STOCKS

News


రానున్న వారాల్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తీవ్రతరం

Wednesday 17th October 2018
Markets_main1539769147.png-21245

ఇండియన్‌ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రానున్న వారాల్లో నికరంగా చూస్తే విక్రయదారులుగా ఉంటారు తప్ప కొనుగోలుదారులుగా ఉండరని మార్నింగ్‌స్టార్‌ అడ్వైజర్స్‌ ఇండియా సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ హిమాంశు శ్రీవాత్సవ తెలిపారు. ఏవైనా ఊహించని మార్పులు చోటుచేసుకుంటే.. అప్పుడు పైన చెప్పినదానికి మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  
గత కొన్ని వారాలను గమనిస్తే ఎఫ్‌ఐఐలు ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌లో సెల్లింగ్‌ బటన్‌ను నొక్కినట్లు కనిపిస్తోందని హిమాంశు శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు ఎఫ్‌ఐఐలకు సానుకూలముగా లేవన్నారు. మన మార్కెట్లు వారిని ఆకర్షించలేకపోతున్నాయని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో నికరంగా 1.5 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారని తెలిపారు. ఇక అక్టోబర్‌లో కేవలం పది ట్రేడింగ్‌ సెషన్లలోనే 2.6 బిలియన్‌ డాలర్లను ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. ఏవైనా సానుకూల పరిస్థితులు తలెత్తితే తప్ప ఈ ట్రెండ్‌లో మార్పు వస్తుందని అనుకోవడం లేదన్నారు. సెప్టెంబర్‌ చివరి వారాల్లో ఎఫ్‌ఐఐలు ఎక్కువగా విక్రయించారని తెలిపారు. అమెరికా వడ్డీ రేట్ల పెంపు, క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి పతనం, కరెంట్‌ అకౌంట్‌ ఖాతా పరిస్థితి మెరుగుపడకపోవడం, ద్రవ్యలోటు లక్ష్యాలను కేంద్రం చేరుకుంటుందా? అనే అంశంపై ఆందోళనలు వంటివి ప్రతికూల అంశాలని వివరించారు. వీటివల్ల ఎఫ్‌ఐఐలు జాగ్రత్త పడుతున్నారని, అందువల్ల దేశం నుంచి ఆకర్షణీయమైన అవకాశాలున్న వైపు వెళ్తున్నారని తెలిపారు. అలాగే అమెరికా, చైనా మధ్య నడుస్తోన్న వాణిజ్య ఉద్రిక్తతలు కూడా ఇండియా వంటి వర్ధమాన మార్కెట్లకు మంచిది కాదని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎఫ్‌ఐఐల అమ్మకాలు మరింత పెరగొచ్చని అంచనా వేశారు. ఎన్నికల సీజన్‌ వస్తోందని, ఇలాంటప్పుడు సాధారణంగానే ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. అందువల్ల వచ్చే రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు పెరుగుతాయని తెలిపారు. ఎఫ్‌ఐఐలు రానున్న నెలల్లో నికరంగా చూస్తే విక్రయదారులుగానే ఉంటారని, కొనుగోలుదారులుగా ఉండరని పేర్కొన్నారు. 
ఇండియన్‌ మార్కెట్‌లోని డీఐఐలలో పరిణతి చెందిన ప్రవర్తనను గమనించొచ్చని హిమాంశు తెలిపారు. ‘ఇటీవల కాలంలో మార్కెట్లు బాగా కరెక‌్షన్‌కు గురయ్యాయి. దీన్ని దేశీ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశంగా భావిస్తున్నారు. మార్కెట్‌లోకి ప్రవేశించి స్టాక్స్‌ను కొనుగోలు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని గుర్తుచేశారు. డీఐఐలు దీర్ఘకాల లక్ష్యాలతో ఇన్వెస్ట్‌ చేస్తున్నారని తెలిపారు. ఎఫ్‌ఐఐలకు స్వల్పకాలిక లక్ష్యాలుంటాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు మంచి అవకాశాలు కనిపిస్తే ఇన్వెస్ట్‌ చేస్తారని, లేకపోతే ఎలాంటి సంకోచాలు లేకుండా వెళ్లిపోతారని తెలిపారు. You may be interested

అందుబాటు ధరలో ఆసస్‌ 2 కొత్త స్మార్ట్‌ఫోన్స్‌

Wednesday 17th October 2018

తైవాన్‌కు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘ఆసస్‌’ తాజాగా అందుబాటు ధరల్లో అదిరిపోయే ఫీచర్లతో రెండు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అవేంటో చూస్తే..  ఆసస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ఎం1 @ 7,499 కంపెనీ ‘జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ఎం1’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.8,999గా ఉంది. అయితే పండుగ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ.7,499కు లభ్యంకానుంది. విక్రయాలు ఎప్పటి నుంచి ఉంటాయో తెలియాల్సి ఉంది. ఫోన్‌లోని ప్రత్యేకతలను గమనిస్తే.. ♦ 5.45

హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్ల పతనం

Wednesday 17th October 2018

హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయాయి. ఈ రంగానికి చెందిన ఇండియా బుల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ షేర్లు 16శాతం నుంచి 12శాతం క్షీణించాయి. ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.911.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 16శాతం నష్టపోయి రూ.765.65ల కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:30నిలకు షేరు గతముగింపు ధర(రూ.907.35) పోలిస్తే 12శాతం నష్టంతో రూ.802ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఏడాది

Most from this category