STOCKS

News


లుపిన్‌ కొనుగోలుకు సరైన సమయం ఇదేనా?

Thursday 30th August 2018
news_main1535621870.png-19803

దేశీ మూడో అతిపెద్ద ఫార్మా కంపెనీ ‘లుపిన్‌’కు కాలం కలిసి రావడం లేదు. గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తోంది. తాజాగా నిఫ్టీ-50 క్లబ్‌ నుంచి బయటకు వెళ్లిపోవడానికి సిద్ధమయ్యింది. దీని కన్నా ముందు అరబిందో ఫార్మా నిఫ్టీ-50లో స్థానం కోల్పోయింది. 
లుపిన్‌ నిఫ్టీ-50లో స్థానం కోల్పవడం ఇన్వెస్టర్లకు రుచించే వార్త కాదు. ఇటీవల కాలంలో కంపెనీ పనితీరు ఆశాజకంగా లేకపోవడంతో ఇది తప్పడం లేదు. అయితే కంపెనీ ఎదుర్కొన్న చాలా సవాళ్లు సంబంధిత పరిశ్రమకి సంబంధించినవి. అమెరికా, జపాన్‌ మార్కెట్లలో తీవ్రమైన ధరల ఒత్తిడి, పలు కీలక ఉత్పత్తులకు ఆమోదం ఆలస్యం కావడం, యూఎస్‌ఎఫ్‌డీఏ రెండు ప్రధాన ప్లాంట్లపై అభ్యంతరాలు వ్యక్తంచేయడం, పోటీ పెరగడం వల్ల పలు ప్రతికూలతల వల్ల గత రెండేళ్ల కాలంలో లుపిన్‌ స్టాక్‌ 40 శాతంమేర పతనమైంది. 2012 సెప్టెంబర్‌లో నిఫ్టీ-50లోకి ఎంట్రీ దగ్గరి నుంచి చూస్తే లుపిన్‌ 50 శాతానికిపైగా పెరిగింది. 
కంపెనీ మేనేజ్‌మెంట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సమయంలో భవిష్యత్‌ వృద్ధిపై విశ్వాసం వ్యక్తంచేసింది. ఈ క్యూ1లో సరైన పనితీరు కనబర్చలేకపోయామని, అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో పనితీరు మెరుగుపడుతుందని తెలిపింది. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, స్పెషాలిటీ బిజినెస్‌ పునరుద్ధరణ వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. 
లుపిన్‌ తన ఆదాయంలో దాదాపు 10 శాతాన్ని ఆర్‌అండ్‌డీ కోసం కేటాయిస్తోంది. గోవా, ఇండోర్‌లోని ప్లాంట్లపై యూఎస్‌ఎఫ్‌డీఏ వ్యక్తీకరించిన అభ్యంతరాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు పరిష్కారమౌతాయని మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. కంపెనీ సమీప కాల అండర్‌పర్ఫార్మెన్స్‌.. దీర్ఘకాల ఇన్వెస్టర్లకు మంచి అవకాశంలాంటిదని మార్కెట్‌ నిపుణుల పేర్కొన్నారు. ఈ సమయంలో లుపిన్‌ స్టాక్స్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. ప్రస్తుతం ఈ స్టాక్‌ తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఎర్నింగ్స్‌ అంచనాలకు 29 రెట్లు వద్ద ట్రేడవుతోంది. సన్‌ ఫార్మా, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ వ్యాల్యుయేషన్స్‌ కన్నా తక్కువ వ్యాల్యుయేషన్స్‌తో ఉంది. 
నిఫ్టీ ఇండెక్స్‌లో స్థానం కోల్పోయిన తర్వాత ర్యాన్‌బాక్సీ ల్యాబ్స్‌, అరబిందో ఫార్మా వంటి స్టాక్స్‌ పనితీరు మెరుగుపడింది. ఈ కోణంలో చూస్తే లుపిన్‌లో కూడా ఇదే ట్రెండ్‌ ఉండొచ్చు.You may be interested

3 నుంచి భారత్‌-22లో ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌ కాంట్రాక్ట్స్‌ ప్రారంభం!!

Thursday 30th August 2018

స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ‘బీఎస్‌ఈ’ తాజాగా భారత్‌-22 ఇండెక్స్‌లో ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్టులను సెప్టెంబర్‌ 3 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం భారత్‌ –22 ఈటీఎఫ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఈటీఎఫ్‌లో ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్, ఎల్‌ అండ్‌ టీతో పాటు ప్రభుత్వ బ్యాంక్‌లు, ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి మొత్తంగా 22 సంస్థల షేర్లున్నాయి. ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఎస్‌బీఐ, బీపీసీఎల్, కోల్‌ ఇండియా, నాల్కో,

14 స్టాక్స్‌.. 50 శాతం ర్యాలీ..

Thursday 30th August 2018

నిఫ్టీ-50 ఇండెక్స్‌ తొలిసారి జనవరి 15న 10,700 మార్క్‌ను అధిగమించింది. కేంద్ర బడ్జెట్‌ తర్వాత ఇండెక్స్‌ స్పీడ్‌ పెరిగింది. ఆగస్ట్‌ 27న 11,700 మార్క్‌ను తాకింది. అంటే ఏడు నెలల కాలంలో నిఫ్టీ-50 1000 పాయింట్ల మేర పెరిగింది. మరోవైపు జనవరి 15 నుంచి ఆగస్ట్‌ 24 మధ్యకాలంలో ఎన్‌ఎస్‌ఈ-500లోని దాదాపు 14 స్టాక్స్‌ ఏకంగా 50 శాతానికిపైగా ర్యాలీ చేశాయి. ఇందులో ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, మెర్క్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌,

Most from this category