News


నిఫ్టీకి 10,700 స్థాయి వద్ద నిరోధం

Thursday 22nd November 2018
Markets_main1542870328.png-22304

నిఫ్టీ వరుసగా రెండు సెషన్లలోనూ నష్టాల్లోనే ముగిసిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రూపక్‌ తెలిపారు. ఇండెక్స్‌ ఇటీవలి కదలికలను గమనిస్తే.. 200 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ను అధిగమించిందని పేర్కొన్నారు. అలాగే 11,760 నుంచి 10,004 స్థాయికి పతనమైన తర్వాత 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి పైకి వచ్చేసిందని తెలిపారు. అయితే 10,004 స్థాయి నుంచి దాదాపు 8 శాతం వరకు పెరిగిన తర్వాత బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ అలసిపోయినట్లు కనిపించిందని పేర్కొన్నారు. తాజా కరెక‌్షన్‌లో మళ్లీ 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి దిగువకు, 200 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ కిందకు పడిపోయిందని తెలిపారు.
నిఫ్టీని నిశితంగా గమనిస్తే బ్రాడెనింగ్‌ వెడ్జ్‌తో కదలాడుతోందని రూపక్‌ తెలిపారు. ప్రస్తుతం ఇది ఈ వెడ్జ్‌కు మధ్యలో ఉందన్నారు. అలాగే నిఫ్టీ చార్ట్‌లో కనిపిస్తున్న 21 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ అండ్‌ 50 రోజులు ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ బేరిష్‌ క్రాసోవర్‌.. బుల్లిష్‌ ట్రెండ్‌ క్షీణిస్తున్న సంకేతానిస్తోందని పేర్కొన్నారు. 
ఆప్షన్ల విషయానికి వస్తే.. 10,700 వద్ద అత్యధిక ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ ఉందని రూపక్‌ తెలిపారు. దీన్ని ఆధారంగా చూస్తే బుల్స్‌ నిఫ్టీని 10,700 మార్క్‌ పైకి తీసుకెళ్లడం చాలా కష్టతరమని పేర్కొన్నారు. అలాగే మరోవైపు 10,500 స్థాయి వద్ద గట్టి మద్దతు లభిస్తోందని తెలిపారు. ఈ స్థాయిలో కూడా అత్యధిక ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ కనిపిస్తోందని పేర్కొన్నారు. అంటే ఈ స్థాయి దిగువకు నిఫ్టీ పడిపోవడం కూడా కష్టతరమేనని తెలిపారు.  
రానున్న కాలంలో ఇండెక్స్‌ దాదాపుగా 10,500- 10,700 శ్రేణిలో కన్సాలిడేట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రూపక్‌ పేర్కొన్నారు. ఈ శ్రేణిని చేధిస్తే అప్పుడు ఇండెక్స్‌లో బలమైన కదలికలు ఉండొచ్చని అంచనా వేశారు. 10,510- 10,475 జోన్‌లో మద్దతు లభిస్తోందన్నారు. నిఫ్టీ ఈ జోన్‌ కిందకు పడిపోతే 10,350 వరకు క్షీణించొచ్చని తెలిపారు. మరోవైపు ఇండెక్స్‌ 10,700 పైకి వెలితే కొత్త అప్‌ట్రెండ్‌ కనిపించొచ్చని పేర్కొన్నారు.  



You may be interested

టెక్‌ మహీంద్రాకు రేటింగ్‌ బూస్ట్‌

Thursday 22nd November 2018

గ్లోబల్‌ బ్రేకరేజ్‌ హౌసింగ్‌ సంస్థల రేటింగ్‌ పెంపుతో టెక్‌ మహీంద్రా షేరు గురువారం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో టెక్‌మహీంద్రా షేరు రూ.696.00ల వద్ద ప్రారంభమైంది. టెక్‌ మహీంద్రా కంపెనీ ఆర్థిక స్థితిగతులపై సమగ్ర నివేదికను సమర్పించాలని విశ్లేషకులను కోరింది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలైన జెఫ్పారీస్‌, క్రిడెట్‌ స్యూస్‌, మోర్గాన్‌ స్టాన్లీ షేరు రేటింగ్‌ను సవరించడంతో టార్గెట్‌ ధరను పెంచాయి. బ్రేకరేజ్‌ హౌసింగ్‌ సంస్థల రేటింగ్‌ పెంపుతో ఇన్వెస్టర్లు ఈ

రెండు వారాల గరిష్టానికి పసిడి

Thursday 22nd November 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం రెండు వారాల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఇటలీ బడ్జెట్‌ సంక్షోభానికి తెరపడుతుందనే అంచనాలతో యూరో బలపడటం, ప్రపంచమార్కెట్లు తిరిగి లాభాల బాట పట్టడంలాంటి అంశాలు డాలర్‌కు ప్రతికూలంగా మారాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపుపై సందిగ్ధత కూడా డాలర్‌పై ప్రభావాన్ని చూపుంది. డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో నష్టాలతో 96.712 వద్ద ముగిసింది. డాలర్‌

Most from this category