News


ఈ రంగాలను మరవకండి!

Tuesday 12th March 2019
Markets_main1552368844.png-24541

ఎలారా క్యాపిటల్‌ సూచన
సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది వారాలుండగా ఈక్విటీల్లో ర్యాలీ ఆరంభమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు కొన్ని రంగాలు, ఎన్నికల తర్వాత కొన్ని రంగాలు దూసుకుపోతుంటాయి. గత కొన్ని ఎన్నికలను చూస్తే ప్రీ ఎలక‌్షన్‌, పోస్ట్‌ ఎలక‌్షన్‌ ర్యాలీల ట్రెండ్‌ అర్దమవుతుందని ఎలారా క్యాపిటల్‌ తెలిపింది. క్యాపిటల్‌ గూడ్స్‌, బ్యాంక్స్‌, ఆటో, ఎనర్జీ రంగాలు ఎన్నికల ముందు జోరు చూపుతాయని తెలిపింది.


1. క్యాపిటల్‌ గూడ్స్‌: చాలా రోజులుగా క్యాపిటల్‌ సైకిల్‌లో మార్పు వస్తుందని వినిపిస్తోంది. కొత్త ప్రభుత్వం సంస్కరణాపూరితంగా ఉంటే ఈ రంగానికి మేలు జరుగుతుందన్న అంచనాలున్నాయి.
2. ఆటో: రూరల్‌ డిమాండ్‌ పెరగడంతో ఆటో రంగంలో అమ్మకాలు పెరిగాయి. తాజా పతనంలో పలు ఆటో స్టాకులు ఆకర్షణీయంగా మారాయి.
3. బ్యాంకులు: నిఫ్టీలో అధిక వెయిటేజ్‌ ఉన్న రంగమిది. క్రెడిట్‌ వృద్ధి ఊపందుకోవడంతో ఈ రంగంలో జోష్‌ పెరగనుంది.
4. ఎనర్జీ: రాబోయే రోజుల్లో ఊహించని వృద్ది నమోదు చేయగల రంగమిది. నూతన చమురు పాలసీ వచ్చిన తర్వాత ఈ రంగంలో పలు మార్పులు జరుగవచ్చు. 



You may be interested

రికార్డు గరిష్టానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Tuesday 12th March 2019

ముంబై:- దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేరు మంగళవారం రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. నేడు బీఎస్‌ఈలో రిలయన్స్‌ షేరు రూ.1317.10ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మార్కెట్లో ఇంధన రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో 2.50శాతం లాభపడి 1329.90 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.11:15ని.లకు రిలయన్స్‌ షేరు గతముగింపు ధర(రూ.1301)తో పోలిస్తే

ఆల్‌టైం హైకి ఐసీఐసీఐ

Tuesday 12th March 2019

ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో జీవితకాల గరిష్టాన్ని తాకాయి. నేడు బీఎస్‌ఈలో షేరు రూ.370.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి మార్కెట్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పలితంగా ట్రేడింగ్‌ ప్రారంభమైన కాసేపటికే 3శాతం లాభపడి రూ.386.70లకు ఎగిసింది. ఈ ధర షేరకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయ గం.10:00నిల.కు షేరు గత ముగింపు

Most from this category