STOCKS

News


జనవరిలో ఎగుమతులు అంతంతమాత్రం

Saturday 16th February 2019
Markets_main1550311773.png-24224

  • వృద్ధి కేవలం 3.74 శాతం
  • విలువలో 26.36 బిలియన్‌ డాలర్లు
  • దిగుమతుల విలువ 41 బిలియన్‌ డాలర్లు
  • వాణిజ్యలోటు 15 బిలియన్‌ డాలర్లు
  • 38 శాతం పెరిగిన పసిడి దిగుమతులు


న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు జనవరిలో నిరాశను మిగిల్చాయి. 2018 ఇదే నెలతో పోల్చిచూస్తే వృద్ధి రేటు కేవలం 3.74 శాతంగా నమోదయ్యింది. విలువ 25.51 బిలియన్‌ డాలర్ల నుంచి 26.36 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇక ఇదే సమయంలో దిగుమతులు 41 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు 15 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం...

- ఇంజనీరింగ్‌ (1 శాతం వృద్ధి), తోలు, రత్నాలు (0.33 శాతం), ఆభరణాల (6.67 శాతం) ఎగుమతులు తగ్గాయి. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు అసలు పెరక్కపోగా 19 శాతం క్షీణించాయి. 
- 2018 జనవరితో పోల్చితే(15.67 బిలయన్‌ డాలర్లు) వాణిజ్యలోటు తగ్గినా, 2018 డిసెంబర్‌లో పోల్చితే  (13 బిలియన్‌ డాలర్లు) పెరిగింది.
- జనవరిలో చమురు దిగుమతులు 3.59 శాతం పెరిగి 11.24 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 10 నెలల కాలంలో 36.65 శాతం పెరిగి 119.34 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక చమురుయేతర దిగుమతులు ఇదే సమయంలో 3.59 శాతం పెరిగి 308.39 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. 
- పసిది దిగుమతులు 38.16 శాతం పెరిగాయి. విలువలో ఈ పరిమాణం 2.31 బిలియన్‌ డాలర్లు. 2018 ఇదే నెలలో ఈ విలువ కేవలం 1.67 బిలియన్‌ డాలర్లు. 
 ఏప్రిల్‌-జనవరి మధ్య వృద్ధి 9.52 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జనవరి మధ్య ఎగుమతుల వృద్ధి 9.52 శాతంగా ఉంది. విలువలో 271.8 బిలియన్‌ డాలర్లు. ఇక ఇదే సమయంలో దిగుమతులు 11.27 శాతం పెరిగి 427.73 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్యలోటు 2017-18 ఇదే కాలంతో పోల్చిచూస్తే, 136.25 బిలియన్‌ డాలర్ల నుంచి 155.93 బిలియన్‌ డాలర్లకు ఎగసింది. 

అంతర్జాతీయ పరిస్థితులే కారణం
ఎగుమతుల స్పీడ్‌ లేకపోవడానికి అంతర్జాతీయ కఠిన పరిస్థితులు కారణం. ప్రపంచ వాణిజ్య వృద్ధి మందగించింది. తయారీ రంగం బలహీనంగా ఉంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. రుణ లభ్యత పెరగాలి. ఎగుమతుల వృద్ధికి సంబంధించి ఆర్థికపరమైన మద్దతు అవసరం.
- గణేశ్‌ కుమార్‌ గుప్తా, ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్‌

డిసెంబర్‌లో సేవల వృద్ధి 7.50 శాతం
కాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం- డిసెంబర్‌లో సేవల రంగం 7.50 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. విలువలో 17.93 బిలియన్‌ డాలర్లు. ఇక సేవల దిగుమతులు ఇదే కాలంలో 12.53 శాతం పెరిగి 11.38 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.



You may be interested

2 బిలియన్‌ డాలర్లకుపైగా తగ్గిన విదేశీ మారక నిల్వలు!

Saturday 16th February 2019

- ఫిబ్రవరి 8 నాటికి 398  బిలియన్‌ డాలర్లు ముంబై: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఫిబ్రవరి 8వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారం (1వ తేదీ)తో పోల్చిచూస్తే, 2.11 బిలియన్‌ డాలర్లు పడిపోయాయి. 398.122 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం... - 1వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారకనిల్వలు వారంవారీగా 2.063 బిలియన్‌ డాలర్లు పెరిగి 400.24 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.  - వారం తిరిగే సరికి

2-వారాల గరిష్టానికి పసిడి

Saturday 16th February 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 2వారాల గరిష్టం వద్ద స్థిరపడింది. అమెరికాలో మార్కెట్‌లో 8.20డాలర్ల లాభపడి 1,322.10 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లలలో నెలకొన్న అస్థిరత కారణంగా ఈ ఏడాది అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చనే అంచనాలతో డాలర్‌ ఇండెక్స్‌ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోంటుంది. అలాగే మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి అవసరమైన నిధుల బిల్లుకు కాంగ్రెస్‌ అనుమతులు నిరాకరిచడంతో అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ జాతీయ అత్యవవసర(నేషనల్‌

Most from this category