STOCKS

News


వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియకు ఫెడ్‌ బ్రేక్‌

Thursday 31st January 2019
Markets_main1548916067.png-23919

ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించిన సంకేతాలు కన్పిస్తున్న దృష్ట్యా వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియకు బ్రేక్‌ వేస్తున్నట్లు అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించింది. ఫెడ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ...రెండు రోజుల పరపతి విధాన సమీక్ష అనంతరం బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేస్తూ ఈ ఏడాది కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబించబోమని, రేట్ల పెంపుపై సహనం వహిస్తామని అమెరికా కేంద్ర బ్యాంక్‌ తెలిపింది. ద్రవ్యోల్బణ ఒత్తిడులు నెమ్మదించడం కూడా ఈ నిర్ణయానికి కారణమని ఫెడ్‌ తెలిపింది. భవిష్యత్‌ వడ్డీ రేట్ల పెంపుదల ప్రపంచ ఆర్థికాభివృద్ధి, ద్రవ్యోల్బణ ఒత్తిడుల ఆధారంగా వుంటుందని ఫెడ్‌ వివరించింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఫెడ్‌ అందించిన ఉద్దీపన ప్యాకేజీని...అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న నేపథ్యంలో ఉపసంహరించుకునే దిశగా రెండున్నర సంవత్సరాల నుంచి ఫెడ్‌ క్రమేపీ వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. దాంతో 0-0.25 శాతంగా వున్న ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 2.25-2.50 శాతానికి చేరాయి. 



You may be interested

మార్కెట్‌ నిపుణుల ట్రేడింగ్‌ ఐడియాలు

Thursday 31st January 2019

స్వల్పకాలానికి ఇరువురు నిపుణులు మొత్తం నాలుగు ట్రేడింగ్‌ ఐడియాలను అందిస్తున్నారు. 1. మానస్‌జైస్వాల్‌: - ఆర్‌ఐఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1265. స్టాప్‌లాస్‌ రూ. 1200. - ఇన్ఫోసిస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 760. స్టాప్‌లాస్‌ రూ. 734. 2. కునాల్‌బత్రా: - శోభా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 500. స్టాప్‌లాస్‌ రూ. 467.  - బీఈఎంఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 860. స్టాప్‌లాస్‌ రూ. 795.

ఎయిర్‌టెల్‌ ఫలితాలు.. ఏం చూడాలి?

Thursday 31st January 2019

టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ నేడు క్యూ3 ఫలితాలు ప్రకటించనుంది. ఈ దఫా కంపెనీ నష్టాలు రూ. 500- 900 కోట్ల మధ్య ఉండొచ్చని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. రెవెన్యూ వృద్ధి ఒక్క శాతం ఉండొచ్చని, ఇందుకు ప్రధానంగా ఆఫ్రికా వ్యాపారమే కారణమని అంచనా వేస్తున్నాయి. దేశీయ వ్యాపారంలో కూడా కన్సాలిడేషన్‌ కనిపిస్తోందని తెలిపాయి. నికర ఆదాయంలో 15- 20 శాతం నష్టం ఉండొచ్చని అంచనా. కస్టమర్లు తగ్గడం ఫలితాలపై ప్రభావం

Most from this category