STOCKS

News


అర్ధరాత్రి వరకూ ట్రేడింగ్‌కు రెడీ

Thursday 9th August 2018
Markets_main1533793399.png-19092

ముంబై: ట్రేడింగ్‌ వేళలను అర్ధరాత్రి వరకూ పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని నేషనల్‌ స్టాక్‌ ఎక్సే‍్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సీఈఓ విక్రమ్‌ లిమాయే స్పష్టంచేశారు. సెబీ ఆదేశాలకు అనుగుణంగా ప్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) విభాగంలో ట్రేడింగ్‌ను అక్టోబర్‌ 1 నుంచి రాత్రి 11.15 వరకూ పొడిగించేందుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎన్‌ఎస్‌ఈ కార్యకలాపాలు మొదలై 25 ఏళ్లు అయిన సందర్బంగా బుధవారం ఇక్కడ జరిగిన రజతోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ‘ప్రస్తుతం ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ ట్రేడింగ్‌ జరుగుతోంది. క్యాష్‌ మార్కెట్‌ ముగిసిన కొంత వ్యవధి తర్వాత రెండో సెషన్‌ సాయంత్రం 5 నుంచి ప్రారంభమై రాత్రి 11.15కు ముగుస్తుంది. అయితే, ఈ సెషన్‌లో డెరివేటివ్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) ట్రేడింగ్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది’ అని లిమాయే పేర్కొన్నారు.
ఐపీఓ ఎప్పుడంటే... 
ఎన్‌ఎన్‌ఈ కో-లొకేషన్‌ సెర్వర్లకు సంబంధించి వివాదంపై మాట్లాడుతూ... దీనిపై ఇప్పటికే తమ అంతర్గత దర్యాప్తును పూర్తి చేశామని.. దీనికి తగిన పరిష్కారం కోసం సెబీతో తాజాగా మళ్లీ సంప్రతింపులు జరుపుతున్నామని తెలియజేశారు. కన్సెంట్‌ విధానంలో (నేరాన్ని అంగీకరించడం లేదా నిరాకరించడంతో సబంధం లేకుండా జరిమానా రూపంలో కొంత చార్జీలను చెల్లించడం) దీన్ని పరిష్కరించుకుంటామని చెప్పారు.  ‘ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ (దాదాపు రూ.10,000 కోట్లుగా అంచనా) ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే కో-లొకేషన్‌ సమస్యతో ఇది ముడిపడి ఉంది. ఈ వివాదానికి పరిష్కారం ఎంత త్వరగా లభిస్తుందో అంత త్వరగా ఐపీఓ పూర్తవుతుంది’ అని లిమాయే వివరించారు. ఇక కమోడిటీ కాంట్రాక్టుల్లో ట్రేడింగ్‌ను కూడా అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభించేందుకు సిద్ధమేనని చెప్పారు. ‘దీనికి మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అధికారికంగా అనుమతులు రావాల్సి ఉంది. ముందుగా బులియన్‌ (బంగారం, వెండి), ఇంధనం, మెటల్‌ వంటి వ్యవసాయేతర ఉత్పత్తులతో కమోడిటీ ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాం’ అని వెల్లడించారు. భారత్‌ స్టాక్‌ మార్కెట్లో రిటైల్‌ ఇన్వెస్టర్లతో పాటు సంస్థాగత ఇన్వెస్టర్ల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని లిమాయే పేర్కొన్నారు.
ఈక్విడీ, డెట్‌పై మరింత దృష్టి: చావ్లా
వ్యాపార విస్తరణలో భాగంగా ఈక్విటీ, డెట్‌, వడ్డీరేట్లు ఫ్యూచర్స్‌ విభాగాలపై మరింత దృష్టి పెడతామని ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌ అశోక్‌ చావ్లా పేర్కొన్నారు.  అదేవిధంగా కంపెనీల నిధుల సమీకరణ వ్యయాలను కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. కమోడిటీ ఫ్యూచర్స్‌లోకి ప్రవేశంతో ఎక్సే‍్ఛంజ్‌ టర్నోవర్‌ ఇంకాస్త జోరుందుకుంటుందని చావ్లా తెలిపారు.
 
మరిన్ని శిఖరాలను చేరాలి...: మన్మోహన్‌
సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1994లో దేశంలో రెండో ప్రధాన స్టాక్‌ ఎక్సే‍్ఛంజ్‌గా ఆవిర్భవించి అనతి కాలంలో టర్నోవర్‌ పరంగా నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకిన ఎన్‌ఎస్‌ఈ.. ఇంకా మరెన్నో విజయ శిఖరాలను అధిరోహించాల్సి ఉందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆకాంక్షించారు. అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఎన్‌సీఈ కార్యకలాపాలను ప్రారంభించింది మన్మోహన్‌ సింగ్‌ కావడం గమనార్హం. ‘1994లో దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై ఎవరికీ అంతగా విశ్వాసం లేదు. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ రంగంలో అనేక అడ్డంకులు నెలకొన్న రోజులవి. అయితే, అవన్నీ తప్పని దేశ భవిష్యత్తుకు ఢోకాలేదని మనం నిరూపించగలిగాం’ అని ఎన్‌ఎస్‌ఈ రజతోత్సవ కార్యక్రమంలో మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు. 1991లో ప్రవేశపెట్టిన కీలక ఆర్థిక సంస్కరణలకు తదుపరి మరిన్ని జతకావడంతో ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించగలిగిందన్నారు. మార్కెట్‌ వృద్ధితో పాటు దేశ ఆర్థికాభివృద్ధి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత్‌ను మరింతగా సమ్మిళితం చేసే దిశగా ఎన్‌ఎస్‌ఈ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని మన్మోహన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉన్నా.. అనుకోని కారణాలతో రాలేకపోయారు. ఆయన సందేశాన్ని చదవి వినిపించారు.

ఎన్‌ఎస్‌ఈ కొత్త  లోగో

ఎన్‌ఎస్‌ఈ ఆరంభమై పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా కొత్త లోగోను ఎన్‌ఎస్‌ఈ అందుబాటులోకి తెచ్చింది. చతురస్రాకారంగా ఉన్న పాత లోగోను వృత్తాకారంగా మార్చింది. మ్యారోగోల్డ్‌, పసుపు, ఎరుపు, నీలం రంగులతో కూడిన ఈ కొత్త లోగోను మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆవిష్కరించారు. సమగ్రత, సమర్థత, విశ్వాసం, అంకిత భావాలకు ఇవి చిహ్నాలని ఎన్‌ఎస్‌ఈ వివరించింది. 



You may be interested

చత్తీస్‌ఘడ్‌కు పల్సస్‌ విస్తరణ

Thursday 9th August 2018

 హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌ కంపెనీ పల్సస్‌ తాజాగా చత్తీస్‌ఘడ్‌కు విస్తరించింది. చత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ రమణ్‌సింగ్‌తో పల్సస్‌ సీఈఓ డాక్టర్‌ గేదెల శ్రీనుబాబు భేటి అయిన సందర్భంగా ఈ విషయమై ఇరువురి మధ్యా ఒక అంగీకారం కుదిరినట్లు పల్సస్‌ తెలియజేసింది. వచ్చే ఏడాది కాలంలో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్... పల్సస్, ఒమిక్స్‌ సారథ్యంలో దంతేవాడ, రాజ్‌నందగావ్, రాయ్‌పూర్‌లో రానున్న సెజ్‌లలోని 3 కేంద్రాల్లో 2 వేల మందికి

జీఎస్‌టీని సరళతరం చేయండి

Thursday 9th August 2018

వాషింగ్టన్: సంక్లిష్టమైన జీఎస్‌టీ రేట్లను పాటించడంలోనూ, అమలు చేయడంలోనూ వ్యయాల భారం భారీగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) రేట్లను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని.. రెండు రేట్ల విధానంతో అధిక ప్రయోజనాలుంటాయని పేర్కొంది. భారతపై రూపొందించిన వార్షిక నివేదికలో ఐఎంఎఫ్ ఈ అంశాలు ప్రస్తావించింది. 2017 జూలై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన

Most from this category