STOCKS

News


ట్రేడింగ్‌ టిప్స్‌ దండగ!

Saturday 29th September 2018
Markets_main1538221560.png-20718

ప్రముఖ అనలిస్టు దీపక్‌ మొహోని
 

బొంబాయి స్టాక్‌ ఎక్చేంజ్‌ సెన్సిటివ్‌ ఇండెక్స్‌.. తెలుసా మీకు... ఎప్పుడూ వినిపించినట్లు లేదా! పోనీ సెన్సెక్స్‌ తెలుసా.. పైన చెప్పిన పే.. ద్ద పేరును సంక్షిప్తపరిస్తే సెన్సెక్స్‌గా మారింది. ఈ పదాన్ని తొలుత ప్రముఖ అనలిస్టు దీపక్‌ మొహోని వినియోగించగా, బిజినెస్‌ జర్నలిస్టులందరికీ చాలా త్వరగా సుపరిచితమైంది.

దేశంలో టెక్నికల్‌ అనాలసిస్‌ చార్టులు, విశ్లేషణలు అందుబాటులోకి తేవడంలో దీపక్‌ పాత్ర ఎంతో ఉంది. స్టాక్‌ మార్కెట్లలో ఇంత పేరు సంపాదించిన దీపక్‌కు ట్రేడింగ్‌ టిప్స్‌ ఇవ్వడమంటే పరమ చిరాకు. తాను స్వతాహాగా వీటిని ఇష్టపడనని ఆయన చెబుతారు. ఒక ట్రేడ్‌లో టిప్‌ ఇవ్వడం మంచిది కాదని, ట్రేడ్‌లో పలు అంశాలు మిళితమై ఉంటాయని, వీటిని అధ్యయనం చేయడం నేర్పడం ఉత్తమమని ఆయన అభిప్రాయం. 2007లో మార్కెట్‌ బూమ్‌ వచ్చినప్పటినుంచి ఈ టిప్స్‌ ఇచ్చే వ్యాపారానికి బాగా గిరాకీ పెరిగింది. కానీ ఇది పెద్ద దండగమారి వ్యవహారమని దీపక్‌ చెబుతారు. 
కొత్త టూల్స్‌తో..
టెక్నికల్‌ అనాలసిస్‌తో కొంత మంచి జరుగుతుందని, అలాగని కేవలం టెక్నికల్‌ విశ్లేషణతో పెట్టుబడులకు పోవడం మంచిది కాదని దీపక్‌ చెప్పారు. సాంకేతిక విశ్లేషణ వల్ల స్టాప్‌లాస్‌, మద్దతు, ఎగ్జిట్‌ స్థాయి తదితరాలు లెక్కించి పెట్టుకోవచ్చన్నారు. అయితే టెక్నికల్‌ ఇండికేటర్లు పెద్దగా ఉపయోగపడతాయని తాను భావించనన్నారు. ఎండ్‌ ఆఫ్‌ డే చార్టులంటే కేవలం ఆ రోజు జరిగిన ట్రేడ్‌ తాలుకా ప్రతిరూపమని, దీన్ని బట్టి ఉజ్జాయింపుగా అంచనాలు వేసుకోవడం తనకు నచ్చదని చెప్పారు. కేవలం గణాంకాలే పెట్టుబడికి ఆధారంగా ఉండాలన్నారు. చార్టుల కన్నా డేటా చాలా మంచిదని, శాస్త్రీయత ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి తాను త్వరలో కొత్త టూల్స్‌తో వస్తానని, వీటిని ఉపయోగించి సరైన పెట్టుబడి అవకాశాలను తెలుసుకోవచ్చని చెప్పారు. You may be interested

ఇన్ఫీబీమ్‌ షేరును ఏం చేద్దాం?

Saturday 29th September 2018

దూరంగా ఉండమంటున్న నిపుణులు ఒక్కరోజులో 70 శాతం పతనమయిన ఇన్ఫీబీమ్‌ షేరుతో దాదాపు 9200 కోట్ల రూపాయల మదుపరుల సొత్తు ఆవిరైంది. వాట్సప్‌లో సర్క్యులేట్‌ అయిన ఒక మెసేజ్‌ కారణంగా షేరు కుప్పకూలినట్లు తెలుస్తోంది. తమ మూలాలు బలంగానే ఉన్నాయని మేనేజ్‌మెంట్‌ భరోసా ఇచ్చినా షేరు కోలుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇన్ఫీబీమ్‌ షేరు ఉన్న షేరు హోల్డర్లు కాస్త పెరిగినా బయటపడిపోవడం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు. కొత్తగా ఈ

పీ/ఈతో పాటు పీ/ఎస్‌ కూడా అవసరమే!

Saturday 29th September 2018

టెక్నికల్‌ ఎనాలసిస్‌లో కీలకం మార్కెట్‌తో పరిచయం ఉన్నవారికి పీఈ నిష్పత్తి తెలుసు. పీఈ ఎక్కువగా ఉంటే వాల్యూషన్లు ఎక్కువగా ఉన్నాయని అర్దం. ఒక కంపెనీ వృద్ధి అవకాశాలు పెరిగినా, ఆర్‌ఓఈ పెరిగినా పీఈ పెరుగుతుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పీఈ ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక రంగంలో అఅధిక పీఈ ఉన్న కంపెనీలతో పోలిస్తే అల్ప పీఈ ఉన్న కంపెనీల షేర్లపై మదుపు చేస్తుంటారు. అధిక పీఈ సర్దుబాటు అయ్యేందుకు

Most from this category