట్లే గత నెల రోజులుగా ప్రధాన సూచీ కన్నా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు మంచి ర్యాలీ చూపుతున్నాయి. 
నిఫ్టీలో మరో 2వేల పాయింట్ల ర్యాలీ
వచ్చే ఏడాది, ఏడాదిన్నరలో నిఫ్టీ మరో 2,000 పాయింట్ల వరకు దూసుకుపోతుందని పొరింజు అంచనా వేశారు. నాణ్యమైన మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ ఈ వ్యవధిలో మంచి రాబడులు అందిస్తాయని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం మరో దఫా కొనసాగితే ఈక్విటీల్లో లాంగ్‌టర్మ్‌ బుల్‌ రన్‌ చూస్తామని చెప్పారు. నాణ్యమైన స్టాకులను ఎంచుకోవడంపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సంవత్సరం విదేశీ నిధుల రాక చాలా ఎక్కువగా ఉండొచ్చని, దాదాపు లక్ష కోట్ల రూపాయల ఎఫ్‌ఐఐలు ఇండియా మార్కెట్లోకి ప్రవహించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగి, సంస్కరణల రధం ఆగకుండా ఉంటే, ఇండియా మార్కెట్లో బేర్‌ మార్కెట్‌ అనే మాట కొన్నాళ్లపాటు వినిపించదన్నారు. భారత్‌లో ప్రస్తుతం అల్ప ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ఇండియా మార్కెట్లు ఎలా దూసుకుపోతాయో ఎవరికైనా అవగతమవుతుందని చెప్పారు. 



You may be interested

ఎన్నికల ముందుస్తు ర్యాలీకి ఛాన్స్‌..!

Tuesday 12th March 2019

- మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా - ఈవారంలోనే ఐఐపీ, సీపీఐ గణాంకాలు ముంబై: దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ ఆరోరా స్పష్టం చేశారు. మార్కెట్‌ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ముందుస్తు ర్యాలీకి అవకాశం మెండుగా ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌ (పీసీజీ, కాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ

తక్షణ మద్దతు 36,450 ..నిరోధం 36,950

Tuesday 12th March 2019

వడ్డీ రేట్ల పెంపునకు అమెరికా ఫెడ్‌ బ్రేకులు వేయడం, అమెరికా-చైనాల వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల అధ్యక్షులు త్వరలో సంతకాలు చేయవచ్చన్న వార్తలతో నెలల గరిష్టస్థాయికి చేరిన పలు ప్రపంచ ప్రధాన మార్కెట్లు గతవారం ద్వితీయార్థంలో ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న భయాలతో ర్యాలీకి బ్రేకులు వేశాయి. కానీ ఇదే సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడుల వేగాన్ని పెంచడంతో భారత్‌ మార్కెట్‌ నెలరోజుల గరిష్టస్థాయిలో ముగిసింది. లోక్‌సభ ఎన్నికలకు ఆదివారం ఎన్నికల

Most from this category