STOCKS

News


15నెలల గరిష్ఠాలకు వీఐఎక్స్‌ సూచీ

Monday 22nd April 2019
Markets_main1555920724.png-25269

మార్కెట్‌లో రిస్కుకు ప్రతిబింబంగా భావించే వీఐఎక్స్‌ సూచీ తాజాగా 15నెలల గరిష్ఠాలకు చేరింది. ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడడం, మార్కెట్లు గరిష్ఠస్థాయిల్లో కదలాడడంతో ఇన్వెస్టర్లు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీఐఎక్స్‌ పైపైకి పెరుగుతోంది. వీఐఎక్స్‌ పెరగడమంటే సాధారణంగా మార్కెట్లు త‍్వరలో కరెక‌్షన్‌ మూడ్‌లోకి వెళతాయనేందుకు సూచనగా భావిస్తారు. పుట్స్‌ ఎక్కువ కావడం, షార్ట్‌ బిల్డప్‌ జరగడం వంటివి వీఐఎక్స్‌ పెరిగే సమయంలో జరుగుతుంటాయి. లాంగ్స్‌కు హెడ్జింగ్‌ కోసం కూడా పుట్స్‌ తీసుకోవడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఇండియా వీఐఎక్స్‌ ఏప్రిల్‌ సీరిస్‌లో 36.6 శాతం పెరిగి 22.74కు చేరింది. సోమవారం మధ్యాహ్న సమయానికి 23.95 వద్ద కదలాడుతోంది. గతేడాది జనవరిలో వీఐఎక్స్‌ 42. 4 శాతానికి చేరింది. తర్వాత ఈ స్థాయికి రావడం ఇదే ప్రథమం. మే సీరిస్‌లో ఇది మరింత పెరిగే ఛాన్సులున్నాయని ఐఐఎఫ్‌ఎల్‌ అంచనా వేస్తోంది. త్వరలో వీఐఎక్స్‌ 28-30 వరకు చేరవచ్చని బ్రోకింగ్‌ సంస్థ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ ఎన్నికలు మే 19న ముగిసిపోతాయి, అదే రోజు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు, 23న నిజ ఫలితాలు వస్తాయి. అప్పటివరకు వీఐఎక్స్‌లో అప్‌ట్రెండ్‌ కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2014 మేలో వీఐఎక్స్‌ 39.3 వరకు చేరింది. కానీ ఈ సారి అంతరేంజ్‌కు వీఐఎక్స్‌ చేరకపోవచ్చని గరిష్ఠంగా 30 వరకు ఎగబాకవచ్చని ఏంజల్‌ బ్రోకింగ్‌ భావిస్తోంది. నిఫ్టీలో వీక్లీ ఆప్షన్లు ప్రవేశ పెట్టడం, ఎన్నికల్లో మోదీకి అవకాశాలు పెరగడం కారణంగా వీఐఎక్స్‌ 30ని దాటకపోవచ్చని తెలిపింది. వీక్లీ ఆప్షన్లు కారణంగా ఐవీ కదలికలు పరిమితంగా ఉన్నాయని, అందువల్ల వీఐఎక్స్‌ 30 స్థాయి వరకు మాత్రం పెరగవచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. 


VIX

You may be interested

దేశంలో పెరిగి పసిడి ధర

Monday 22nd April 2019

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 4నెలల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో పసిడి ధర లాభాల బాట పట్టింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనం పసిడికి మద్దతినిస్తుంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.176.00 ర్యాలీ చేసి రూ.31639.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 6నెలల గరిష్టస్థాయికి చేరిన నేపథ్యంలో ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 40పైసలు నీరసించి 69.75 వద్ద

మార్కెట్‌కు నచ్చని రిలయన్స్‌ త్రైమాసిక ఫలితాలు

Monday 22nd April 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోవడంతో ఈ కంపెనీ షేరు సోమవారం 3శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో 1.50శాతం నష్టంతో రూ.1364.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మార్కెట్‌ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరులో లాభాల స్వీకరణకు పూనుకున్నారు. షేరు 3శాతం నష్టపోయి రూ.1345.30ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. అధిక వెయిటేజీ కలిగిన ఈ షేరు 3శాతం పతనం

Most from this category