STOCKS

News


నవంబర్‌లో నిఫ్టీ 400 పాయింట్ల ర్యాలీకి ఛాన్స్‌!!

Wednesday 14th November 2018
Markets_main1542180905.png-21995

నిఫ్టీ నవంబర్‌లో 400 పాయింట్లు మేర పెరగొచ్చని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెట్స్‌ అండ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌) సంజీవ్‌ భాసిన్‌ అంచనా వేశారు. ఇక్కడి నుంచి బ్యాంక్‌ నిఫ్టీ ఔట్‌పర్ఫార్మ్‌ కనబరుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఎర్నింగ్స్‌ పరంగా ఆశ్చర్యానికి గురిచేసిన కంపెనీలు ఆయా రంగాల ఇండెక్స్‌లను ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
‘కేవలం క్రూడ్‌ అని మాత్రమే కాదు. బాండ్‌ ఈల్డ్స్‌, ద్రవ్యోల్బణ గణాంకాలు, ఐఐపీ, రూపాయి ఇవ్వన్నీ సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. నిఫ్టీ 11,000 స్థాయికి చేరే అవకాశాలున్నాయి’ అని సంజీవ్‌ భాసిన్‌ వివరించారు. బ్యాంక్‌ నిఫ్టీ ఉత్తమ పనితీరు కనబరుస్తుందని తెలిపారు. ఇన్సూరెన్స్‌, స్పెషాలిటీ కెమికల్స్‌, మెటల్స్‌ వంటి రంగాల్లో కూడా మంచి వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. టాటా స్టీల్‌ క్యూ2 ఫలితాలను గమనిస్తే.. ఈబీటా టన్నుకు రూ.20,000గా ఉందన్నారు. ఇది కమోడిటీ మార్కెట్‌ బలంగా ఉన్న విషయాన్ని సూచిస్తోందని తెలిపారు. అందువల్ల నిఫ్టీ నవంబర్‌లో 10,800- 11,000 స్థాయికి చేరొచ్చని అంచనా వేశారు. క్రూడ్‌ ధరల తగ్గుదల అనేది ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లకు, బాండ్‌ మార్కెట్‌కు, ప్రభుత్వానికి, ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశమని తెలిపారు. 
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చాలా ముందుచూపుతో వెళ్తోందని, కంపెనీ మేనేజ్‌మెంట్‌ కూడా చురుకుగా పనిచేస్తోందని సంజీవ్‌ భాసిన్‌ పేర్కొన్నారు. రిలయన్స్‌.. ఎనర్జీ కంపెనీ నుంచి టెక్నాలజీ కంపెనీగా మార్పు చెందుతున్నట్లుగానే.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా మీడియా సంస్థ నుంచి టెక్నాలజీ కంపెనీగా రూపాంతరం చెందే ప్రక్రియలో ఉందని వివరించారు. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జీల్‌) ప్రమోటర్లు కంపెనీలో తమకున్న వాటాలో 50 శాతం వరకు వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించే ఆలోచనతో ఉన్నారని గుర్తుచేశారు. సెప్టెంబర్‌ త్రైమాసికం చివరికి జీల్‌లో ప్రమోటర్ల గ్రూపుకు దాదాపు 42 శాతం వాటా ఉందని, దీని విలువ రూ.17,000 కోట్లుగా ఉండొచ్చని తెలిపారు. వాటా విక్రయ ప్రతిపాదన పాజిటివ్‌ చర్య అని, సమీప కాలంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు కనీసం 10 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. 
టాటా స్టీల్‌ విషయానికి వస్తే.. సంబంధిత రంగంలో ఇదే తమ టాప్‌ పిక్‌ అని సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ, సెయిల్‌, హిందాల్కోలపై కూడా బుల్లిష్‌గా ఉన్నామని పేర్కొన్నారు. టాటా స్టీల్‌ క్యూ2 గణాంకాలను గమనిస్తే.. విదేశీ వ్యాపారం, భూషణ్‌ స్టీల్‌ కొనుగోలు అంశాలు ఫలితాలను అందిస్తున్నాయనే విషయం అర్ధమౌతుందని తెలిపారు. టన్నుకు చూస్తే మార్జిన్లు, ఈబీటా గరిష్ట స్థాయిల్లో ఉన్నాయని పేర్కొన్నారు. థైస్సేన్‌క్రుప్‌ ఇంబ్రోగ్లియో క్రమబద్దీకరణ తర్వాత టాటా స్టీల్‌ షేరు మరో 50 శాతం మేర పెరగొచ్చని అంచనా వేశారు. వచ్చే ఏడాది కాలానికి షేరు టార్గెట్‌ ప్రైస్‌ను రూ.750గా నిర్ణయించారు. 
అశోక్‌ లేలాండ్‌ క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. అయితే విక్రయాలు కొంత నిరుత్సాహపరిచాయని, అయితే దీన్ని ముందుగానే అంచనా వేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం లేదా పడ్డప్పుడల్లా ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. వచ్చే 3-5 ఏళ్ల లక్ష్యంతో చూస్తే ఎన్‌బీసీసీని కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని, వచ్చే ఏడాది కాలానికి షేరు ధర రూ.130కి చేరొచ్చని తెలిపారు.  You may be interested

టోకు ద్రవ్యోల్బణం పెరిగింది..

Wednesday 14th November 2018

అక్టోబర్‌లో 5.28 శాతంగా నమోదు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది. 5.28 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్‌ నెలలో డబ్ల్యూపీఐ 5.13 శాతంగా ఉంది. గతేడాది అక్టోబర్‌ నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.68 శాతంగా నమోదయ్యింది. ఆహార పదార్ధాల ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల కారణం టోకు ద్రవ్యోల్బణం ఎగసిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ

26000పైన బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 14th November 2018

ముడిచమురు ధరల పతనం భారత్‌ మార్కెట్‌కు బాగా కలిసొస్తుంది. చమురు ధరల క్షీణత కారణంగా రానున్న రోజుల్లో క్యాడ్‌ తగ్గుతుందనే అంచనాలతో డాలర్‌ మారకంలో రూపాయి రెండు నెలల గరిష్టాన్ని తాకింది. రూపాయి ర్యాలీతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. నిజానికి నేటి సూచీల ర్యాలీకి బ్యాంకింగ్‌ రంగ షేర్లు సారథ్యం వహిస్తున్నాయిని  చెప్పవచ్చు. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీలో భాగంగా ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ బ్యాంక్‌ 1.50శాతం లాభపడి 26వేల

Most from this category