STOCKS

News


బ్రోకరేజ్‌లు మెచ్చిన 5 షేర్లు

Thursday 15th November 2018
Markets_main1542272988.png-22050

విదేశీ ఇన్వెస్టర్లు గత త్రైమాసికంలో అధిక శాతంలో షేర్లను విక్రయించినప్పటికీ.. పలు షేర్లలో మాత్రం హోల్డింగ్స్‌ పెంచారు. పెరిగిన వీరి వాటాల ఆధారంగా 47 శాతం వరకు రాబడిని ఇవ్వగలిగిన 5 షేర్లను బ్రోకరేజ్‌ సంస్థలు సూచిస్తున్నాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2(జూలై-సెప్టెంబర్‌)కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. అంతకుముందు వరుసగా రెండు నెలల్లోనూ పాజిటీవ్‌గా కొనసాగిన వీరి నిధుల ప్రవాహం.. అమెరికా-చైనా మధ్య కొనసాగిన వాణిజ్య యుద్ధం, ముడిచమురు ధరల పెరుగుదల, డాలరుతో రూపాయి విలువ బలహీనపడడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో గత త్రైమాసికంలో తిరోగమన బాట పట్టింది. ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌లోని 123 షేర్లలో ఎఫ్‌ఐఐల అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఇదే సమయంలో వీరు ఈ సూచీలోని 93 షేర్లలో తమ హోల్డింగ్స్‌ను పెంచినట్లు వెల్లడైంది. ఎఫ్‌ఐఐలు తమ వాటాను గణనీయంగా తగ్గించుకున్న షేర్ల జాబితాలో వోడాఫోన్ ఐడియా తొలిస్థానంలో నిలిచింది. మొదటి త్రైమాసికంలో ఈ కంపెనీలో 26 శాతం వాటాను కలిగిఉన్న ఎఫ్‌ఐఐలు.. క్యూ2 ఏకంగా 13.65 శాతం వరకు వాటాను తగ్గించుకోవడం ద్వారా వీరి చేతుల్లో ఉన్న వాటా 12.35 శాతానికి తగ్గిపోయింది.

క్యూ2లో ఎఫ్‌ఐఐలు అత్యధికంగా విక్రయించిన షేర్లు

కంపెనీ పేరు క్యూ2లో ఎఫ్‌ఐఐ హోల్డింగ్‌ క్యూ1లో హోల్డింగ్‌ నికర మార్పు (శాతాల్లో)
బల్‌రాంపూర్ చీని మిల్ 13.55 18.46 -4.91
మన్‌పసంద్‌ బ్రూవరేజెస్‌ 9.42 13.35 -3.93
పీసీ జ్యువెలరీ 13.58 19.09 -5.51
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3.72 8.47 -4.75
వోడాఫోన్ ఐడియా 12.35 26.00 -13.65


ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌లోని 93 షేర్లలో ఎఫ్‌ఐఐలు వాటాలను పెంచుకోగా.. ఈ జాబితాలో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్ తొలి స్థానంలో ఉంది. క్యూ2లో వీరి హోల్డింగ్స్‌ ఒక్కసారిగా 10 శాతానికి మించి పెరిగాయి. 


క్యూ2 ఎఫ్‌ఐఐల టాప్‌ 5 హోల్డింగ్స్‌

కంపెనీ పేరు క్యూ2లో ఎఫ్‌ఐఐ హోల్డింగ్‌ క్యూ1లో హోల్డింగ్‌ నికర మార్పు (శాతాల్లో)
ఏయూ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్ 21 10.2 10.4
గ్రీవ్స్ కాటన్ 12 6.9 5.2
మహానగర్ గ్యాస్ 19 12.7 6.3
తేజాస్ నెట్‌వర్క్స్‌ 24 19.1 5.3
జెెన్సార్ టెక్నాలజీస్ 17 7.5 9.4


  బ్రోకింగ్‌ సంస్థలు మెచ్చిన షేర్లు

సంస్థ పేరు షేరుకు లభించిన రెకమండేషన్లు మొత్తం బై కాల్స్‌ రాబడి అంచనా (శాతాల్లో)
ఏయూ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్ 15 10 30.1
గ్రీవ్స్ కాటన్ 9 6 26.8
మహానగర్ గ్యాస్  22 18 24.5
తేజాస్ నెట్‌వర్క్స్‌ 6 6 47.1
జెెన్సార్ టెక్నాలజీస్ 11 8 19.9

 



You may be interested

మెటల్‌ షేర్ల మెరుపులు

Thursday 15th November 2018

మిడ్‌సెషన్‌ నుంచి పెరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌లో మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి. ఎన్‌ఎన్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతనిథ్యం వహిస్తున్న నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 1.50శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(3382.15)తో పోలిస్తే దాదాపు 1.25శాతం లాభంతో 3,424.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన మొత్తం 15 షేర్లలో 11 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 4 షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌

సెన్సెక్స్‌ @ 35,400

Thursday 15th November 2018

250 పాయింట్లు అప్ 10,640 వద్ద నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంది. ఫ్లాట్‌గా ప్రారంభమైన ఇండెక్స్‌లు తర్వాత పెరిగాయి. అటుపైన పడిపోయాయి. మళ్లీ ఇప్పుడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 1:40 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 253 పాయింట్ల లాభంతో 35,395 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 10,640 వద్ద ఉన్నాయి. ఇంట్రాడేలో బీఎస్‌ఈ 35,400 పాయింట్ల గరిష్ట స్థాయిని, 35,118 పాయింట్ల కనిష్ట స్థాయికి తాకింది.

Most from this category