STOCKS

News


భారతే బెస్ట్‌!

Tuesday 14th May 2019
Markets_main1557819588.png-25731

ట్రేడ్‌ టెన్షన్లను తప్పించుకోవాలంటే ఇండియానే శరణు
ఎఫ్‌ఐఐల అంచనా
ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూపులు
అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు ముదురుతున్న సమయాన పెట్టుబడులు సురక్షితంగా ఉండేందుకు భారత ఈక్విటీలే మంచివని ఎఫ్‌ఐఐలు భావిస్తున్నాయి. అయితే ఎన్నికలు పూర్తవుతున్నందున ఫలితాలను బట్టి ప్రణాళిక రచించుకోవాలని యోచిస్తున్నాయి. ఈ నెల్లో ఎఫ్‌ఐఐలు దేశీ ఈక్విటీల్లో దాదాపు 150 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. గత మూడు నెలల్లో విదేశీ మదుపరులు 1000 కోట్ల డాలర్లను ఇండియాలోకి మరలించాయి. దీంతో గత రెండు నెలలు ఈక్విటీలు మంచి ర్యాలీ చూపాయి. కానీ ఈ నెలారంభం నుంచి సూచీలు నేల చూపులు ఆరంభించాయి. నిఫ్టీ దాదాపు 5 శాతం పతనమైంది. ఎన్నికల ఫలితాలపై సందిగ్ధత, ట్రేడ్‌ టెన్షన్లు కలిసి సూచీలను కుంగదీశాయి. దీంతో కొన్ని ఎఫ్‌ఐఐలు సైతం అమ్మకాలకు దిగాయి. ట్రేడ్‌ టెన్షన్లు వర్ధమాన దేశాలను ఇక్కట్లలోకి నెడతాయన్న అంచనాలతో అన్ని వర్ధమాన మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు విక్రయాలు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే వర్ధమాన మార్కెట్ల సూచీలో 9 శాతం వాటా ఉన్న ఇండియాలో సైతం అమ్మకాలకు దిగాయని ఎన్‌ఎన్‌ఐపీ ఇన్వెస్ట్‌మెంట్‌ పేర్కొంది. ప్రపంచంలోని రెండు పెద్ద ఎకానమీల మధ్య ట్రేడ్‌ ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చన్న అంచనాలున్నాయి. అయితే సంవత్సరాంతానికి రెండు దేశాలు(యూఎస్‌, చైనా) ఒక ఒప్పందానికి రావచ్చని ఎక్కువమంది భావిస్తున్నారు. అయితే అంతకుముందు మూడో త్రైమాసిక సమయానికి చైనా దిగుమతి చేసే అన్నింటిపై ట్రంప్‌ సుంకాలు విధించవచ్చని అంచనా. 
ఎలక‌్షన్‌ టెన్షన్
మరోపక్క దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు వచ్చాయి. తొలుత ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ మరలా గెలుస్తుందని ఎక్కువమంది అంచనా వేశారు. కానీ చివరకు వచ్చేవరకు సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశాలున్నాయన్న వార్తలు పెరిగాయి. దీంతో మార్కెట్లలో భయం పెరిగింది. అందుకే ఎఫ్‌ఐఐలు సైతం ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇండియాపై ఓవర్‌వెయిట్‌గానే ఇప్పటికీ పలు ఎఫ్‌ఐఐలు ఉన్నాయి. వాణిజ్యయుద్ధం తీవ్ర రూపం దాలిస్తే తలదాచుకునేందుకు భారతే మంచి ప్రదేశమని ఎన్ఎన్‌ఐపీ హోల్డింగ్స్‌ తెలిపింది. దీర్ఘకాలిక ధృక్పథంతో చూస్తే భారత్‌ మంచి వృద్ధి సాధించే సత్తా ఉన్న ఎకానమీ అని విశ్లేషించింది. అయితే స్వల్పకాలానికి ఎన్నికల ఫలితాలు మార్కెట్‌ను ‍ప్రభావితం చేయగలవని ఎఫ్‌ఐఐలు భావిస్తున్నాయి. అందుకే ఈ ఫలితాలు వచ్చిన తర్వాత పెట్టుబడులతో కదలాలని భావిస్తున్నాయి. అంతర్జాతీయంగా వాణిజ్య టెన్షన్లు పెరగడం, మందగమన భయాలు పెరగడం ఆర్థిక వ్యవస్థలకు మంచిది కాదని, ఈ పరిస్థితులను ఎదుర్కొనే సత్తా మన ఎకానమీకి ఉందని దేశీయ నిపుణులు సైతం చెబుతున్నారు. ప్రస్తుతానికి మార్కెట్లో, ఎఫ్‌ఐఐల్లో సందిగ్థత నెలకొందని, ఫలితాల అనంతరం సరైన దిశా నిర్ధేశం జరుగుతుందని అనలిస్టులు భావిస్తున్నారు. You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం అప్‌

Tuesday 14th May 2019

మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ, ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాంక్‌ నిఫ్టీ స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతోంది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌(పీఎస్‌యూ) షేర్ల ర్యాలీ బ్యాంక్‌ నిప్టీ లాభాల ట్రేడింగ్‌కు కారణమవుతోంది. గత ట్రేడింగ్‌లో భారీ పతనమైన పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లలో నేడు రివకరీ బాట పట్టాయి.అలాగే నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం పీఎస్‌యూ బ్యాంక్‌లైన ఆంధ్రా బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంకు

ఎనిమిదేళ్ల కనిష్టానికి ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు

Tuesday 14th May 2019

- ఏప్రిల్‌ అమ్మకాల్లో 17% క్షీణత న్యూఢిల్లీ: గతనెల్లో దేశీ ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విక్రయాలు 2,47,541 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది (2018) ఇదేకాలానికి నమోదైన 2,98,504 యూనిట్లతో పోల్చితే 17 శాతం క్షీణత ఉన్నట్లు భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) తాజాగా విడుదలచేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఇది 2011 అక్టోబర్‌ నాటి కనిష్టస్థాయి కాగా, వరుసగా ఆరవ నెల్లోనూ అమ్మకాల్లో తగ్గుదలను నమోదుచేశాయి. మరోవైపు అన్ని ప్రధాన

Most from this category