STOCKS

News


పదిరోజుల్లో భారీ షార్ట్‌కవరింగ్‌?!

Monday 18th March 2019
Markets_main1552891502.png-24658

ఈక్విటీ 99 అంచనా
దేశీ మార్కెట్లో భారీ షార్ట్‌ పొజిషన్లు పోగయి ఉన్నాయని ఈక్విటీ 99 ప్రతినిధి సుమిత్‌ బిల్‌గయాన్‌ చెప్పారు. ఆర్థిక సంవత్సరం త్వరలో ముగిసిపోతున్న నేపథ్యంలో మరో పది రోజుల్లో భారీ షార్ట్‌ కవరింగ్‌ చూడవచ్చని అంచనా వేశారు. ఎంఎఫ్‌లు తమ ఎన్‌ఏవిల విలవ పెంచి చూపడానికి యత్నిస్తాయని, అందువల్ల మార్కెట్లో ర్యాలీ ఉంటుందని చెప్పారు. ఇన్వెస్టర్లు ప్రతి పతనాన్ని ఒక అవకాశంగా మలచుకోవాలని సూచించారు. నిఫ్టీకి ప్రస్తుతం 11255-11365 పాయింట్ల రేంజ్‌లో మద్దతు ఉందని, పైన 11525-11650 పాయింట్ల రేంజ్‌లో నిరోధం ఉందని తెలిపారు. ఎఫ్‌పీఐలు దేశీయ మార్కెట్లో నికర కొనుగోలుదారులుగా మారాయన్నారు. గత నెల ఎఫ్‌పీఐలు దేశీయ మార్కెట్లో దాదాపు 13600 కోట్ల రూపాయల కొనుగోళ్లు చేశారు. ఈ నెల ఇంతవరకు సుమారు 19వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు చేశారు. 2017 మార్చి తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఎఫ్‌ఐఐలు కొనుగోళ్లు జరపడం ఇదే తొలిసారి. దీంతో సూచీల్లో పరుగులు కొనసాగుతున్నాయి. గత వారం నిఫ్టీ 391 పాయింట్లు, బ్యాంకు నిఫ్టీ 1620 పాయింట్లు ర్యాలీ జరిపాయి. 



You may be interested

విశ్రాంత జీవనానికి సోపానం

Monday 18th March 2019

భారీ నిధి సమకూర్చుకోవాలి ఉద్యోగం ఆరంభం నుంచే ఇందుకు ప్రణాళిక ఎంచుకున్న సాధనాల్లో క్రమం తప్పకుండా పెట్టుబడులు దాంతో భవిష్యత్తు అవసరాలకు తగినంత భద్రత అందుబాటులో మ్యూచువల్‌ ఫండ్స్‌, ఈక్విటీ పెన్షన్‌ ఫండ్స్‌ యూనిట్‌ లింక్డ్‌ పెన్షన్‌ప్లాన్లు, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ ఒక్కో సాధనంలో భిన్న ప్రయోజనాలు వేతన జీవులు అందరూ తాము రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత నిశ్చింతగా జీవించేందుకు ముందుగానే ప్రణాళిక బద్ధంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఈ విషయమై ఇటీవలి సంవత్సరాల్లో అవగాహన విస్తృతం అవుతోంది. దీంతో రిటైర్మెంట్‌

బ్యాంకు స్టాకుల్లో మరింత ర్యాలీ!

Monday 18th March 2019

నిపుణుల అంచనా ప్రీఎలక‌్షన్‌ ర్యాలీని ఆరంభించిన బ్యాంకు స్టాకుల దూకుడుతో బ్యాంకు నిఫ్టీ ఈ నెల్లో రికార్డు గరిష్ఠాలను దాటేసింది. బ్యాంకు స్టాకుల దూకుడు ట్రేడర్లను ఆకట్టుకుంటోంది. దీంతో పలువురు కొత్త లాంగ్స్‌ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఐసీఐసీఐ, యాక్సిస్‌ కౌంటర్లలో కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ మదుపరులు ఈ రెండు స్టాకుల్లో భారీగా పెట్టుబడులు పెడుతుండడంతో రిటైలర్లు సైతం వీటిపై మక్కువగా ఉన్నారు. నిఫ్టీలో ఫైనాన్స్‌ రంగ స్టాకుల వెయిటేజ్‌ అధికం.

Most from this category