STOCKS

News


ఈ ఏడాది ఇక రేట్ల పెంపు వుండదు-ఫెడ్‌ సంకేతాలు

Thursday 21st March 2019
Markets_main1553145427.png-24722

వాషింగ్టన్‌:- అందరి అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఫెడ్‌ వడ్డీ రేట్లు  2.25  శాతం నుంచి 2.5 శాతంగా కొనసాగనున్నాయి. రెండు రోజుల సమావేశాల అనంతరం బుధవారం రాత్రి ఫెడరల్‌ రిజర్వు ద్రవ్య పరపతి నిర్ణయాలను ప్రకటించింది. అలాగే ఈ ఏడాది వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చని సంకేతాలతో పాటు అమెరికా వృద్ధి అంచనా, ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించింది. మరోవైపు తన బ్యాలెన్స్‌ షీట్‌ కోతను సెప్టెంబర్‌ నుంచి నిలిపివేయనున్నట్లు సంచలన నిర్ణయాన్ని ఫెడ్‌ ప్రకటించింది. బ్యాలెన్స్‌ షీట్‌ కోతను మే నెల నుంచే నెమ్మదింపచేయనున్నట్లు ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌ ప్రకటించారు. లేబర్‌ మార్కెట్‌ ఇప్పటికీ బలంగా ఉందనీ అయితే అమెరికాతో పాటు అంతర్జాతీయ ఆర్థికవృద్ధి మందగమనం, నిరుద్యోగిత, ద్రవోల్బణ ఒత్తిడులతో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు  పావెల్‌ తెలిపారు. వడ్డీరేట్లపై యధాతథ పాలసీ కట్టుబడి ఉన్నట్లు ఫెడ్‌ ప్రకటించిన తరువాత అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ ఏడాది కనిష్టానికి పతనమయ్యాయి. 

ఏమిటీ బ్యాలెన్స్‌ షీట్‌ తగ్గింపు

2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి ఫెడ్‌ ట్రిలియన్‌ డాలర్ల కొద్దీ నిధుల్ని కుమ్మరించింది. వడ్డీ రేట్లను జీరో చేసేసింది. ఈ అంశాల కారణంగా బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఇచ్చిన రుణాలు అధికమైపోయి, ఫెడ్‌ బ్యాలెన్స్‌ షీట్‌ పెరిగిపోయింది. అంటే ఫెడ్‌ ఇచ్చిన అప్పులు పెరిగిపోయాయన్నమాట. అటుతర్వాత ఆర్థిక వ్యవస్థ కుదుటపడటంతో వడ్డీ రేట్లను పెంచడంతో పాటు..బ్యాంకులకిచ్చిన రుణాల్ని ఫెడ్‌ నెలకు కొత్తమొత్తం చొప్పున వెనక్కు తీసుకుంటూ బ్యాలెన్స్‌ షీట్‌ను తగ్గించకుంటూ వస్తున్నది.  బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి ప్రస్తుతం నెలకు 30 బిలియన్‌ డాలర్ల చొప్పున ఫెడ్‌ వెనక్కు తీసుకుంటుండగా, ఈ మొత్తాన్ని మే నెల నుంచి 15 బిలియన్‌ డాలర్లకు తగ్గించి, సెప్టెంబర్‌ నుంచి నిధుల ఉపసంహరణను పూర్తిగా నిలిపివేయడం ఫెడ్‌ తాజా ప్రకటన సారాంశం.



You may be interested

11600 పాయింట్ల వద్ద కన్సాలిడేషన్‌!

Thursday 21st March 2019

నిఫ్టీ గతేడాది నవంబర్‌ తర్వాత వీక్లీ చార్టుల్లో బలమైన బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. ఈ వారం 11556 పాయింట్ల వరకు చేరింది. ఇదే ధోరణి మరింత కొనసాగవచ్చని నిపుణుల అంచనా. చార్టుల్లో హయ్యర్‌ లో ఫార్మేషన్‌ జరిగినంతవరకు ఇదే జోరు ఉంటుంది. నాలుగువారాల్లో నిఫ్టీ దాదాపు వెయ్యి పాయింట్లు పైకి ఎగిసింది. ప్రస్తుతం స్టోకాస్టిక్‌ ఇండికేటర్‌ ఓవర్‌బాట్‌లో ఉంది. అందువల్ల కొంత మేర వెనుకంజ ఉండొచ్చని అంచనా. ఈ వెనుకంజలో

నేడు మార్కెట్‌కు సెలవు

Thursday 21st March 2019

హోళి సందర్భంగా నేడు(గురువారం) స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ట్రేడింగ్‌ జరగదు. బాండ్స్‌, కరెన్సీ మార్కెట్లు కూడా పనిచేయవు. మార్కెట్‌ తిరిగి శుక్రవారం ప్రారంభం కానుంది. బుధవారం సెన్సెక్స్‌ 23 పాయింట్లు లాభపడి 38,386 వద్ద ముగిసింది. నిఫ్టీ 11 పాయింట్ల తగ్గుదలతో 11,521 వద్ద స్థిరపడింది. డాలర్‌ మారకంలో రూపాయి 13 పైసలు బలపడి 68.83 వద్ద ముగియగా, పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.36 వద్ద

Most from this category