STOCKS

News


బ్యాంక్‌ చీఫ్‌కు మార్జిన్‌ కాల్‌..

Friday 14th September 2018
Markets_main1536914685.png-20254

  • 2 లక్షల షేర్లు అమ్మేసిన ఫెడరల్‌ బ్యాంక్‌

ఫెడరల్‌బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అయిన శ్యామ్‌ శ్రీనివాసన్‌ షేర్లను ఫెడరల్‌ బ్యాంక్‌ విక్రయించింది. బ్యాంకులు షేర్లను తనఖా పెట్టుకొని రుణాలను అందిస్తుంటాయి. ఈ విధంగానే శ్యామ్‌ శ్రీనివాసన్‌ తన ఈసాప్స్‌ను ఫెడరల్‌ బ్యాంక్‌లో తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. షేర్ల విలువ తగ్గినప్పుడు సదురు బ్యాంక్‌.. కొంత మార్జిన్‌ చెల్లించాలని కోరుతుంది. మార్జిన్‌ చెల్లిస్తే ఈ స్టాక్స్‌ను అలాగే కొనసాగిస్తుంది. చెల్లించకపోతే షేర్లను విక్రయిస్తుంది. శ్యామ్‌ శ్రీనివాసన్‌ కూడా మార్జిన్‌ చెల్లించకపోవడంతో మార్జిన్‌ కాల్‌ కింద ఫెడరల్‌ బ్యాంక్‌ ఆ షేర్లను విక్రయించింది. మార్జిన్‌ కాల్‌ కింద విక్రయించిన షేర్లు 2 లక్షలు అని బ్యాంక్‌ రెగ్యులేటరీకి తెలియజేసింది. శ్రీనివాసన్‌ ఇటీవల కాలంలోనే బ్యాంక్‌ ఎంప్లాయి స్టాక్‌ ఆప్షన్‌ స్కీమ్‌ కింద 2018 జూలైలో 35.3 లక్షల షేర్లను కన్వర్ట్‌ చేసుకున్నారని ఫెడరల్‌ బ్యాంక్‌ తెలిపింది. దీని తర్వాత శ్యామ్‌ శ్రీనివాసన్‌కు ఫెడరల్‌ బ్యాంక్‌లో దాదాపు 84.1 లక్షల షేర్లు ఉన్నాయి. ఆయన 35.3 లక్షల షేర్లను కన్వర్ట్‌ చేసుకోవడానికి ముందుగా అంటే మార్చి 29న 2.5 లక్షల షేర్లను విక్రయించారు. ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు ధర పడిపోవడంతో మార్జిన్‌ కాల్‌ జరిగి ఉంటుంది. షేరు ధర గత నెల కాలంలో 14 శాతం, ఈ ఏడాది మొత్తంగా 30 శాతంమేర పతనమైంది. 

స్టాక్‌ పతనానికి కారణాలు..
యూబీఎస్‌: కేరళ వరదల వల్ల స్టాక్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఆ రాష్ట్రంలోని అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇదే. ఇది ఆ ప్రాంతంలో ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రిటైల్‌, అగ్రికల్చర్‌, ఎస్‌ఎంఈ రుణాలపై ఎక్కువ ప్రభావం పడొచ్చు. ఎర్నింగ్స్‌ అంచనాలను తగ్గించాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.115 నుంచి రూ.105కి కుదించాం. 
డాయిష్‌ బ్యాంక్‌: కేరళ వదరల ప్రభావం బ్యాంక్‌ఫై పరిమితంగానే ఉంటుందని డాయిష్‌ బ్యాంక్‌ తెలిపింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.115గా కొనసాగించింది. బై రేటింగ్‌ ఇచ్చింది. కాగా ఫెడరల్‌ బ్యాంక్‌లో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సహా అమన్సా హోల్డింగ్స్‌, ఈస్ట్‌ బ్రిడ్జ్‌ క్యాపిటల్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ వంటి సంస్థలు ఇన్వెస్ట్‌మెంట్లను కలిగి ఉన్నాయి. 



You may be interested

2020లో ఆర్థిక సంక్షోభం

Friday 14th September 2018

జేపీ మోర్గాన్‌ అంచనా దశాబ్ద కాలం కిందటి లెహ్‌మాన్‌ బ్రదర్స్‌ సంక్షోభం గుర్తుందా? అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు పేకమేడళ్ల కూలిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు కకావికలం అయ్యాయి. అలనాటి సంక్షోభ ఛాయలు మళ్లీ కనిపిస్తున్నాయని, అప్పటి పరిస్థితుల ఆధారంగా చూస్తే 2020లో మరోమారు ఆర్థిక సంక్షోభం రావొచ్చని అంచనా వేస్తోంది దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ జేపీ మోర్గాన్‌ చేజ్‌ అండ్‌ కో. ఇక్కడ మంచి విషయం ఏంటంటే.. గతంలో మాదిరిగా భయానక వాతావరణం

నాలుగునెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

Friday 14th September 2018

ముంబై:-  టోకు ధరల సూచీ(డబ్లూ‍్యపీఐ) ఆగస్ట్‌లో నాలుగునెలల కనిష్టానికి చేరుకుంది. ఆగస్ట్‌లో కూరగాయల ధరలు తగ్గడంతో పాటు, ఆహారోత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో టోకు ధరల సూచీ(డబ్లూ‍్యపీఐ) 4.53 శాతానికి తగ్గింది. అందుకు ముందు నెల జూలైలో ఇది 5.09 శాతంగా నమోదు కాగా, గతేడాది ఇదే ఆగస్ట్‌లో ఇది 3.24శాతంగా నమోదైంది.  కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల శుక్రవారం విడుదల చేసిన ఆగస్ట్‌ ద్రవ్యోల్బణ గణాంకాల వివరాలు -  

Most from this category