STOCKS

News


ఎఫ్‌ఐఐలు కొన్న షేర్లలో 50% వరకు ర్యాలీ

Friday 30th November 2018
Markets_main1543567940.png-22526

ముంబై: గతకొద్దికాలంగా భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను క్రమంగా వెనక్కి తీసుకుంటూ నెట్‌ సెల్లర్లుగా నిలుస్తూ వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ)లు ఈనెలలో పంథా మార్చారు. వరుసగా ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మార్కెట్‌ నుంచి తమ సొమ్మును ఉపసంహరించుకున్న వీరు.. నవంబర్‌లో ఇప్పటివరకు  ఈక్విటీ, డెట్‌లో కలిపి రూ.10,000 కోట్లను కుమ్మరించారు. అంతకుముందు మూడు నెలల్లో రూ.60,000 కోట్లను వెనక్కుతీసుకున్న ఎఫ్‌ఐఐలు.. ఒక్కసారిగా పతనమైన ముడిచమురు ధరల కారణంగా మళ్లీ దేశీ మార్కెట్లలో తమ వాటాలను పెంచుకున్నారు. గడిచిన ఏడు వారాల్లో క్రూడ్‌ ధరలు 30 శాతం వరకు పడిపోయిన నేపథ్యంలో స్థూల ఆర్థిక అంశాలు అనుకూలంగా మారండం వల్ల ఎఫ్‌ఐఐలు తిరిగి భారత్‌ బాట పట్టారని ఐసీఐసీఐ డైరెక్ట్‌ డాట్‌ కామ్‌ రీసెర్చ్‌ హెడ్‌ పంకజ్ పాండే అ‍న్నారు. ఈనెలలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 4.6 శాతం బలపడడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మెతక వైఖరి వంటి సానుకూల వాతావరణంలో వీరి పెట్టుబడులు మళ్లీ ఊపందుకున్నాయని వివరించారు. ఈ కారణంగానే సెప్టెంబర్‌ 2018 నాటికి ఎఫ్‌ఐఐలు 10 శాతానికి మించి హోల్డ్‌ చేసిన షేర్లలో 50 శాతం వరకు ర్యాలీ నమోదైనట్లు తెలిపారు. ఇక ఈ ఏడాదిలో ఏ ఏ షేర్లలో ఎంత ర్యాలీ జరిగిందనే విషయానికి వస్తే.. ఎఫ్‌ఐఐల వద్ద ఉన్నటువంటి షేర్ల జాబితాలో అదానీ ట్రాన్స్‌మిషన్ 2018లో అత్యధికంగా 50 శాతం పెరిగింది. ఈ కంపెనీలో వీరికి 20.28 శాతం వాటా ఉంది. ఈ ఏడాదిలో పీఎన్‌బీ హౌసింగ్ (28 శాతం), పీసీ జ్యువెల్లర్ (24 శాతం), పిడిలైట్ ఇండస్ట్రీస్ (22 శాతం), బీపీసీఎల్ (21 శాతం), ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ (21 శాతం, ఫ్యూచర్ కన్స్యూమర్ (19 శాతం), వీఐపీ ఇండస్ట్రీస్ (18 శాతం), ఎన్‌సీసీ లిమిటెడ్‌ (17 శాతం), కజరియా సెరమిక్స్ (17శాతం), ఇప్కా ల్యాబ్స్‌ (17శాతం), ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ (16శాతం), కాపిటల్‌ ఫస్ట్‌ (16శాతం), కేఈఐ ఇండస్ట్రీస్‌ (15శాతం), అదానీ పోర్ట్స్‌ (15శాతం), శ్రీసిమెంట్‌ (15శాతం), మారుతీ సుజుకీ (15శాతం), జేఎం ఫైనాన్షియల్స్‌ (15శాతం), జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ (14శాతం), ఆల్ట్రాటెక్‌ (14శాతం), గాడ్‌ప్రే ఫిలిప్స్‌ ఇండియా  (14శాతం) లాభపడ్డాయి. 

తాజాగా నవంబర్‌లో మళ్లీ భారత బాట పట్టిన ఎఫ్‌ఐఐలు ఇకపై కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగించవచ్చని కొటక్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ షిబని కురియన్ అన్నారు. ఎమర్జింగ్‌ మార్కెట్లలో వీరి పెట్టుబడులు పెరగడం ఇందుకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. You may be interested

రెండంకెల రాబడినిచ్చే 2 స్టాక్స్‌

Friday 30th November 2018

ఐసీఐసీఐ డైరెక్ట్‌ టెక్నికల్‌ హెడ్‌ ధర్మేశ్‌ షా తాజాగా వచ్చే ఆరు నెలల కాలంలో రెండంకెల రాబడిని అందించే రెండు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒక సారి చూద్దాం..  ఏబీబీ ఏబీబీ షేరు ధర గత రెండేళ్లుగా ఓవరాల్‌గా చూస్తే అప్‌ట్రెండ్‌లో ఉంటూ వస్తోంది. రానున్న కాలంలో స్టాక్‌ ధర రూ.1,320- 1,330 వద్ద కన్సాలిడేట్‌ అవ్వొచ్చు. ఇక 50 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ దాదాపు రూ.1,316 స్థాయి వద్ద

నిఫ్టీకి ఇదే కీలక స్థాయి..

Friday 30th November 2018

 నిఫ్టీ నవంబర్‌ సిరీస్‌ను 10,100 స్థాయి వద్ద ప్రారంభించిందని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (డెరివేటివ్స్‌ రీసెర్చ్‌) సహజ్‌ అగర్వాల్‌ తెలిపారు. 10,004 కనిష్ట స్థాయిని తాకిన తర్వాత మళ్లీ పుంజుకుందని, ఇప్పుడు 10,800 మార్క్‌కు అటుఇటుగా ట్రేడవుతోందని పేర్కొన్నారు. సిరీస్‌ ప్రారంభంలో నిఫ్టీ లాభాల్లో ఉన్నా కూడా, మధ్యలో కన్సాలిడేషన్‌ చోటుచేసుకుందని, అటుపై మళ్లీ పెరుగుదల కనిపించిందని, ముగింపునకు వచ్చేసరికి దాదాపు 7 శాతం మేర ఎగసిందని వివరించారు.

Most from this category