STOCKS

News


నెక్ట్స్‌ ర్యాలీ బ్యాంకులతోనే!!

Monday 22nd October 2018
Markets_main1540186884.png-21353

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో తదుపరి ర్యాలీ బ్యాంకులతో ఉంటుందని, ఐటీతో కాదని అవెండస్‌ క్యాపిటల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆండ్రూ హోలండ్‌ తెలిపారు. చాలా వరకు ప్రతికూలతలు సెప్టెంబర్‌ నెలలోనే మార్కెట్‌పై ప్రభావం చూపించేశాయని పేర్కొన్నారు. వ్యాల్యుయేషన్స్‌ చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఆర్‌బీఐ ప్రస్తుత పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించిందని, లిక్విడిటీకి సంబంధించి ఇది మంచి చర్య అని కితాబిచ్చారు. అలాగే ఆర్‌బీఐ లిక్విడిటీ మెరుగుదలకు దోహదపడే పలు చర్యలు తీసుకుందని తెలిపారు. మళ్లీ అవసరమైనప్పుడు తగిన చర్యలు తీసుకుంటుందని ధీమా వక్తంచేశారు. రూపాయి మారకపు విలువ నిలకడగా ఉంటోందని పేర్కొన్నారు. క్రూడ్‌ ధరలు తగ్గాయని తెలిపారు. ఇవ్వన్నీ మార్కెట్‌కు సానుకూల అంశాలని అభిప్రాయపడ్డారు. 
మార్కెట్‌ పరిస్థితుల్లో మార్పులు వస్తే.. అప్పుడు బ్యాంకింగ్‌ రంగం వల్ల ర్యాలీ కొనసాగుతుందని ఆండ్రూ హోలండ్‌ అంచనా వేశారు. ఐటీ రంగం వల్ల ర్యాలీ ఉండబోదని తెలిపారు. ఈ కోణంలో మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదని సూచించారు. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే అది వర్ధమాన మార్కెట్లకు సానుకూల అంశమౌతుందని తెలిపారు. అలాగే క్యూ3లో చైనా జీడీపీ వృద్ధి రేటు మరీ అంత దారుణంగా ఏమీ లేదని, 6.5 శాతంగా నమోదయ్యిందని గుర్తుచేశారు. అందువల్ల చైనా ఆర్థిక వృద్ధి మందగమనంపై భయాలు అవసరం లేదని తెలిపారు. 



You may be interested

డిస్కౌంట్లో ఇండెక్స్‌ ఫ్యూచర్లు

Monday 22nd October 2018

సోమవారం భారీగ్యాప్‌అప్‌తో మార్కెట్‌ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే ఇండెక్స్‌ ఫ్యూచర్లు డిస్కౌంట్లోకి మళ్లిపోయాయి. దాంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సైతం ట్రేడింగ్‌ లాభాల్ని పోగొట్టుకున్నాయి. 10,410 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వెనువెంటనే 10,289 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. ఉదయం 11 గంటల సమయానికి స్పాట్‌ నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 10,324 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ ఫ్యూచర్‌ 10 పాయింట్ల డిస్కౌంట్‌తో 10,314 పాయింట్ల

జీఎస్‌టీ రిటర్నుల గడువు 25వరకు పొడిగింపు

Monday 22nd October 2018

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌ నెలకు సంబంధించి జీఎస్‌టీ రిటర్నుల దాఖలు గడువును ఈ నెల 25వరకు పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో 2017 జూలై-2018 మార్చి కాలానికి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందాలనుకునే వ్యాపార సంస్థలు ఈ నెల 25 వరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కు సంబంధించి గడువు ఈ నెల 20వరకే ఉండడం పట్ల వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్టు

Most from this category