STOCKS

News


అమ్మకాలు ఆగినా పతనం ఆగని షేర్లు..

Wednesday 21st November 2018
Markets_main1542788065.png-22264

న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ సూచీల ట్రెండ్‌లో మార్పువచ్చింది. అక్టోబర్‌ 26న 10,004 పాయింట్ల కనిష్టస్థాయిని నమోదుచేసిన నిఫ్టీ ఆ తరువాత క్రూడ్‌ ధరల పతనంతో 700 పాయింట్ల మేర రికవరీ సాధించింది. 15 సెషన్లలో 10,700 మార్కుకు చేరుకుంది. మార్కెట్‌ కుదుటపడిన కారణంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) తమ అమ్మకాల ఒత్తిడిని సైతం తగ్గించారు. డిపాజిటరీల డేటా ప్రకారం.. అక్టోబర్‌లో రూ.28,921 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.10,825 కోట్ల అమ్మకాలను జరిపిన ఎఫ్‌ఐఐలు ఈనెలలో ఇప్పటివరకు రూ.3,348 కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలుచేసి, నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. ఎఫ్‌ఐఐలు అమ్మకాలను ఆపేసినప్పటికీ, వీరికి ఇష్టమైన షేర్లలో మాత్రం పతనం ఆగలేదు. విదేశీ ఇన్వెస్టర్లు మెచ్చే షేర్ల జాబితాలోని 10 షేర్లను ఇందుకు ఉదాహరణగా తీసుకుంటే.. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్‌లో వీరికి ఐదింట ఒకవంతు వాటా ఉంది. ఈనెలలో ఎఫ్‌ఐఐలు ఇప్పటివరకు నికర కొనుగోలుదారులుగానే ఉన్నప్పటికీ ఈ షేరు ధరలో మాత్రం పతనం ఆగలేదు. అక్టోబర్‌ 26 నుంచి ఇప్పటివరకు ఈ షేరు ఏకంగా 21.71 శాతం పతనమైనట్లు ఏస్‌ఈక్విటీ డేటాబేస్‌ ద్వారా తెలుస్తోంది. ఎఫ్‌ఐఐల ట్రెండ్‌ మారినప్పటికీ ఈ షేరులో పతనం ఇంకా ఎందుకు కొనసాగుతుందంటే.. ఇందుకు ప్రధాన కారణం ఆ కంపెనీ ప్రకటించిన క్యూ2 ఫలితాలేనని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు చెబుతున్నారు. అంతకుముందు త్రైమాసికంతో పోల్చితే కంపెనీ నికర లాభం ఏకంగా 60 శాతం తగ్గడం వల్లనే షేరు ధరలో పతనం కొనసాగుతుందని వివరించారు. మార్జిన్లపై ఒత్తిడి ఉందనే అంశం ఇన్వెస్టర్లను అమ్మకాల బాట పట్టించిందని తేల్చారు. ఇక ఇదే విధంగా మిగిలిన అన్ని ఎఫ్‌ఐఐల జాబితాలోని షేర్లు నష్టపోతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు వెల్లడించారు. 

ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా)లో ఎఫ్‌పీఐలకు 32.9 శాతం వాటా ఉంది. క్యూ2 ఫలితాల్లో కంపెనీ లాభాలు కాస్త తగ్గి రూ.78 కోట్లుగా ఉన్నాయి. అయితే కంపెనీ సీఎస్‌ఆర్‌కు ఒకేమొత్తం కింద కేటాయించడం వల్ల ఎబిటిడా మార్జిన్లు ఏడాది ప్రాతిపదికన 830 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. అక్టోబర్‌ 26 నుంచి 14 శాతం పడిపోయిన ఈ కౌంటర్‌లో మళ్లీ పెరుగుదల లేదని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇక అమ్మకాలు 10.4 శాతం తగ్గిన కారణంగా పేజ్ ఇండస్ట్రీస్ షేరు 13 శాతం పతనమైంది. 2019-20 ఎర్నింగ్స్‌ అంచనాలో కోత విధించినట్లు ఎమ్కే గ్లోబల్‌ వెల్లడించింది. సిప్లా నికర లాభం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 11 శాతం తగ్గింది. ఈ షేరు రేటింగ్‌ను బై నుంచి హోల్డ్‌కు తగ్గించినట్లు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. అశోక్‌ లేలాండ్‌లో విదేశీ ఇన్వెస్టర్లకు 22.9 శాతం వాటా ఉంది. అక్టోబర్‌ 26న సీఈఓ, ఎండీ పదవి నుంచి వినోద్‌ దాసరి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో నేటికి షేరు ధర 5 శాతం పతనమైంది. 

కేర్‌ రేటింగ్స్‌లో ఎఫ్‌పీఐలకు 45.4 శాతం వాటా ఉంది. అక్టోబర్‌ 27 నుంచి ఈ షేరు 6 శాతం పడిపోయింది. ఈకాలంలో నిఫ్టీ 7 శాతం పెరిగిన విషయం తెలిసిందే. ఇక ఇదే విధంగా గ్రేట్ ఈస్ట్రన్ షిప్పింగ్ కంపెనీ, ఎంఫసిస్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ షేర్లు సైతం నిఫ్టీతో పాటు ర్యాలీ చేయలేకపోగా.. నష్టాల్లో ప్రయాణిస్తున్నాయి.You may be interested

ఎదురీదుతున్న పీఎస్‌యూ బ్యాంక్స్‌ షేర్లు

Wednesday 21st November 2018

ఫార్మా షేర్లతో పాటు ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల కూడా నష్టాల మార్కెట్‌కు ఎదురీదుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం పెరిగింది. ఇంట్రాడేలో డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్ల ర్యాలీ ప్రోత్సాహంతో నిఫ్టీ పార్మా ఇండెక్స్‌ కూడా 2శాతానికి పైగా ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నగం 1:15ని.లకు నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతం లాభంతో 2,968.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో

శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌పై బుల్లిష్‌

Wednesday 21st November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌ స్టాక్‌: శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.842 టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,537 కోటక్‌ సెక్యూరిటీస్‌.. శంకర్‌ బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,537గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత క్యూ2 రెవెన్యూ అంచనాల కన్నా దిగువునే ఉందని తెలిపింది. కేరళ, దక్షిణ కర్నాటక

Most from this category