News


వీఐఎక్స్‌ తగ్గడంతో మార్కెట్‌కు స్థిరత్వం

Saturday 23rd February 2019
Markets_main1550908199.png-24296

శుక్రవారం వొలటాలిటీ ఇండెక్స్‌ (వీఐఎక్స్‌) 3.74 శాతం తగ్గి 15.45 పాయింట్ల వద్దకు దిగిరావడంతో మార్కెట్‌కు స్థిరత్వం వస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌కు చెందిన టెక్నికల్‌ విశ్లేషకుడు చందన్‌ తపారియా అంటున్నారు. వీఐక్స్‌ 16కుపైన వుంటే మార్కెట్లో ఒడుదుడుకులు కొనసాగుతాయని, 16 దిగువన కొనుగోలు మద్దతు లభిస్తుందన్న భావన ట్రేడర్లలో వుంటుంది. ఇక నిఫ్టీ అప్‌ట్రెండ్‌ కొనసాగాలంటే 10,750పైన నిలవాల్సివుంటుందని, ఆ సందర్భంలో 10,820 పాయింట్లు, అటుతర్వాత 10,888 పాయింట్ల వరకూ రిలీఫ్‌ర్యాలీ కొనసాగే ఛాన్స్‌ వుంటుందని చందన్‌ వివరించారు. 10,750 దిగువకు తగ్గితే 10,680 వద్ద మద్దతు లభించవచ్చని ఆయన అంచనావేశారు. ఇక ఆప్షన్స్‌ బిల్డప్‌ విషయానికొస్తే 10,700, 10,400 స్ట్రయిక్స్‌ వద్ద అధిక పుట్‌ బిల్డప్, 10,900, 11,000 స్ట్రయిక్స్‌ వద్ద అధిక కాల్‌ బిల్డప్‌ వుందని, ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో నిఫ్టీ 10,650–10,929 రేంజ్‌లో కదలవచ్చన్న అంచనాల్ని ఆయన వెల్లడించారు. 
బ్యాంక్‌ నిఫ్టీపై అంచనాలు
శుక్రవారం బ్యాంక్‌ నిఫ్టీ 27,000 పాయింట్లపైన నిలదొక్కుకోలేకపోయిందని, 50 రోజుల మూవింగ్‌ ఏవరేజ్‌ సమీపంలో బ్యాంక్‌ నిఫ్టీ నిరోధాన్ని చవిచూస్తున్నట్లు ఆయన తెలిపారు. yð యిలీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్, వీక్లీ చార్టుల్లో ఇన్‌సైడ్‌ బార్‌ క్యాండిల్‌ను ఈ సూచి ఏర్పాటుచేసుకుందని, ఈ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ 27,850పైన నిలదొక్కుకుంటే 27,150, అటుతర్వాత 27,350 పాయింట్ల వరకూ పెరిగే అవకాశాలుంటాయని, 26,850 పాయింట్ల దిగువన 26,666, 26,500 పాయింట్ల వద్ద మద్దతులు వున్నాయని చందన్‌ వివరించారు. 
 



You may be interested

స్వల్పలాభంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 23rd February 2019

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి స్వల్ప లాభంతో 10,809.50 వద్ద  ముగిసింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10808.80 పాయింట్లతో పోలిస్తే కేవలం 0.75 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ దాదాపు ఫ్లాట్‌గా ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 5శాతం అప్‌:-  అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌ కంపెనీల ఏడీఆర్‌లు (అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్స్‌)

లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు

Saturday 23rd February 2019

అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సఫలవ్వచ్చనే అంచనాలు మరోసారి తెరపైకి రావడంతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. చైనాతో కీలకమైన వాణిజ్య చర్చలు సజావుగా సాగుతున్నాయి. చర్చలు అమెరికాకు మంచి ఫలితాన్ని ఇస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే చైనాపై  వాణిజ్యపరమైన కొత్త ఆంక్షలు విధింపు తుది గడువు వాయిదా పడవచ్చని ఆయన తెలిపారు.

Most from this category