STOCKS

News


ఆల్‌టైమ్‌హైకి మారికో షేరు

Friday 13th July 2018
Markets_main1531477595.png-18285

కొబ్బరి ధర పతనంతో జోరు
శుక్రవారం ట్రేడింగ్‌లో మారికో కంపెనీ షేర్లు ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని తాకాయి. దేశీయ మార్కెట్లో కోప్రా(కొబ్బరి) ధర భారీగా పతనం కావడంతో కంపెనీ కౌంటర్లో కొనుగోళ్లు జరిగాయి. దీంతో ఇంట్రాడేలో షేరు 366.20 రూపాయల గరిష్ఠాన్ని తాకింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ షేరు సుమారు 20 శాతం మేర దూసుకుపోయింది. ప్యారాచూట్‌ బ్రాండ్‌నేమ్‌తో కొబ్బరినూనెను విక్రయిస్తున్న మారికోకు...కొబ్బరి ధర పతనంకావడం లబ్దిచేకూరుస్తుందనే అంచనాలతో ఈ షేరు ర్యాలీ జరిపింది. ఫిబ్రవరి నుంచి దేశీయ మార్కెట్లో కోప్రా ధరలు పతనమవుతూ వస్తున్నాయి. ఈ ఐదు నెలల్లో వీటి ధరలు దాదాపు 19 శాతం క్షీణించాయి. ప్రస్తుతం క్వింటాల్‌ కొబ్బరి దర రూ.11వేల వద్ద కదలాడుతోంది. ఫిబ్రవరిలో ఈ దర రూ. 13,500 ఉంది. కోప్రా ధర పతనం కావడం ఆరంభమయినప్పటి నుంచి మారికో షేరు లాభపడుతూవస్తోంది. దీంతో పలు బ్రోకరేజ్‌లు కంపెనీ రేటింగ్‌ను పెంచాయి. మారికో రేటింగ్‌ను క్రెడిట్‌ సూసీ న్యూట్రల్‌ నుంచి అవుట్‌పెర్ఫామ్‌కు అప్‌గ్రేడ్‌ చేస్తూ కంపెనీ గడ్డురోజులు ముగిసిపోయాయని పేర్కొంది. మారికోపై 41 మంది అనలిస్టుల్లో 20 మంది కొనొచ్చు రేటింగ్‌, 15 మంది హోల్డ్‌ రేటింగ్‌, ఆరుగురు అమ్మొచ్చు రేటింగ్‌ ఇచ్చారు. 



You may be interested

ఆల్కహాల్ బేవరేజెస్‌పై హెచ్‌డీఎఫ్‌సీ విశ్లేషణ

Friday 13th July 2018

దేశీయ ఆల్కహాల్ బేవరేజెస్‌ కంపెనీలపై పాజిటివ్‌గా  ఉన్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది. దక్షిణ రాష్ట్రాలు ఈ రంగ వృద్ధికి దోహపడుతున్నాయని, ముఖ్యంగా కర్ణాటక ఈ రంగ అమ్మకాలకు దోహదపడుతుందని వివరించింది. ఈ రంగంలోని కంపెనీలలో ఒకటైన యునైటెడ్‌ స్పిరిట్స్‌కు సెల్‌ రేటింగ్‌ ఇచ్చిన బ్రోకింగ్‌ సంస్థ.. రాడికోకు బై రేటింగ్‌ ఇచ్చింది.  కంపెనీ: యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ధర: రూ.607 (జులై 13, 2018) టార్గెట్‌ ధర: రూ.570 రెకమండేషన్‌: సెల్‌ 52 వారాల గరిష్ట,

మరో రెండేళ్లు ఐటీ రంగం జోరు

Friday 13th July 2018

ముంబై: ప్రస్తుతం మార్కెట్‌ చాలా ఆసక్తికర దశలో ఉన్నట్లు వ్యాఖ్యానించిన ఎడెల్వీస్‌ సెక్యూరిటీస్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ వికాస్‌ ఖేమానీ.. బ్రెడ్త్‌ పరంగా బలహీనంగా ఉన్నప్పటికీ, నూతన గరిష్టస్థాయిలను నమోదుచేసే అవకాశం కనిపిస్తుందన్నారు. మార్కెట్‌ రికార్డ్‌ ర్యాలీతో కొనసాగడానికి కేవలం 10-12 షేర్లు మాత్రమే కారణం తప్పించి ఇది పూర్తి మార్కెట్‌ ర్యాలీ కాదని వ్యాఖ్యానించారు. గడిచిన ఏడాదికాలంగా ఈ షేర్లతోనే నిఫ్టీ 800-900 పాయింట్ల వరకు లాభపడిందన్నారు. వీటిలోని పలు కంపెనీలు గతకొద్ది

Most from this category