News


రూపాయి, మార్కెట్ల పతనం... ఏంటి కర్తవ్యం?

Wednesday 12th September 2018
Markets_main1536692084.png-20173

రూపాయి విలువ అంతకంతకూ దిగజారిపోతుండడం, దేశీయ స్టాక్‌ మార్కెట్లను కుదేలు చేస్తోంది. ఈ సమయంలో అంత రిస్క్‌ భరించలేని ఇన్వెస్టర్లు ఎఫ్‌ఎంసీజీ, డ్యూరబుల్స్‌, ఆటోమొబైల్‌, ఫైనాన్షియల్స్‌, రిటైల్‌ ప్రైవేటు బ్యాంకులను పరిశీలించొచ్చని ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్స్‌ బిజినెస్‌ హెడ్‌, సీఐవో ప్రతీక్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. తాము సైతం ఇన్వెస్ట్‌మెంట్‌లో సంప్రదాయవాదులమేనంటూ, పెట్టుబడుల విషయంలో ఈ రంగాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. 

 

రూపాయి స్థిరపడాలి
రూపాయి స్థిరపడిన తర్వాతే పరిస్థితులు కుదుటపడతాయని భావిస్తున్నట్టు ప్రతీక్‌ అగర్వాల్‌ తెలిపారు. ఓ వారం లేదా పది రోజుల పాటు కరెన్సీ స్థిరపడితే మార్కెట్లో తిరిగి విశ్వాసం నెలకొంటుందన్నారు. సూచీలు వేగంగా దిద్దుబాటుకు గురయ్యాయని చెప్పారు. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ మంచిగా పుంజుకుంటోందని వివరించారు. రెండో త్రైమాసిక ఫలితాలు జూన్‌ క్వార్టర్‌లో ఉన్నంత మెరుగ్గా ఉండవన్న ఆయన, కేరళ వరదలు, జీఎస్టీ తర్వాత గతేడాది ఇదే కాలంలో అధిక బేస్‌ ఉండడం ఇందుకు కారణాలుగా చెప్పారు. ఆర్థిక రంగం పుంజుకుంటుండడంతో కరెన్సీ స్థిరపడిన వెంటనే లార్జ్‌క్యాప్‌ సూచీలు వాటి స్థానానికి చేరుకుంటాయన్నారు. ‘‘వడ్డీ రేట్లను నియంత్రణ సంస్థ (ఆర్‌బీఐ) పెంచుతుందనే ఆందోళనలు ఉన్నాయి. ఆర్థిక రంగంలో బలంతో వడ్డీ రేట్లు పెరుగుతాయనే భావిస్తున్నాం. రూపాయిని నిలువరించేందుకు కూడా ఇది అవసరం కావచ్చు. ఎన్‌బీఎఫ్‌సీల్లో మెరుగైన స్థానంలో ఉన్నవి ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయవచ్చు’’ అని ప్రతీక్‌ అగర్వాల్‌ వివరించారు. 

 

మిడ్‌క్యాప్‌... జాగ్రత్త
మిడ్‌క్యాప్‌ విభాగం వైపు ప్రస్తుతానికి చూడాలనుకోవడం లేదని అగర్వాల్‌ చెప్పారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి నికర పెట్టుబడుల రాక తగ్గుతోందని, ముఖ్యంగా మిడ్‌క్యాప్‌ విభాగంలో పెట్టుబడుల రాక ప్రతికూలంగా మారితే స్టాక్స్‌ చాలా దెబ్బతింటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్స్‌, కన్జ్యూమర్స్‌... ఎఫ్‌ఎంసీజీ, డ్యూరబుల్స్‌, ఆటోమొబైల్‌, ఫైనాన్షియల్స్‌, రిటైల్‌ ప్రైవేటు రంగాల పట్ల తాము సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. రిటైల్‌, ఇన్సూరెన్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌తో కూడిన ఎన్‌బీఎఫ్‌సీలు కూడా ఇందులో ఉన్నాయన్నారు. సైక్లికల్స్‌ పట్ల సానుకూలత చూపారు. రూపాయి విలువ తగ్గిపోతుండడంతో, స్టీల్‌, అల్యూమినియం, జింక్‌ తయారీదారులకు లాభదాయకమన్నారు. ఈ విభాగం నుంచి మంచి ఫలితాలను ఆశించొచ్చని చెప్పారు. ఎగుమతి ఆధారిత కంపెనీల పట్ల కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలిపారు.You may be interested

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Wednesday 12th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 9:03 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 8 పాయింట్ల లాభంతో 11,329 పాయింట్ల వద్ద ఉంది. దీంతో నిప్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి.   ఆసియా మార్కెట్లు నష్టాల్లో.. ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌

ఈ రెండు స్టాక్స్‌పై ఫండ్స్‌లో ఎంతో ఆసక్తి

Wednesday 12th September 2018

మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు వేలాది స్టాక్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు ఎన్నో అంశాలను పరిశోధించి, అధ్యయనం చేసిన తర్వాత, వృద్ధి అవకాశాల ఆధారంగానే స్టాక్స్‌ ఎంపిక చేస్తుంటారు. మరి మ్యూచువల్‌ ఫండ్స్‌ ఓ రెండు స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ పట్ల ఎంతో నమ్మకం ప్రదర్శిస్తున్నాయంటే, ఆ కంపెనీల్లో వృద్ధి సామర్థ్యాలు దండిగా ఉన్నాయనే భావించాల్సి ఉంటుంది. అవి డిక్సన్‌ టెక్నాలజీస్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌. ఫండ్స్‌ మేనేజర్లు, బ్రోకరేజీలు

Most from this category