STOCKS

News


ఎఫ్‌అండ్‌వో నుంచి 34 బయటకు... వీటి పట్ల జాగ్రత్త!

Friday 26th April 2019
Markets_main1556217272.png-25349

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ మార్కెట్‌ నుంచి జూన్‌ సిరీస్‌ తర్వాత 34 కంపెనీలు కనిపించవు. ఈ కంపెనీల సెక్యూరిటీలను ఎఫ్అండ్‌వో నుంచి తొలగించాలని నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని చాలా మంది నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ కంపెనీల స్టాక్స్‌కు దూరంగా ఉండాలని కూడా వారు సూచిస్తున్నారు. 

 

ఎఫ్‌అండ్‌వో నుంచి కనుమరుగయ్యే వాటిల్లో అలహాబాద్‌ బ్యాంకు,  అజంతా ఫార్మా, బీఈఎంఎల్‌, కెన్‌ఫిన్‌ హోమ్స్‌, సియట్‌, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌, డీసీబీ బ్యాంకు, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, గుజరాత్‌ స్టేట్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌, ఐడీఎఫ్‌సీ, ఐఎఫ్‌సీఐ, ఇండియన్‌ సిమెంట్స్‌, ఇండియన్‌ బ్యాంకు, ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌, కావేరి సీడ్‌ కంపెనీ, కర్ణాటక బ్యాంకు, ఎంఆర్‌పీఎల్‌, ఎన్‌హెచ్‌పీసీ, ఓబీసీ, పీసీ జ్యుయలర్‌, రెప్కో హోమ్‌, రిలయన్స్‌ పవర్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు, సుజ్లాన్‌ ఎనర్జీ, సిండికేట్‌ బ్యాంకు, టాటా కమ్యూనికేష్స్‌, టీవీ18బ్రాడ్‌కాస్ట్‌, వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌, వోకార్డ్‌ ఉన్నాయి. సెబీ గతేడాది తీసుకొచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎన్‌ఎస్‌ఈ ఈ స్టాక్స్‌ను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న మే, జూన్‌ నెల కాంట్రాక్టులు గడువు తీరే వరకు కొనసాగుతాయి. జూన్‌ 28 తర్వాత ఈ సెక్యూరిటీలకు సంబంధించి ఎటువంటి ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులు అందుబాటులో ఉండవు. 

 

‘‘ఎఫ్‌అండ్‌వో నుంచి మినహాయించడం వల్ల స్వల్ప కాలంలో ఆర్బిట్రేజ్‌ ట్రేడర్లు పొజిషన్లను తగ్గించుకుంటారు. ఒక్కసారి ఈ ప్రభావం ముగిసిన అనంతరం స్టాక్‌ ధరలు సాధారణంగానే కొనసాగుతాయి’’ అని షేర్‌ఖాన్‌ పీఎంఎస్‌ ఫండ్‌ మేనేజర్‌ రోహిత్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఈ స్టాక్‌ ఫ్యూచర్స్‌లో పొజిషనల్‌ ట్రేడ్స్‌కూ దూరంగా ఉండాలని సూచించారు. గడిచిన ఆరు నెలల కాలంలో సగటున డెలివరీ వ్యాల్యూమ్‌ రూ.10కోట్ల కంటే తక్కవగా ఉంటే ఎఫ్‌అండ్‌వో విభాగంలో చేర్చడం కుదరదని ఎన్‌ఎస్‌ఈ గతేడాదే ప్రకటించిన విషయం గమనార్హం. ‘‘ఈ నూతన అర్హత ప్రమాణాలు అన్నవి అధిక లిక్విడిటీ ఉన్న స్టాక్స్‌ మాత్రమే ఎఫ్‌అండ్‌వోలో ఉండేలా రూపొదించారు. కొన్ని స్టాక్స్‌కు మినహాయింపు ఉండొచ్చేమో. అదే సమయంలో కొన్ని మంచి పనితీరు చూపించేవి ఎఫ్‌అండ్‌వో విభాగంలోకి అ‍ర్హత పొందగలవు’’ అని ఐసీఐసీఐ డైరెక్టర్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ అమిత్‌గుప్తా పేర్కొన్నారు. ఎఫ్‌అండ్‌వో నుంచి తొలగింపు అన్నది ఆయా స్టాక్స్‌ దీర్ఘకాలిక ప్రయాణంపై ఎటువంటి ప్రభావం చూపించదని, స్వల్ప కాలంలో మాత్రం అస్థిరతలు పెరగొచ్చని, లిక్విడిటీ తగ్గుముఖం పట్టొచ్చని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ వివేక్‌ రంజన్‌ మిశ్రా తెలిపారు. ఈ స్టాక్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నట్టు మిశ్రా చెప్పారు. అయితే, అర్హత ‍ప్రమాణాలకు తూగితే ఆరు నెలల తర్వాత తిరిగి ఎఫ్‌అండ్‌వోలో అడుగు పెట్టేందుకు వీటికి అవకాశం ఉంటుంది. You may be interested

ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 26th April 2019

రెండు రోజులపాటు భారీ హెచ్చుతగ్గులకు లోనైన భారత్‌ మార్కెట్‌ శుక్రవారం మే నెల డెరివేటివ్‌ సిరీస్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించే  సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.45  గంటలకు దాదాపు ఫ్లాట్‌గా11,730 పాయింట్ల వద్ద కదులుతోంది. గురువారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,726 పాయింట్ల వద్ద ముగిసింది.  బుధవారం రాత్రి అమెరికాలో రికార్డు గరిష్టస్థాయి వద్ద ముగియగా, డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ అరశాతం నష్టంతో ముగిసింది. తాజాగా

ఈ స్టాక్స్‌పై ప్రమోటర్లు, ఎఫ్‌పీఐలు, డీఐఐల మక్కువ

Friday 26th April 2019

రిటైల్‌ ఇన్వెస్టర్లు ఏ స్టాక్స్‌ను ఎంచుకోవాలన్న మీమాంసతో ఉంటే, అటువంటి వారు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు చాలానే ఉన్నాయి. ఓ కంపెనీలో ప్రమోటర్లు వాటా పెంచుకుంటే అది సానుకూల సంకేతమే అవుతుంది. అలాగే, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు(డీఐఐలు) సైతం ఓ కంపెనీలో వాటాలు పెంచుకుంటున్నారంటే ఆ కంపెనీ భవిష్యత్తు వ్యాపార వృద్ధి అవకాశాలపై స్పష్టమైన అవగాహనతో ఆ పని చేస్తున్నట్టుగానే భావించాలి. అలా చూసినప్పుడు 12

Most from this category