STOCKS

News


విదేశీ పెట్టుబడులు తిరిగొస్తాయి: ఆదిత్య బిర్లాసన్‌లైఫ్‌ ఏఎంసీ

Friday 11th January 2019
Markets_main1547145472.png-23512

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2018లో ప్రతికూలంగా ఉండడాన్ని చూశాం. డాలర్‌ బలంగా ఉండడం, అమెరికాలో రాబడులు పెరగడం దీనికి ప్రధాన కారణాలు. 2018లో భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిన ఎఫ్‌పీఐలు... ఈ ఏడాది తిరిగి పెట్టుబడులతో మన మార్కెట్లలోకి వస్తారని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ అంచనా వేస్తోంది. 2019లో వర్ధమాన మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ ఆగి, తిరిగి పెట్టుబడులు పెట్టే పరిస్థితి వస్తుందని పేర్కొంది. 

 

‘‘ప్రస్తుతం స్థూల ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యకరమైన బ్యాలన్స్‌ షీట్లు, సహేతుక విలువలు, వృద్ధి మెరుగుపడడంతో... భారత్‌తోపాటు ఇతర వర్ధమాన మార్కెట్లు సానుకూల రిస్క్‌ ఆధారిత రాబడులను ఆఫర్‌ చేస్తున్నాయి. ఫలితంగా 2018లో బయటకు వెళ్లిన ఎఫ్‌పీఐ పెట్టుబడులు తిరిగి రావడాన్ని చూడనున్నాం. దీనికి అదనంగా దేశీయంగా లిక్విడిటీ కలసి రానుంది. సిప్‌ పెట్టుబడులు ఇకముందూ స్థిరంగానే ఉంటాయి’’ అని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ మహేష్‌ పాటిల్‌ తెలిపారు. కార్పొరేట్‌ లాభదాయక కూడా మెరుగుపడుతుందని పాటిల్‌ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పటికీ... 2019-20లో నిఫ్టీ ఎర్నింగ్స్‌లో 24 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వ్యక్తం చేశారు. దేశీయ వినియోగం స్థిరంగా ఉంటుందన్నారు. ‘‘లార్జ్‌క్యాప్‌ నిఫ్టీ ఇండెక్స్‌ విలువ ఏడాది కాల ఎర్నింగ్స్‌ ఆధారంగా చూసినప్పుడు 17-18 రెట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. దీర్ఘకాలిక సగటు కంటే ఇది 10 శాతం ఎక్కువ. మెరుగైన ఫలితాల అంచనాల నేపథ్యంలో ఈ విలువలు సహేతుకమే. భవిష్యత్తు వృద్ధి మార్కెట్లను 2019లో నూతన గరిష్టాలకు నడిపిస్తుంది. అయితే, 2019లో మార్కెట్లు తక్కువ రాబడులు ఇస్తాయని అంచనా వేస్తున్నాం’’ అని పాటిల్‌ తెలిపారు. అధిక చమురు ధరలు, వాణిజ్య యుద్ధం, ఈ ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలు సవాళ్లుగా పేర్కొన్నారు. 



You may be interested

30 ఏళ్లకే వైద్య బీమా...: మెజారిటీ మనోగతం

Friday 11th January 2019

ఆరోగ్యకరమైన సమస్యలు భారతీయులకు నేడు సవాలుగా మారాయి. అనారోగ్యం బారిన పడితే భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. అందుకేనేమో మన దేశంలో 85 శాతం మంది 30 ఏళ్లకే వైద్య బీమాను తీసుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నారు. 62.8 శాతం మంది అయితే వైద్య బీమా ఉండడం తప్పనిసరి అని భావిస్తున్నారు. జీవోక్యూఐఐ-ఇండియా ఫిట్‌ 2019 నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. మన దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పట్ల

ఐదు రంగాలు... ఏడు షేర్లు

Thursday 10th January 2019

ఎలారా క్యాపిటల్‌ సిఫార్సులు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలు నిఫ్టీ ఎర్నింగ్స్‌లో 20 శాతం చక్రీయ వార్షిక వృద్ది ఉండొచ్చని ఎలారా క్యాపిటల్‌ రిసెర్చ్‌ హెడ్‌ రవిసుందర్‌ ముత్తుకృష్ణన్‌ చెప్పారు. ఇకమీదట ఎకానమీ బలపడుతుందన్నారు. దీర్ఘకాలిక ధృక్పథంలో పెట్టుబడులు పెట్టాలని, ప్రతి పతనంలో కొంత చొప్పున పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు. సంవత్సరకాలానికి మంచి జోరు చూపించే ఐదు రంగాలను, వాటిలో ఏడు స్టాకులను ఆయన సిఫార్సు చేశారు. 1. బ్యాంక్స్‌: రిటైల్‌,

Most from this category