News


వచ్చే ఆరు నెలలు మార్కెట్లపై ప్రభావం చూపించేవి ఇవే!

Sunday 30th September 2018
Markets_main1538303560.png-20720


దేశీయ, అంతర్జాతీయ అంశాలు ఎన్నో స్టాక్‌ మార్కెట్లను నష్టాల పాల్జేస్తుండడాన్ని చూస్తున్నాం. మార్కెట్లలో కొత్తగా లిక్విడిటీ సమస్య వచ్చినట్టు ఆందోళన కూడా నష్టాలకు మరింత ఆజ్యం పోసింది. మరి ఈ కాలంలో మీ దగ్గరున్న పోర్ట్‌ఫోలియోను భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే ఆరు నెలల కాలంలో మన మార్కెట్లపై ప్రభావం చూపించే అంశాలు గురించి తెలుసుకుంటే, ఆ తర్వాత ఓ నిర్ణయానికి రావచ్చు.

రూపాయి
ఈ ఏడాది రూపాయి డాలర్‌ మారకంలో 13 శాతానికి పైగా నష్టపోయింది. ఆసియాలో దారుణ పనితీరు చూపించింది. రూపాయి విలువ తగ్గడం అన్నది ఎగుమతులకు ఊతమిచ్చే అంశమే. ఎందుకంటే ఎగుమతి చేసే వాటికి చెల్లింపులు డాలర్లలోనే జరుగుతుంటాయి. అయితే మొత్తం మీద దేశీయ కరెన్సీ విలువ తగ్గడం అన్నది ధరలను పెంచింది. ఉన్నట్టుండి స్థూల ఆర్థిక అంశాలపైనా ఒత్తిడి మొదలైంది. మార్కెట్లపై సెంటిమెంటల్‌గా ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. 

చమురు
చమురు ధరలు బ్యారెల్‌కు 80డాలర్లను అధిగమించేశాయి. మన దేశం ఎక్కువ భాగం చమురు అవసరాలను దిగుమతుల ఆధారంగానే తీర్చుకుంటోంది. దీంతో మనపై లోటు భారం పెరిగిపోతోంది. సరఫరాను పెంచేందుకు ఓపెక్‌ నిరాకరించడం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలకు దిగడంతో ధరలపై ఒత్తిడి మొదలైంది. ఆయిల్‌ 100 డాలర్లకు వెళుతుందున్న అంచనాలు ఉన్నాయి.

ఎన్నికలు
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడం స్టాక్‌ మార్కెట్లపై ఎక్కువగా ప్రభావం చూపించే అంశమే. అలాగే, కొన్ని రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరిలోగా అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఎవరు గెలుస్తారన్నది ఎవరూ చెప్పలేరు. ఫలితం ఏదైనా అది మార్కెట్లపై ఏదో ఒక విధంగా ప్రభావం చూపించగలదు. 

ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు
వినియోగదారుని కొనుగోలు శక్తిని నిర్ణయించే అంశాలు ఇవి. ఆహారోత్పత్తుల ధరలు తగ్గడంతో రిటైల్‌, హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో స్టాక్స్‌ మార్కెట్లు ఈ అంశాలను కచ్చితంగా గమనంలోకి తీసుకుంటాయి. ఆర్‌బీఐ గతంలో రెండు సార్లు బెంచ్‌ మార్క్‌ రేట్లను పెంచింది. అక్టోబర్‌లో జరిగే ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు మార్కెట్‌ దిశను కచ్చితంగా నిర్ణయించగలవు. 

ట్రేడ్‌ వార్‌
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కమోడిటీ రంగంలోని స్టాక్స్‌ను ప్రభావితం చేస్తాయి. అయితే, మన దేశం ఎగుమతులను పెంచుకోవడం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఎగుమతి ఆధారిత స్టాక్స్‌కు ఇది అనుకూలమే. 

స్థూల అంశాలు
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అన్న హోదాను మన దేశం నిలబెట్టుకోగలిగింది. కానీ, కరెంటు ఖాతా లోటు పెరిగిపోతోంది. అలాగే, ద్రవ్యలోటు పెరుగుదలపైనా ఆందోళన నెలకొంది. ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నా, తాజా పరిస్థితులతో సందేహాలు నెలకొన్నాయి.

కంపెనీల ఆదాయాలు
ఆర్థిక రంగం పురోగతి చెందితే, కంపెనీలు తిరిగి తమ కొనుగోలు సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి. కమోడిటీ ధరలు తేలికపడడం  కంపెనీల లాభదాయకతను పెంచుతుంది. అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ ఆర్థిక సంవత్సరం మిగిలి ఉన్న కాలంలో కంపెనీల ఆదాయాలు మెరుగుపడతాయని నిపుణుల అంచనా. రుణ సమీకరణ వ్యయాలు పెద్ద అంశం అవుతుంది. 

అమెరికా వృద్ధి
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తాజాగా పెంచింది. ట్రెజరీ ఈల్డ్‌ అధికంగా ఉంటే, రిస్కీ సాధనాలైన వర్ధమాన మార్కెట్ల నుంచి నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. ఈ ఏడాది మరో సారి పెంపునకు అవకాశం, వచ్చే ఏడాది మూడు పెంపులు ఉంటాయని ఫెడ్‌ ప్రకటించింది.

ఎఫ్‌ఐఐల నిధులు
చిన్న ప్రతికూల సంకేతాలు వచ్చినా విదేశీ నిధులు తరలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే అమెరికాలో పెరిగిన బాండ్‌ ఈల్డ్స్‌తో భారత క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి నిధులను తరలించుకుపోతున్న విషయం తెలిసిందే.You may be interested

దీర్ఘకాలానికి మూడు స్టాక్స్‌

Sunday 30th September 2018

సెప్టెంబర్‌ మాసం స్టాక్‌ మార్కెట్లను నష్టాల్లో నడిపించింది. నిఫ్టీ 12,000 దాటేస్తుందన్న అంచనాలతో కొందరు అనలిస్టులు, ఇన్వెస్టర్లు ఉండగా, మార్కెట్లు ఉన్నట్టుండి రివర్స్‌గేర్‌ పట్టాయి.  కేవలం ఒక్క నెలలోనే ఇన్వెస్టర్లు రూ.15 లక్షల కోట్ల పెట్టుబడుల విలువను కోల్పోయారు. నిఫ్టీ 7 శాతం పడిపోయింది. ఈ ఏడాది జనవరి గరిష్టాల నుంచి చూస్తే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 19.5 శాతం, స్మాల్‌క్యాప్‌ 28.5 శాతం నష్టపోయాయి. చాలా స్టాక్స్‌ వాటి సరసమైన

ఇన్ఫీబీమ్‌ షేరును ఏం చేద్దాం?

Saturday 29th September 2018

దూరంగా ఉండమంటున్న నిపుణులు ఒక్కరోజులో 70 శాతం పతనమయిన ఇన్ఫీబీమ్‌ షేరుతో దాదాపు 9200 కోట్ల రూపాయల మదుపరుల సొత్తు ఆవిరైంది. వాట్సప్‌లో సర్క్యులేట్‌ అయిన ఒక మెసేజ్‌ కారణంగా షేరు కుప్పకూలినట్లు తెలుస్తోంది. తమ మూలాలు బలంగానే ఉన్నాయని మేనేజ్‌మెంట్‌ భరోసా ఇచ్చినా షేరు కోలుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇన్ఫీబీమ్‌ షేరు ఉన్న షేరు హోల్డర్లు కాస్త పెరిగినా బయటపడిపోవడం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు. కొత్తగా ఈ

Most from this category